PTC
-
ఓఎన్జీసీ చేతికి పీటీసీ ఎనర్జీ
న్యూఢిల్లీ: పవర్ ట్రేడింగ్ సొల్యూషన్స్ సంస్థ పీటీసీ ఇండియా తమ అనుబంధ సంస్థ పీటీసీ ఎనర్జీలో పూర్తి వాటాలను ప్రభుత్వ రంగ ఓఎన్జీసీకి విక్రయించనుంది. ఇందుకోసం సంస్థ విలువను రూ. 2,021 కోట్లుగా లెక్కగట్టినట్లు సంస్థ తెలిపింది. పీటీసీ ఎనర్జీలో 100 శాతం వాటాల కొనుగోలు కోసం ఓఎన్జీసీ రూ. 925 కోట్లు నగదు చెల్లించేందుకు బిడ్‌ను దాఖలు చేసిందని, దీని ప్రకారం సంస్థ విలువ రూ. 2,021 కోట్లుగా (రుణాలు, ఈక్విటీ విలువ మొదలైనవన్నీ కలిపి) ఉంటుందని పీటీసీ ఇండియా తెలిపింది. మిగతా బిడ్డర్లతో పోలిస్తే ఓఎన్జీసీ అత్యధికంగా బిడ్ చేయడంతో దాన్ని ఎంపిక చేసినట్లు వివరించింది. సంబంధిత నిబంధనలు, షేర్‌హోల్డర్ల ఆమోదం మేరకు ఈ ఒప్పందం ఉంటుందని సంస్థ పేర్కొంది. 2008లో ఏర్పాటైన పీఈఎల్ .. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లో 288.8 మెగావాట్ల సామర్ధ్యంతో ఏడు పవన విద్యుత్ ప్రాజెక్టులను నెలకొలి్పంది. -
పూర్తయ్యేదెన్నడో?
– పీటీసీలో అసంపూర్తిగా పనులు - స్వాతంత్ర్య వేడుకల సమయంలో హడావుడి - అనంతరం పట్టించుకోని అధికారులు అనంతపురం సెంట్రల్ : రాష్ట్ర స్థాయి స్వాతంత్ర్య వేడుకలు పీటీసీ మైదానంలో జరుగుతుండడంతో స్టేడియానికి మహర్దశ రానుందని అప్పట్లో అందరూ భావించారు. దాదాపు రూ. 2 కోట్లు నిధులు ఖర్చు పెడుతున్నారంటే స్టేడియం సర్వాంగ సుందరంగా తయారవుతుందని ఆశించారు. అప్పట్లో కలెక్టర్ కూడా రాష్ట్రంలో బెస్ట్ స్టేడియంగా తీర్చిదిద్దుదామని ప్రకటించారు. అయితే రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలు ముగిసినా స్టేడియానికి మహర్దశ రాలేదు. రాష్ట్ర విభజన తర్వాత తొలి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (ఆగష్టు 15) జిల్లాలోని పీటీసీ మైదానంలో జరిగాయి. నగరంలో రోడ్లు, నీలం సంజీవరెడ్డి స్టేడియం (పీటీసీ) అభివృద్ధి, ఇతర పనులకు సంబంధించి దాదాపు రూ.3 కోట్ల వరకు ఖర్చు చేశారు. కేవలం 15 నుంచి 20 రోజుల వ్యవధిలోనే ఈ పనులు జరిగాయి. అయితే పనుల నాణ్యత దేవుడికెరుక.. కానీ పూర్తి చేయాల్సిన పనులను వదిలేశారు.అప్పట్లో పనుల నాణ్యతపై అనేక విమర్శలు వినిపించాయి. స్టేడియం విషయానికొస్తే అంతా నాసిరకంగానే చేపట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టేడియం చుట్టూ ప్రేక్షకుల గ్యాలరీ, టైల్స్ ఏర్పాటు విషయంలో అలసత్వం వహించారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో టైల్స్ ఏర్పాటు చేయలేదు. భారీ వర్షాలు వచ్చినప్పుడు స్టేడియంలో నుంచి వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన పైపులైన్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. స్టేడియంలో క్రీడాపోటీలు జరిగేందుకు మైదానం కూడా అనువుగా ఉందా? అన్న అంశంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్టేడియంలో అక్కడక్కడ ఎగుడుదిగుడుగా ఉండడంతో వర్షం వచ్చిన సమయంలో మడుగులను తలపిస్తోంది. స్వాతంత్ర దినోవ్సం రోజున కూడా పెండింగ్ పనులు కనపించకుండా గ్రీన్ కార్పైట్ పర్చారు. అయితే తక్కువ సమయం ఉండడంతో పనులు చేపట్టలేకపోయారేమో.. తర్వాత పూర్తి చేస్తారు అని భావించారు. అయితే ఆగష్టు 15వ తేదీ వరకూ జరిగిన పనులే.. ఆ తర్వాత పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేద్దామన్న ఆలోచన అధికారుల్లో కనిపించడం లేదు. వేడుకలు ముగిసి దాదాపు 5 నెలలు కావస్తోంది. దీంతో పెండింగ్ పనులు ఇక అంతేనా? అనుమానాలు కలుగుతున్నాయి. జిల్లా ఎస్పీ ఏమన్నారంటే.. ఈ విషయంపై జిల్లా ఎస్పీ రాజశేఖరబాబును వివరణ కోరగా... స్వాతంత్ర వేడుకలు జరుగుతున్న సమయంలో పీటీసీ మైదానం అభివృద్ధి పనులు ఆర్అండ్బీ అధికారులు చేపట్టారని తెలిపారు. పెండింగ్ పనులపై కూడా వారే చెప్పాలన్నారు. ఆర్అండ్బీ ఎస్ఈ సుబ్రమణ్యం, డీఈ సంజీవయ్యను వివరణ కోరగా... పెండింగ్‌లో పనులు ఉన్న మాట వాస్తవమేనని తెలిపారు. అయితే మెజర్మెంట్స్ వేయకపోవడం వల్ల పనులు చేపట్టలేదని అన్నారు. త్వరలో పెండింగ్ పనులు కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
పంద్రాగస్టు వేడుకలు అనంతలోనే
► ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు ► పీటీసీని సందర్శించిన మంత్రులు రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలు ఈసారి అనంతపురంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వచ్చాయి. దీంతో మంగళవారం మంత్రులు పల్లెరఘునాథరెడ్డి, పరిటాల సునీత నగరంలోని పీటీసీ మైదానాన్ని పరిశీలించారు. వేడుకలు పీటీసీలో నిర్వహించాలని రాష్ట్ర సాధారణ పరిపాలనశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయని మంత్రులతో పాటు కలెక్టర్ శశిధర్ వెల్లడించారు. ముఖ్యమంత్రిచే జెండా ఆవిష్కరణ, వీవీఐపీల వేదికలు, ప్రజలు కూర్చోవడానికి వీలుగా ఏర్పాట్లు, రంగులు వేయడం, స్టేడియం చుట్టూ హైమాస్ లైట్ల ఏర్పాటు, ప్రభుత్వ శకటాల ప్రదర్శన, పోలీసు సాయుధ దళాల మార్చ్ఫాస్ట్, స్వాతంత్య్ర∙సమరయోధులకు సన్మానం, ఉత్తమ అవార్డుల పంపిణీ తదితర వాటికి సంబంధించి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. చరిత్రలో ఒక తీపిగురుతుగా మిగిలిపోయేలా వేడుకలు నిర్వహిద్దామన్నారు. శానిటేషన్, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ రాజశేఖరబాబు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ వెంకటేష్, ఆర్డీఓ మలోలా, డీఎస్పీ మల్లికార్జునవర్మ, అర్అండ్బీ ఇంజనీర్లు పాల్గొన్నారు. -
దొడ్డిదారిలో ‘విద్యుత్’ దోపిడీ!
* విద్యుత్‌ను అధిక ధరకు తెలంగాణకు విక్రయించేందుకు ఏపీ యత్నం * మిగులు విద్యుత్‌ను పక్క రాష్ట్రానికి ఇవ్వాలంటున్న పునర్విభజన చట్టం * మిగులు విద్యుత్ విక్రయానికి పీటీసీతో ఆంధ్రప్రదేశ్ ఒప్పందం * అదే విద్యుత్‌ను తెలంగాణకు అధిక ధరకు అమ్మేందుకు పీటీసీ ప్రయత్నాలు * యూనిట్‌కు రూ.5.35 లెక్కన 500 ఎంవీ విక్రయానికి టెండర్లు దాఖలు సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్ల కోసం తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఇటీవల ఆహ్వానించిన టెండర్లలో ‘సరికొత్త’ పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర పునర్విభజన చట్టం చెప్పినా తెలంగాణకు విద్యుత్ వాటా ఇచ్చేందుకు ససేమిరా అన్న ఏపీ ప్రభుత్వం... అధిక ధర దండుకునేందుకు అదే విద్యుత్‌ను దొడ్డిదారిన అంటగట్టే ప్రయత్నం చేస్తోంది. విభజన చట్టంలోని ‘రైట్ ఆఫ్ రెఫ్యూజల్’ నిబంధనలను కాదని ‘మరో మార్గం’లో తెలంగాణకు విద్యుత్‌ను విక్రయించేందుకు పోటీపడుతోంది. మొత్తంగా ఈ ఉదంతం తెలంగాణ పట్ల ఏపీ పాలకుల వైఖరికి అద్దం పడుతోంది. పీటీసీని అడ్డుపెట్టుకుని.. తెలంగాణ డిస్కంలు ప్రైవేటు కంపెనీల నుంచి 2,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్ల కోసం గతంలో కుదుర్చుకున్న తాత్కాలిక ఒప్పందాలు మే నెలతో ముగియబోతున్నాయి. ఈ లోటును పూడ్చుకోవడానికి 2016 మే 27 నుంచి 2017 మే 25 వరకు ఏడాది కాలానికి 2,000 మెగావాట్ల తాత్కాలిక విద్యుత్ కొనుగోళ్ల కోసం గత నెలలో డిస్కంలు టెండర్లను ఆహ్వానించాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాల నుంచి మొత్తం 2,500 మెగావాట్లకు టెండర్లు దాఖలయ్యాయి. అందులో యూనిట్‌కు రూ.5.35 చొప్పున 500 మెగావాట్ల ‘ఏపీ జెన్కో’విద్యుత్‌ను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ (పీటీసీ) సైతం టెండర్ వేసింది. దీనిపై తెలంగాణ అధికారులు లోతుగా పరిశీలన జరపగా... విద్యుత్ పంపకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోమారు రాష్ట్ర పునర్విభజన చట్టానికి తూట్లు పొడిచినట్లు బయటపడింది. పునర్విభజన చట్టంలోని 12వ షెడ్యూల్ ప్రకారం... తెలంగాణ, ఏపీల్లో ఏ రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉన్నా రెండో రాష్ట్రానికి కేటాయించడానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ఒకవేళ ఆ రాష్ట్రం తిరస్కరిస్తేనే మరెవరికైనా అమ్ముకోవచ్చు. అయితే ఈ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఏపీ జెన్కో 500 మెగావాట్ల మిగులు విద్యుత్‌ను పీటీసీకి విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అదే విద్యుత్‌ను తెలంగాణకు విక్రయించేందుకు పీటీసీ టెండర్లు దాఖలు చేసింది. ఏటా రూ. 200 కోట్ల భారం..! వాస్తవానికి ఏపీలో 1,000 మెగావాట్ల మిగులు విద్యుత్ ఉందని... యూనిట్‌కు రూ.4.90 చొప్పున దానిని విక్రయిస్తామని ఆ రాష్ట్ర డిస్కంలు ఇటీవల ఏపీఈఆర్సీలో దాఖలు చేసిన ఏఆర్‌ఆర్‌లో పేర్కొన్నాయి. అంటే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ‘రైట్ ఆఫ్ రెఫ్యూజల్’ నిబంధనల ప్రకారం... ఏపీలో ఉన్న ఈ మిగులు విద్యుత్ యూనిట్‌కు రూ.4.90 లెక్కన తెలంగాణకు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పుడు పీటీసీ ద్వారా యూనిట్‌కు రూ.5.35 ధరతో 500 మెగావాట్లను తెలంగాణ డిస్కంలు కొనుగోలు చేస్తే... రాష్ట్రంపై ఏటా రూ.200 కోట్ల అదనపు భారం పడనుంది. ఈ నేపథ్యంలో ‘రైట్ ఆఫ్ రిఫ్యూజల్’ నిబంధనలు అమలు చేసే విధంగా ఏపీపై ఒత్తిడి పెంచాలని విద్యుత్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.