
సాక్షి, కాకినాడ : ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తప్పుడు సమాచారాలు సేకరించి ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఆయన బుధవారం కాకినాడ రూరల్‌లో కోరమండల్ సహకారంతో పేదలకు బియ్యం నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ‘కరోనా నివారణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 24 గంటలు ప్రభుత్వాన్ని నిమగ్నపరిచి పని చేస్తున్నారు. ప్రతిపక్ష నేత మాత్రం హైదరాబాద్‌లో ఉండి ఖాళీ దొరికినప్పుడల్లా లేఖ రాస్తున్నారు. (ఏపీలో ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం)
ముందు హెరిటేజ్ కంపెనీలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసులు ఎందుకు గోప్యంగా ఉంచారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఆయనకు రాష్ట్ర ప్రజలపై నిజమైన ప్రేముంటే ఎందుకు ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టడం లేదు. కరోనాకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు? మేమందరం తిరగడం లేదా?. రాజధాని పేరుతో పెద్ద ఎత్తున భూములు సేకరించి చెట్లు, తోటలు నరికించిన దుర్మార్గాన్ని ప్రజలు మరిచిపోలేదు. మిల్లర‍్లు ఎక్కడైనా ధాన్యం ధర తగ్గించి కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కరోనా వల్ల నష్టపోయిన రైతులను వర్షాలను సాకుగా చూపి దోచుకోవడం మంచి పద్ధతి కాదు’ అని హితవు పలికారు. (ఉప్పల్ హెరిటేజ్: క్వారంటైన్కు 34 మంది)
Comments
Please login to add a commentAdd a comment