more
-
బాహుబలి కంటే ఎక్కువ యాక్షన్ సీన్స్ చేశాను – సత్యరాజ్
‘‘వెపన్’లాంటి సినిమా తీయాలంటే డైరెక్టర్,ప్రొడ్యూసర్స్, సినిమాటోగ్రాఫర్, వీఎఫ్ఎక్స్.. ఇలా సాంకేతిక నిపుణులే కీలకం. వాళ్ల తర్వాత యాక్టర్స్‌కు ప్రాధాన్యత అని నా అబిప్రాయయం. ‘బాహుబలి’ కంటే ‘వెపన్’లో ఎక్కువ యాక్షన్ సీన్స్ చేశా. గుహన్ సరికొత్త విజన్‌తో తీశారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది’’ అన్నారు సత్యరాజ్. గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వంలో సత్యరాజ్, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వెపన్’. మన్సూర్ నిర్మించిన ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ‘‘సరికొత్త సూపర్ హ్యూమన్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందింది’’ అన్నారు వసంత్ రవి. ‘‘మా బ్యానర్లో వస్తోన్న తొలి చిత్రమిది’’ అన్నారు మన్సూర్. ‘‘ఈ చిత్రంలో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సులున్నాయి’’ అన్నారు గుహన్ సెన్నియప్పన్. -
హెల్త్ ఇన్సూరెన్స్‌పై కీలక సర్వే! ఈ విషయాలు తెలుసుకోండి!
ముంబై: అవసరమైతే ఖరీదైన కొనుగోళ్లకు దూరంగా ఉండి మరీ, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని దేశంలో మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ నిర్వహించిన సర్వేలో 85 శాతం మంది ఇదే చెప్పారు. 19 పట్టణాల నుంచి 6,600 మంది సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేశారు. కరోనాతో అనిశ్చితి, ఆందోళనకర పరిస్థితులతో మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడినట్టు ఈ సర్వే నివేదిక పేర్కొంది. సర్వేలో పాల్గొన్న 89 శాతం మంది తమ హెల్త్ ఇన్సూరెన్స్‌లో హెల్త్ కన్సల్టేషన్ (వైద్య సలహా) కూడా భాగంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. కనుక మానసిక ఆరోగ్యంపై అత్యవసర అవగాహన అవసరం ఉన్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. కరోనా తర్వాత ఆరోగ్యం, శ్రేయస్సుపై తమ అవగాహన పెరిగినట్టు 84 శాతం మంది సర్వేలో చెప్పారు. వైద్య అత్యవసరాల్లో వినియోగించుకునేందుకు వీలుగా కొంత నిధిని పక్కన పెట్టనున్నట్టు 52 శాతం మంది తెలిపారు. ఖర్చు దృష్ట్యా తాము మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించేందుకు వెనుకాడినట్టు 35 శాతం మంది వెల్లడించారు. తాము బరువు, రక్తపోటు తదితర ఆరోగ్య అంశాలను తరచూ పర్యవేక్షించుకోవడం లేదని ప్రతి ముగ్గురిలో ఒక్కరు చెప్పడం గమనార్హం. కరోనా తర్వాత ఆరోగ్యం విషయంలో ప్రజల ఆలోచన విధానం మారిందని, ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండడంతోపాటు అత్యవసర పరిస్థితుల పట్ల సన్నద్ధతను అర్థంచేసుకుంటున్నారని ఆదిత్య బిర్లాహెల్త్ ఇన్సూరెన్స్ సర్వే నివేదిక తెలిపింది. ‘‘ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరాన్ని కరోనా తర్వాత ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. టెక్నాలజీ సాయంతో తాము తీసుకునే ఆహారాన్ని పర్యవేక్షించుకుంటున్నారు’ ’అని ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈవో మయాంక్ భత్వాల్ తెలిపారు. -
టీవీ, గృహోపకరణాల ధరలకు రెక్కలు
న్యూఢిల్లీ: టీవీలు, ఇతర గృహోపకరణాల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తయారీ వ్యయాలు పెరిగినప్పటికీ ఇటీవల పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు రేట్ల పెంపును కాస్తంత వాయిదా వేసుకున్నాయి. దీంతో వాటి మార్జిన్లపై ప్రభావం ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ పెరగడం కంపెనీలపై భారం పెరిగేలా చేసింది. ఈ పరిస్థితులను అధిగమించి, తమ మార్జిన్లను బలోపేతం చేసుకునేందుకు కంపెనీలు ధరల పెంపును చేపట్టాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే పెంచగా, ప్యానాసోనిక్ ఇండియా 7 శాతం మేర తన ఉత్పత్తుల ధరలను పెంచనుంది. ‘‘గత కొన్ని నెలలుగా రూపాయి క్షీణిస్తూ రావడం వల్ల మా తయారీ వ్యయాలపై ప్రభావం పడింది. అయితే, చాలా వరకు మేం సర్దుబాటు చేసుకున్నాం. కానీ మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే నెల నుంచి 5–7 శాతం స్థాయిలో పెంచక తప్పడం లేదు’’ అని ప్యానాసోనిక్ ఇండియా ప్రెసిడెంట్ మనీష్ శర్మ తెలిపారు. పండుగల తర్వాత నుంచి తాము రేట్ల పెంపును చేపట్టినట్టు హయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ సైతం తెలిపారు. కంపెనీల వార్షిక విక్రయాల్లో మూడింట ఒకవంతు దసరా, దీపావళి సమయంలోనే జరుగుతుంటాయి. సెప్టెం బర్లో 3–4% ధరలు పెంచినప్పటికీ అవి ఇంకా ఆచరణ రూపం దాల్చలేదని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంఘం (సీఈఏఎంఏ) సైతం తెలిపింది. ఎంఆర్పీ పెంచినప్పటికీ డిమాండ్ తగ్గడం, మార్కెట్ వాటా కోసం బ్రాండ్ల మధ్య పోటీతో అమల్లోకి రాలేదని వివరించింది. తమ టెలివిజన్ల ధరలను పెంచే ఆలోచనేదీ లేదని సోనీ స్పష్టం చేసింది. -
అమెజాన్ చేతికి మోర్!!
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమైన మోర్ సూపర్ మార్కెట్ చెయిన్ (ఆదిత్య బిర్లా రిటైల్ –ఏబీఆర్ఎల్) ఇక అంతర్జాతీయ రిటైలింగ్ దిగ్గజం అమెజాన్ చేతికి చేరనుంది. ఇందుకు సంబంధించి సమర ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌తో మోర్ బ్రాండ్ మాతృసంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 4,200 కోట్లుగా ఉంటుందని అంచనా. ఆదిత్య బిర్లా రిటైల్ (ఏబీఆర్ఎల్)కి ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోర్ బ్రాండ్ కింద 509 మోర్ బ్రాండెడ్ సూపర్మార్కెట్లు, 20 హైపర్మార్కెట్లు ఉన్నాయి. సగభాగం పైగా స్టోర్స్ దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలోనే ఉన్నాయి. ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ రిటైల్, డీమార్ట్ తర్వాత మోర్ నాలుగో స్థానంలో ఉంది. గతేడాది ఏప్రిల్ నాటికి ఏబీఆర్ఎల్ నికర రుణం రూ. 6,456 కోట్లుగా ఉంది. 2016 నుంచి స్టోర్స్ సంఖ్య పెరుగుతూ వస్తున్నప్పటికీ.. కంపెనీ వ్యయాలను నియంత్రించుకుంటూ వస్తోంది. నిర్వహణపరమైన నష్టాల నేపథ్యంలో స్టోర్స్ పరిమాణం, అద్దెలు తగ్గించుకుంటోంది. గతంలో త్రినేత్ర సూపర్‌మార్కెట్‌గా తెలుగురాష్ట్రాల్లో పేరొందిన బ్రాండ్‌నే ఆదిత్య బిర్లా గ్రూప్ 2007లో కొనుగోలు చేసి మోర్గా పేరు మార్చింది. ఒప్పందం ఇలా.. ఏబీఆర్‌ఎల్‌లో కుమార మంగళం బిర్లా.. ఆయన కుటుంబానికి చెందిన ఆర్కేఎన్ రిటైల్‌కి 62 శాతం, కనిష్ట ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్కి 37 శాతం వాటాలు ఉన్నాయి. రెండు హోల్డింగ్ కంపెనీలు .. ఏబీఆర్‌ఎల్‌లోని తమ తమ వాటాలను సమర ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌కి చెందిన విట్‌జీగ్ అడ్వైజరీ సర్వీసెస్‌కు విక్రయించనున్నట్లు ఆర్కేఎన్ రిటైల్ సంస్థ వెల్లడించింది. వాస్తవానికి సమర ఈ ఏడాది జూన్‌లోనే ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత గోల్డ్‌మన్ శాక్స్, అమెజాన్‌ని కూడా ఇందులో భాగం చేసింది. ఈ డీల్ కోసం మూడు సంస్థలు ప్రత్యేక సంస్థను లేదా స్పెషల్ పర్పస్ వెహికల్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఇందులో వ్యూహాత్మక భాగస్వామిగా అమెజాన్ 49 శాతం వాటాలు దక్కించుకోనుంది. ఏబీఆర్‌ఎల్‌లో వాటాలు కొంటున్న విట్‌జీగ్ అడ్వైజరీలో కూడా అమెజాన్‌కు వాటాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రకంగా మొత్తం మీద చూస్తే అమెజాన్ చేతికి మోర్ చేరినట్లు కానుంది. భారత విదేశీ ఇన్వెస్ట్మెంట్ చట్టాల ప్రకారం మోర్ లాంటి మల్టీ బ్రాండ్ రిటైలర్స్‌లో విదేశీ కంపెనీలు 49% వరకే ఇన్వెస్ట్ చేయడానికి ఉంది. దీంతో అవి దేశీ సంస్థలతో జట్టు కట్టి ఇలాంటి కొనుగోళ్లు జరుపుతున్నాయి. ఇటీవలే ఇదే తరహా డీల్‌లో టీపీజీ, శ్రీరామ్ గ్రూప్‌ల నుంచి విశాల్ రిటైల్‌ను రూ.5,000 కోట్లతో కొనుగోలు చేసేందుకు స్విట్జర్లాండ్‌కి చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ పార్ట్నర్స్ గ్రూప్.. దేశీ ఫండ్ హౌస్ కేదార క్యాపిటల్‌తో జట్టు కట్టింది. 1.1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్.. ఇప్పటిదాకా ఆన్లైన్ వ్యాపారానికే పరిమితమైన అమెజాన్..ఆఫ్‌లైన్ స్టోర్స్‌పైనా దృష్టి పెడుతోంది. భారత రిటైల్ మార్కెట్ ప్రస్తుతం 672 బిలియన్ డాలర్లుగా ఉండగా.. 2020 నాటికల్లా 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ రిటైల్ దిగ్గజాలు భారత్‌పై దృష్టి సారిస్తున్నాయి. ఇటీవలే దేశీ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మెజారిటీ వాటాలను అమెరికా రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ 16.7 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. దీని కోసం అమెజాన్ కూడా పోటీపడినప్పటికీ కుదరలేదు. అయితే, గతేడాది షాపర్స్ స్టాప్‌లో రూ. 179 కోట్లు పెట్టి 5% వాటాలు కొనుగోలు చేసింది.ఇక ఇప్పుడు మోర్లో కూడా ఇన్వెస్ట్ చేసిన పక్షంలో దేశీ రిటైల్ రంగంలో అమెజాన్‌కి ఇది రెండో పెట్టుబడి కానుంది. స్థానికంగా తయారయిన ఆహారోత్పత్తులను ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో విక్రయించే అనుబంధ సంస్థను 500 మిలియన్ డాలర్లతో ఏర్పాటు చేసేందుకు గతంలో అనుమతులు వచ్చినప్పటికీ.. విధానాల్లో అస్పష్టత కారణంగా అమెజాన్ రంగంలోకి దిగలేదు. అయితే, ఆహార, నిత్యావసరాల విభాగంలో ప్రవేశించేందుకు చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న అమెజాన్‌కి.. మోర్లో ఇన్వెస్ట్ చేయడం లాభించనుంది. -
హెరిటేజ్ , మోర్, రత్నదీప్‌లపై కేసులు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో నిబంధనలు ఉల్లంఘిస్తూ జీఎస్టీ పేరుతో అధిక ధరలకు విక్రయిస్తున్న షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లపై తూనికలు, కొలతలశాఖ కొరడా ఝులిపించింది. కేంద్రం పలు వస్తువులపై జీఎస్టీ తగ్గించినా ఇప్పటికీ పాత ధరలకే విక్రయిస్తున్న షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లపై తూనికలశాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. మొత్తం 16 బృందాలు గ్రేటర్ హైదరాబాద్‌లోని మణికొండ, మాదాపూర్, హైటెక్‌సిటీ, బాచుపల్లి, కొంపెల్లి, బంజారాహిల్స్, పంజాగుట్ట, నాంపల్లి, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, బేగంబజార్, కూకట్పల్లి, మియాపూర్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి 125 కేసులు నమోదు చేశారు. ఇందులో రత్నదీప్ సూపర్ మార్కెట్‌పై 18, హెరిటేజ్ సూపర్ మార్కెట్‌పై 13, మోర్ సూపర్ మార్కెట్‌పై 5, స్పెన్సర్స్‌పై 7, బిగ్‌బజార్‌పై 15, విజేత సూపర్ మార్కెట్, మహావీర్ ఎలక్ట్రికల్ అండ్ హార్డ్‌వేర్, భగవతి పెయింట్స్ అండ్ హార్డ్‌వేర్, బిగ్ సీ, హైపర్ మార్కెట్లపై కేసులు నమోదు చేశారు. పెర్ఫ్యూమ్స్, శానిటరీ న్యాప్కిన్స్పై జీఎస్టీ ఉల్లంఘనలకు పాల్పడినందుకు హెరిటేజ్, రత్నదీప్‌లపై కేసులు నమోదు అయ్యాయి. -
దైన్యాగారం
ధాన్యాగారంగా పేరొందిన పశ్చిమడెల్టా దైన్యాగారంగా మారుతోంది. వరి విస్తీర్ణం రోజురోజుకూ కుచించుకుపోతోంది. చేపలు, రొయ్యల చెరువుల విస్తీర్ణం చాపకింద నీరులా పెరుగుతోంది. ఫలితంగా జిల్లాలో ఆహారభద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచిఉంది. చెరువుల జోరుకు ఇప్పుడే కళ్లెం వేయకపోతే భవిష్యత్తులో వరిసాగు కనుమరుగైపోయే పెనుప్రమాదం పొంచి ఉంది. కొవ్వూరు : పశ్చిమడెల్టా ఆయకట్టు మొత్తం 5, 29, 962 ఎకరాలు. దీనిలో ఇప్పటికే సుమారు లక్ష ఎకరాలు చెరువులుగా మారిపోయాయి. గత పదేళ్లుగా చెరువులపై మోజు విపరీతంగా పెరిగింది. ఈ ఏడాది కొత్తగా 11వేల ఎకరాలు చెరువులుగా మారినట్టు అధికారిక అంచనా. ఈ లెక్క వాస్తవానికి ఇంకా ఎక్కువే ఉంటుంది. కొందరు అధిక లాభాల ఆశచూపి రైతుల చేత చెరువులు తవ్వించేస్తున్నారు. దీనివల్ల పెను ప్రమాదాలు పొంచి ఉన్నాయని, ఆహార భద్రత కొరవడడంతోపాటు కాలుష్యం ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. ఈ నియోజకవర్గాల్లో చేపలు, రొయ్యల చెరువులు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. దీనివల్ల ఆ ప్రాంతాల్లో భూగర్భజలాలూ కలుషితమైపోయాయి. పాలకొల్లు, నరసాపురం, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లోనూ రొయ్యల చెరువులు విస్తరిస్తున్నాయి. సాగునీటి దోపిడీ చేపల చెరువులు ఇబ్బడిముబ్బడిగా పెరగడం వల్ల సాగునీటి దోపిడీ కూడా పెరిగింది. పశ్చిమడెల్టా కాలువల నుంచి ప్రధానంగా సాగు, తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం ఇస్తారు. ఆ తర్వాత చేపల చెరువులకు నీరు తోడుకోవచ్చు. కానీ చేపల చెరువుల యజమానులు విచ్చలవిడిగా నీటి దోపిడీకి పాల్పడుతున్నారు. పంట కాలువల నుంచి యథేచ్ఛగా నీటిని తోడేసుకుంటున్నారు. పెను నీటి ఎద్దడి దీనివల్ల వరి సాగుకు, తాగునీటికి తీవ్ర ఎద్దడి నెలకొంది. ఈ ఏడాది సాగునీటి ఎద్దడితోపాటు మంచినీటి చెరువులనూ నింపుకోలేని దుస్థితి నెలకొంది. దీంతో వరిచేలు బీటలు వారుతున్నాయి. మంచినీటి చెరువులు వెలవెలబోతున్నాయి. ఫలితంగా గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు అర్రులుచాస్తున్నారు. నిబంధనలకు తూట్లు.. కాలుష్యపు కాట్లు చేపల చెరువుల తవ్వకంలో యజమానులు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. వాస్తవానికి చేపల చెరువులు తవ్వాలంటే పంట కాలువలకు మూడు మీటర్లు దూరం పాటించాలి. విధిగా ఇన్లెట్, అవుట్లెట్ సౌకర్యం ఉండేలా చూసుకోవాలి. కానీ యజమానులు ఈ నిబంధనలు పాటించడం లేదు. పంటకాలువల గట్లను ఆనుకుని చెరువులను తవ్వేస్తున్నారు. ఇ¯Œలెట్, అవుట్లెట్ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. పంట కాలువల నుంచి నీటిని యథేచ్ఛగా తోడుకుంటూ చెరువుల్లోని వ్యర్థ ఉప్పనీటిని పంటకాలువల్లోకి వదిలేస్తున్నారు. దీనివల్ల కాలువలు కలుషితమవుతున్నాయి. ఈ నీరు పొలాల్లోకి చేరడంతో చేలు చౌడుబారుతున్నాయి. ఫలితంగా అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రజాప్రతినిధుల ప్రోత్సాహం భీమవరం : చేపలు, రొయ్యల చెరువుల తవ్వకానికి ప్రజాప్రతినిధులే ప్రోత్సాహం అదిస్తున్నారు. చెరువుల యజమానుల నుంచి ముడుపులు తీసుకుని అనుమతులు ఇప్పిస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భీమవరం, ఉండి, ఉంగుటూరు నియోజకవర్గాలో ఈ పరిస్థితి నెలకొన్నట్టు తరచూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధులే కాక వారి అనుచరులు, సహాయకులు కూడా చెరువుల తవ్వకం పేరిట భారీగా లాభపడుతున్నట్టు విమర్శలొస్తున్నాయి. ఇటీవల ఓ ఎమ్మెల్యే చెరువులకు అనుమతులు ఇప్పించి లాభపడడాన్ని దగ్గరుండి చూసిన అతని సహాయకుడూ అదే బాట పట్టాడు. అతను చెరువులకు అనుమతులు ఇప్పిస్తానని చెప్పి పలువురి వద్ద నుంచి రూ.రెండుకోట్ల మేర వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల డెల్టాలో చెరువుల తవ్వకాన్ని ఉన్నతాధికారులు కట్టుదిట్టం చేయడం ఆ సహాయకునికి వరంగా మారింది. చెరువుల తవ్వకానికి ప్రాంతాన్ని బట్టి ఎకరాకు రూ.40వేల వరకు వసూలు చేసినట్టు సమాచారం. ఎమ్మెల్యే సిఫార్సు పేరుతో అనుమతులివ్వాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం ఎట్టకేలకు ఎమ్మెల్యే చెవిన పడడంతో ఆ సహాయకుడిని ఆయన విధుల నుంచి తప్పించినట్టు ప్రచారం జరగుతోంది. నిబంధనల సడలింపు వల్లే.. చెరువులకు అనుమతుల విషయంలో నిబంధనల సడలించడం వల్ల తవ్వకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గతంలో చెరువు తవ్వాలంటే రెవెన్యూ, నీటిపారుదలశాఖ, మత్స్యశాఖ తదితర 13 శాఖల నుంచి అనుమతులు పొందాల్సి ఉండేది. దీంతో పంటభూములు చెరువులుగా మారాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. అయితే 2014లో తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చెరువుల తవ్వకానికి అనుమతులను సరళతరం చేసింది. దీంతో చెరువుల తవ్వకానికి అడ్డూఅదుపూ లేకుండా పోయింది. వాస్తవానికి జిల్లాలో ఎక్కడా రొయ్యల సాగుకు అనుమతి లేదు. అయినా అక్రమార్కులు అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకుని యథేచ్ఛగా రొయ్యల సాగు చేపట్టేస్తున్నారు. చేపల చెరువులకు అనుమతి తీసుకుని రొయ్యల సాగు చేపడుతున్నారు. చేపల చెరువుల కంటే రొయ్యల చెరువుల సాగు వల్లే జల కాలుష్యం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డెల్టా స్వరూపం ఇదీ.. జిల్లాలో పశ్చిమడెల్టా 29 మండలాల్లో విస్తరించి ఉంది. దీనిపరిధిలో డెల్టా ప్రధాన కాలువతో కలిపి 357 కిలోమీటర్ల పొడవున 11 కాలువలు ఉన్నాయి. పంపిణీ కాలువలు 1,766 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. నాలుగు సబ్డివిజన్లలో 19 సెక్షన్ల పరిధిలో ఆయకట్టు ఉంది. నీటి పారుదల కోసం ప్రాజెక్టు కమిటీతోపాటు 20 పంపిణీ కమిటీలు, 131 నీటి వినియోగదారుల సంఘాలు ఉన్నాయి. -
