చంద్రబాబు పాలనలోనే ఆలయాల్లో అనేకానేక అపచారాలు
మతం, దేవుడిని అడ్డుపెట్టుకుని చంద్రబాబు నిత్యం జగన్‌పై అభాండాలు
ఆరోపణలు తప్ప వాటిపై విచారణ మాత్రం శూన్యం
జగన్ సీఎంగా ఉన్నప్పుడూ తిరుమల కొండపై శిలువ అంటూ నానాయాగీ
తిరుమలలో వెయ్యి కాళ్ల మండపం ధ్వంసం చేసినా..
విజయవాడ దుర్గగుడిలో క్షుద్రపూజల జరిగినా అన్నీ బాబు హయాంలోనే..
సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా మతాన్ని, దేవుడిని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా నోటికొచ్చినట్లు ఆరోపణలు చేయడంలో సీఎం చంద్రబాబు ఆయన భజన బృందం దిట్ట. తన ఆరోపణలకు సంబంధించి నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు ఆయన ఏనాడూ ఉన్నతస్థాయి విచారణకు ముందుకురాలేదు. ఈ విషయంలో ఆయనపై మొదట నుంచీ విమర్శలున్నాయి. అలాగే, చంద్రబాబు హయాంలోనే అనేక అపచారాలూ చోటుచేసుకున్నాయని భక్తులు గుర్తుచేస్తున్నారు. ఉదా..
» తాజాగా.. చంద్రబాబు పాలనలోనే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీనెయ్యి అంశం వెలుగుచూసింది. కానీ, ఆయన సిగ్గూఎగ్గూ లేకుండా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి అంటగడుతూ వివాదానికి తెరలేపారు.
» రెండేళ్ల క్రితం జగన్ సీఎంగా కొనసాగుతున్న సమయంలో టీడీపీ, ఆ పార్టీ శ్రేణులు తిరుమల కొండపై శిలువ అంటూ సామాజిక మాధ్యమాల్లో నానా రభస సృష్టించిన విషయం తెలిసిందే. అప్పట్లో టీటీడీ ఈ అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండించడంతో పాటు బాధ్యులపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో ఆ దు్రష్పచారానికి తెరపడింది.
» అలాగే, గత ఏడాది ఆగస్టులో కూడా తిరుమల కాలిబాటలో పులుల సంచారం వెలుగులోకి వస్తే భక్తుల భద్రతకోసం ప్రతి 250 మెట్లకు ఒక గార్డు చొప్పన 70 మందిని భక్తులకు కాపలా ఉంచేందుకు నిర్ణయించడంతో పాటు అత్యవసర సమయంలో ఉపయోగకరంగా ఉంటుందని భక్తులకు ఉచితంగా కర్రలను అందించాలని టీటీడీ సంకల్చిచింది. దీనినీ పచ్చ బ్యాచ్ వక్రీకరిస్తూ కర్రకు పది రూపాయలు రుసుం పెట్టి, టీటీడీ కర్రల వ్యాపారం చేసిందని పెద్దఎత్తున దు్రష్పచారం చేస్తే, అప్పట్లో టీడీపీయే దానిని ఖండించుకుంది.
» ఇక అదే నెలలో తిరుపతి గోవిందస్వామి రాజస్వామి ఆలయ గోపురం అంశంలోనూ దు్రష్పచారమే చేశారు.
» ఇలా తిరుమల ఆలయానికి మాత్రమే పరిమితం కాకుండా దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు సంబంధించి ఇదే తరహా దు్రష్పచారాలకు పచ్చమూకలు తెగబడ్డాయి.
» గత ఏడాది ఆగస్టులో కాణిపాకం ఆలయంలో పంచామృత అభిõÙకం టికెట్ ధర రూ.700 నుంచి రూ.5,000లకు పెంచకుండానే పెంచారంటూ దు్రష్పచారం చేశాయి.
బాబు హయాంలోనే దుర్గగుడిలో క్షుద్ర పూజలు..
ఇక పవిత్ర పూజా కార్యక్రమాల్లో బూట్లు వేసుకుని తరచూ పూజల్లో పాల్గొనే చంద్రబాబు గత కృష్ణా పుష్కరాల సమయంలో ఆయన విజయవాడలో దాదాపు 30 గుళ్లను నేలమట్టం చేశారు. ఆ విగ్రహాలను చెత్త ట్రాక్టర్లలో తరలించి భక్తుల మనోభావాలను దారుణంగా దెబ్బతీశారు. మరోవైపు.. 2014–19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే విజయవాడ దుర్గగుడిలో క్షుద్ర పూజల కలకలం రేగింది. దీనికి సంబంధించి ఆలయ గర్భగుడిలో గుర్తుతెలియని వ్యక్తులు సంచరించినట్లు వీడియోలు కూడా బయటకొచ్చాయి.
» అంతేకాదు.. 1995–2004 మధ్య 1472 సంవత్సరం నాటి తిరుమల వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చివేసిన ఘటన కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment