కేసు పెడితే నెయ్యి కల్తీ జరగలేదని రుజువవుతుందని వెనుకంజ
కేవలం దుష్ప్రచారంతో రాజకీయ లబ్ధి పొందే యత్నం
నేరం జరిగిందని తెలిస్తే ఎవరైనా ఏం చేస్తారు? వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. మరి ఎంతో ప్రాశస్త్యమైన చరిత్ర కలిగిన, పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం సరఫరా చేసిన నేయిలో జంతువుల కొవ్వు కలిపితే ఏం చేయాలి? వెంటనే కల్తీ నేయి సరఫరా చేసిన కంపెనీపై ఫిర్యాదు చేయాలి. కేసు పెట్టాలి. ఆధారాలతో సహా నిరూపించాలి. దోషులకు శిక్షపడేట్టు చేయాలి. ఆహార భద్రతా చట్టం అందుకు అవకాశం కల్పిస్తోంది కూడా. కానీ సీఎం హోదాలో ఉన్న చంద్రబాబుకు మాత్రం అవేవీ పట్టడం లేదు. ఊకదంపుడు నిరాధార రాజకీయ ఆరోపణలతో లబ్ధి పొందడానికే యతి్నస్తున్నారు.
సాక్షి, అమరావతి: టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని తమకు జూలై 23నే తెలిసిందని చెబుతున్న చంద్రబాబు.. మరి ఆ నెయ్యి సరఫరా చేసిన కంపెనీపై ఎందుకు కేసు పెట్టలేదన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పక పోవడం విస్తుగొలుపుతోంది. నెయ్యిలో కల్తీ జరిగిందని నిరాధార ఆరోపణలతో రాద్ధాంతం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకే కుట్రకే ప్రాధాన్యమిస్తున్నారు. తద్వారా అడ్డదారిలో రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుతానని మరోసారి నిరూపించారు.
లడ్డూ ప్రసాదం తయారీ కోసం టీటీడీకి సరఫరా చేసిన ఆవు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ ల్యాబ్ నివేదిక వెల్లడించినట్టు చంద్రబాబు ప్రభుత్వం పక్కా పన్నాగంతో దు్రష్పచారాన్ని తెరపైకి తెచి్చంది. జూలై 23న నివేదిక వచ్చిందని కూడా టీడీపీ కూటమి ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించింది. మరి నెయ్యి కల్తీ జరిగినట్టు జూలై 23నే తెలిస్తే.. రాష్ట్ర ప్రభుత్వంగానీ టీటీడీగానీ ఏం చేయాలి? చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కల్తీ నెయ్యి సరఫరా చేసిన సంస్థపై కేసు నమోదు చేయాలి. ఎందుకంటే టెండరు నిబంధనలను ఉల్లంíœుంచి కల్తీ నెయ్యి సరఫరా చేయడం నేరం.
అందులోనూ కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత దెబ్బతినేలా కల్తీ నెయ్యి సరఫరా చేయడం మహాపరాధం. జంతువుల కొవ్వుతో కల్తీ చేసిన నెయ్యిని సరఫరా చేయడమే నిజమైతే.. ఆ కల్తీ నెయ్యితో లడ్డూ ప్రసాదం తయారు చేయడమే నిజమైతే.. కల్తీ నెయ్యి సరఫరా చేసిన సంస్థపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ ఎన్‌డీడీబీ ల్యాబ్ నివేదిక వచ్చి 2 నెలలైనా సరే చంద్రబాబు ప్రభుత్వం ఆ కంపెనీపై కేసు పెట్టనే లేదు.
కల్తీ చేస్తే 6 నెలల నుంచి 3 ఏళ్ల జైలు శిక్ష
కల్తీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలకు ఆహార భద్రత చట్టం అవకాశం కలి్పస్తోంది. ఆ చట్టంలోని సెక్షన్ 15ఏ ప్రకారం.. ఆహార పదార్థాల్లో కల్తీకి పాల్పడిన వారిపై, కల్తీ ఆహార పదార్థాలు సరఫరా చేసిన సంస్థపై భారీ జరిమానాతో పాటు ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు అవకాశం కలి్పస్తోంది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపి కల్తీ చేశారని నిరూపితమైతే సరఫరా సంస్థపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆ సంస్థపై కేసు నమోదు చేయనే లేదు. ఎందుకంటే కేసు నమోదు చేస్తే.. నిబంధనల ప్రకారం దర్యాప్తు జరుగుతుంది.
నెయ్యి సరఫరా చేసిన సంస్థ తాము కల్తీ చేయలేదని ఘంటాపథంగా వాదిస్తోంది. తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయని సవాల్ విసురుతోంది. దాంతో టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని రుజువు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అవుతుంది. కానీ టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని చంద్రబాబు ప్రభుత్వానికి తెలుసు. అందుకే ఆ సంస్థపై కేసు నమోదు చేయలేదన్నది అసలు లోగుట్టు. అయినా సరే చంద్రబాబు నిస్సిగ్గుగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. పవన్, లోకేశ్ తదితరులు నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment