న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో మునుపెన్నడూ లేని నీచపు రాజకీయానికి.. అది ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు తెర తీశారని వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది. మరోవైపు హిందూ సంఘాలు.. ఇంకోవైపు నలభై ఏళ్ల బాబు రాజకీయం గురించి తెలిసిన నేతలూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. జాతీయ పార్టీ టీఎంసీ సైతం చంద్రబాబు తీరుపై అనుమానాలు వ్యక్తం చేసింది.
టీఎంసీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సాకేత్ గోఖలే ఎక్స్ వేదికగా చేసిన ఓ ఆసక్తికరమైన పోస్ట్.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపణలకు దిగారు. అందుకు ల్యాబ్ రిపోర్టులను సాక్ష్యంగా చూపిస్తున్నారు. లడ్డూల కోసం ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఆయన పార్టీ ఆరోపిస్తోంది. అయితే..
చంద్రబాబు, ఆయన సతీమణి పేరిట హెరిటేజ్ పుడ్స్ అనే డెయిరీ సామ్రాజ్యం ఉందని, అది నెయ్యి కూడా ఉత్పత్తి చేస్తోందని అన్నారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల సమయంలో నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా ఇదే హెరిటేజ్ సంస్థ షేర్లు 1,200 కోట్ల రూపాయలకు పైగా లాభాల్లోకి వెళ్లాయని సాకేత్ గుర్తు చేశారు. అప్పట్లో బీజేపీ, స్టాక్ మార్కెట్‌ను మానిప్యులేట్ చేయడం వల్లే ఇది సాధ్యపడిందని ఆరోపించారు.
𝐈𝐦𝐩𝐨𝐫𝐭𝐚𝐧𝐭:
𝐈𝐬 𝐭𝐡𝐞 𝐓𝐢𝐫𝐮𝐩𝐚𝐭𝐢 𝐥𝐚𝐝𝐝𝐨𝐨𝐬 𝐬𝐭𝐨𝐫𝐲 𝐫𝐞𝐚𝐥 𝐨𝐫 𝐢𝐬 𝐢𝐭 𝐚 𝐟𝐚𝐤𝐞 𝐜𝐨𝐧𝐭𝐫𝐨𝐯𝐞𝐫𝐬𝐲 𝐜𝐫𝐞𝐚𝐭𝐞𝐝 𝐰𝐢𝐭𝐡 𝐁𝐉𝐏’𝐬 𝐡𝐞𝐥𝐩 𝐟𝐨𝐫 𝐛𝐨𝐨𝐬𝐭𝐢𝐧𝐠 𝐩𝐫𝐨𝐟𝐢𝐭𝐬 & 𝐩𝐥𝐚𝐲𝐢𝐧𝐠 𝐩𝐨𝐥𝐢𝐭𝐢𝐜𝐬?
Andhra Pradesh CM @ncbn… pic.twitter.com/Em5JxD4H1s— Saket Gokhale MP (@SaketGokhale) September 21, 2024
ఎవరి కుటుంబమైతే నెయ్యి- పాల ఉత్పత్తి రంగాన్ని శాసిస్తోందో.. అదే కుటుంబానికి చెందిన వ్యక్తి ఇప్పుడు తిరుమల లడ్డూల విషయంలో కూడా గుజరాత్‌కు చెందిన ఓ ప్రైవేట్ ల్యాబొరేటరీ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని ఆరోపణలు చేశారని సాకేత్ గోఖలే ప్రస్తావించారు.
మొత్తంగా.. రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు.. తిరుమల లడ్డూపై ఆరోపణలు చేశారని, దీనికోసం బీజేపీ సహకారాన్ని సైతం తీసుకున్నారని సాకేత్ గోఖలే ఆరోపించారు.
ఇదీ చదవండి: దేవుడే ఇక చంద్రబాబుకి బుద్ధి చెప్తాడు!
Comments
Please login to add a commentAdd a comment