న్యూఢిల్లీ: పవర్ ట్రేడింగ్ సొల్యూషన్స్ సంస్థ పీటీసీ ఇండియా తమ అనుబంధ సంస్థ పీటీసీ ఎనర్జీలో పూర్తి వాటాలను ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీకి విక్రయించనుంది. ఇందుకోసం సంస్థ విలువను రూ. 2,021 కోట్లుగా లెక్కగట్టినట్లు సంస్థ తెలిపింది. పీటీసీ ఎనర్జీలో 100 శాతం వాటాల కొనుగోలు కోసం ఓఎన్‌జీసీ రూ. 925 కోట్లు నగదు చెల్లించేందుకు బిడ్‌ను దాఖలు చేసిందని, దీని ప్రకారం సంస్థ విలువ రూ. 2,021 కోట్లుగా (రుణాలు, ఈక్విటీ విలువ మొదలైనవన్నీ కలిపి) ఉంటుందని పీటీసీ ఇండియా తెలిపింది.
మిగతా బిడ్డర్లతో పోలిస్తే ఓఎన్‌జీసీ అత్యధికంగా బిడ్ చేయడంతో దాన్ని ఎంపిక చేసినట్లు వివరించింది. సంబంధిత నిబంధనలు, షేర్‌హోల్డర్ల ఆమోదం మేరకు ఈ ఒప్పందం ఉంటుందని సంస్థ పేర్కొంది. 2008లో ఏర్పాటైన పీఈఎల్ .. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లో 288.8 మెగావాట్ల సామర్ధ్యంతో ఏడు పవన విద్యుత్ ప్రాజెక్టులను నెలకొలి్పంది.
Comments
Please login to add a commentAdd a comment