టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే అనుమానం
‘ప్రైవేట్ ల్యాబ్ రిపోర్ట్’ ఆధారంగా అల్లిన కట్టు కథా?
నెయ్యి, పాల సామ్రాజ్యాన్ని నియంత్రించే కుటుంబం ఆరోపణలు యాదృచ్ఛికం
సాక్షి, అమరావతి: తిరుపతి శ్రీవారి లడ్డూ తయారీపై చెలరేగిన వివాదంపై తృణమోల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే స్పందించారు. ఇది నిజమా.. లేక రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ఆరోపణా.. అని ‘ఎక్స్’లో అనుమానం వ్యక్తం చేశారు. ‘తిరుపతి లడ్డూల కథ వాస్తవమా లేక చంద్రబాబు హెరిటేజ్ సంస్థ లాభాలను పెంచుకోవడానికి, రాజకీయ లబ్ధి కోసం బీజేపీ సహాయంతో అల్లిన కట్టుకథా? జంతువుల కొవ్వు, పంది కొవ్వుతో తిరుపతి ప్రసాద లడ్డూలు చేశారని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ల్యాబ్ రిపోర్టు చూపించారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారని ఆయన పార్టీ పేర్కొంది.
ఇందులో ఆసక్తి ఏంటంటే చంద్రబాబు నాయుడు, అతని భార్య నెయ్యి తయారు చేసే హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ నడుపుతున్నారు. లోక్‌సభ ఫలితాలప్పుడు బీజేపీ అవకతవకలకు పాల్పడిందన్న ఆరోణలున్నాయి. అదే సమయంలో చంద్రబాబుకు చెందిన కంపెనీ షేర్లు గాలివాటంగా అమాంతం పెరిగిపోయి ఆయన కుటుంబానికి రూ.1,200 కోట్లు లాభాలు తెచి్చపెట్టాయి.
ఇప్పుడు తిరుపతి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిపై ఆరోపణలు రావడం.. గుజరాత్ నుంచి వచ్చిన ‘ప్రైవేట్ ల్యాబ్ రిపోర్ట్’ ఆధారంగా నెయ్యి, పాల సామ్రాజ్యాన్ని నియంత్రించే ఓ కుటుంబం ఆరోపణలు చేయడం యాదృచి్చకం’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు చంద్రబాబును ట్యాగ్ చేయడంతో పాటు హెరిటేజ్ సంస్థ ఉత్పత్తుల చిత్రాలను సైతం జత చేశారు. పోస్ట్ ప్రారంభంలో ‘ఇంపార్టెంట్’ అని మొదలుపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment