ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ కోన శశిధర్, మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత
పంద్రాగస్టు వేడుకలు అనంతలోనే
Published Wed, Jul 20 2016 12:23 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
► ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు
► పీటీసీని సందర్శించిన మంత్రులు
రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలు ఈసారి అనంతపురంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వచ్చాయి. దీంతో మంగళవారం మంత్రులు పల్లెరఘునాథరెడ్డి, పరిటాల సునీత నగరంలోని పీటీసీ మైదానాన్ని పరిశీలించారు. వేడుకలు పీటీసీలో నిర్వహించాలని రాష్ట్ర సాధారణ పరిపాలనశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయని మంత్రులతో పాటు కలెక్టర్ శశిధర్ వెల్లడించారు.
ముఖ్యమంత్రిచే జెండా ఆవిష్కరణ, వీవీఐపీల వేదికలు, ప్రజలు కూర్చోవడానికి వీలుగా ఏర్పాట్లు, రంగులు వేయడం, స్టేడియం చుట్టూ హైమాస్ లైట్ల ఏర్పాటు, ప్రభుత్వ శకటాల ప్రదర్శన, పోలీసు సాయుధ దళాల మార్చ్‌ఫాస్ట్, స్వాతంత్య్ర∙సమరయోధులకు సన్మానం, ఉత్తమ అవార్డుల పంపిణీ తదితర వాటికి సంబంధించి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు.
చరిత్రలో ఒక తీపిగురుతుగా మిగిలిపోయేలా వేడుకలు నిర్వహిద్దామన్నారు. శానిటేషన్, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ రాజశేఖరబాబు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ వెంకటేష్, ఆర్‌డీఓ మలోలా, డీఎస్పీ మల్లికార్జునవర్మ, అర్‌అండ్‌బీ ఇంజనీర్లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement