సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిధిలో నిబంధనలు ఉల్లంఘిస్తూ జీఎస్టీ పేరుతో అధిక ధరలకు విక్రయిస్తున్న షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్‌లపై తూనికలు, కొలతలశాఖ కొరడా ఝులిపించింది. కేంద్రం పలు వస్తువులపై జీఎస్టీ తగ్గించినా ఇప్పటికీ పాత ధరలకే విక్రయిస్తున్న షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లపై తూనికలశాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. మొత్తం 16 బృందాలు గ్రేటర్ హైదరాబాద్‌లోని మణికొండ, మాదాపూర్, హైటెక్‌సిటీ, బాచుపల్లి, కొంపెల్లి, బంజారాహిల్స్, పంజాగుట్ట, నాంపల్లి, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, బేగంబజార్, కూకట్‌పల్లి, మియాపూర్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి 125 కేసులు నమోదు చేశారు.
ఇందులో రత్నదీప్ సూపర్ మార్కెట్‌పై 18, హెరిటేజ్ సూపర్ మార్కెట్‌పై 13, మోర్ సూపర్ మార్కెట్‌పై 5, స్పెన్సర్స్‌పై 7, బిగ్‌బజార్‌పై 15, విజేత సూపర్ మార్కెట్, మహావీర్ ఎలక్ట్రికల్ అండ్ హార్డ్‌వేర్, భగవతి పెయింట్స్ అండ్ హార్డ్‌వేర్, బిగ్ సీ, హైపర్ మార్కెట్లపై కేసులు నమోదు చేశారు. పెర్‌ఫ్యూమ్స్, శానిటరీ న్యాప్కిన్స్‌పై జీఎస్టీ ఉల్లంఘనలకు పాల్పడినందుకు హెరిటేజ్, రత్నదీప్‌లపై కేసులు నమోదు అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment