రాజధాని పొలాలు పరిశీలించిన ఉండవల్లి
ఈ ప్రకృతి అందాలు ఇక కనుమరుగేనా.. అంటూ నిట్టూర్పు
తాడేపల్లి రూరల్: రాజధాని ప్రతిపాదిత ప్రాంతాలైన పెనుమాక, ఉండవల్లిని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ బుధవారం పర్యటించారు. అక్కడి పొలాలను పరిశీలించారు. ఉండవల్లి గ్రామంలోని భీమలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని సంద ర్శించారు. పర్యటనలో భాగంగా ఇటీవల ఉండవల్లి, పెనుమాక గ్రామాలలో పంట పొలాల్లో పంట సామాగ్రి దహనమైన ప్రాంతాలను పరిశీలించారు.
రైతులు ఎంతమేర నష్టపోయారనే విషయాన్ని వాకబు చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామరైతులు అరుణ్‌కుమార్‌ను కలుసుకొని, తమ సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. పంట పొలాలను ఇవ్వబోమన్న తమను పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిప్పుతున్న వైనాన్ని ఆయనకు వివరించారు. అయితే ఆయన మాత్రం వాటిపై ఏ మాత్రం స్పందించలే దు.
పచ్చటి పొలాలు పూదోటలను చూసి, భవిష్యత్తులో ఈ ప్రకృతి అందాలు, ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేనా...? అని మధన పడుతూ తన వ్యక్తిగత ఫొటోగ్రాఫర్‌తో ఫొటోలు తీరుుంచుకున్నారు. తాను వ్యక్తిగత పనుల నిమిత్తం వచ్చానని ఈ క్రమంలో రైతుల ఆవేదన విని పంట పొలాల పరిశీలించేందుకు వచ్చినట్లు తెలిపారు. ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, స్నేహితులు ఉన్నారు.