స్టార్టప్స్ సంక్షోభం...ఉద్యోగులపై భారీ వేటు
ముంబయి / న్యూఢిల్లీ / బెంగళూరు: దేశీయ ఈ-కామర్స్ సంస్థల ఉద్యోగులు ప్రమాదంలో పడనున్నారు. ఇటీవల వందలమందిపై వేటు వేసిన దేశీయ అతిపెద్ద ఈ కామర్స్ స్నాప్‌డీల్ బాటనే ఇతర సంస్థలు అనుసరిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ మందగమనం, ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఈ-కామర్స్, ఫుడ్-టెక్, లాజిస్టిక్ స్టార్టప్ కంపెనీలు భారీ ఎత్తున ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధపడుతున్నాయి. దాదాపు16వందలమందికి పైగా 'పింక్ స్లిప్'లను జారీ చేశాయి. ఈ వేసవిలో వారంతా మరో ఉద్యోగాన్ని చూసుకోవాలని అల్టిమేట్టం కూడా జారీ చేశాయి. ముఖంగా సంప్రదాయ వస్త్రాలను మార్కెటింగ్ చేస్తున్న క్రాఫ్ట్స్ విల్లా, ఫ్యాషన్ పోర్టల్ యప్ మీ, టోలెక్సో వంటి స్టార్టప్ కంపెనీలు ఇటీవల వందలమందిని తొలగించేందుకు నిర్ణయించాయి. స్థిరమైన వృద్ధితో వేగంగా ఎదగలేక పోతున్న మధ్యతరహా సంస్థలు ఇప్పుడు ఖర్చులను తగ్గించుకునే పేరిట వందలాది మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నాయని ఈ దోరణి ఇంకా కొనసాగే అవకాశం ఉందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా అత్యధికులను ఈ సంవత్సరమే తీసివేసే ఆలోచనలో కంపెనీలు ఉన్నాయని కన్సల్టెన్సీ సంస్థ వజీర్ అడ్వయిజర్స్ ఎండీ హర్మీందర్ సాహ్నీ వ్యాఖ్యానించారు. మరికొన్ని కంపెనీలు పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయన్నారు. పేమెంట్ గేట్ వే సంస్థ పేయూ, తన 85 మంది ఉద్యోగుల కాల్ సెంటర్ విభాగాన్ని 25 మందికి కుదించింది. మాతృసంస్థ ఇండియా మార్ట్ లో విలీనమైన టొలెక్సో, 50 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే తామీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని టొలెక్సో సీఈఓ బ్రిజేష్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. ఉద్యోగుల తొలగింపుకు స్పందించిన ఆయన కారణాలను వెల్లడించేందకు నిరాకరించినప్పటికీ.. డీమానిటైజేషన్ కూడా ఒక కారణమన్నారు. ఫ్యాషన్ రీటైలర్ 'యప్ మీ' వేర్‌హౌసింగ్, క్వాలిటీకంట్రోల్ విభాగంనుంచి ఉద్యోగులను తొలగించింది. తాము పెట్టిన పెట్టుబడులు గత సంవత్సరంలోనే తిరిగి వస్తాయని ఆశించామని, కానీ నోట్ల రద్దు కారణంగా బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయామని సంస్థ వ్యవస్థాపకుడు వివేక్ గౌర్ చెప్పారు. నోట్ల రద్దు తరువాత ఇండియాలో అమ్మకాలు పడిపోయాయని, దీంతో విదేశాల్లో విస్తరణపై దృష్టిని సారించేందుకు ఇక్కడ ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. మరోవైపు క్రాఫ్ట్స్ విల్లా సంస్థ తన పూర్తి ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ విభాగాన్ని మూసివేస్తూ, 100 మందికి పైగా ఉద్యోగులను, ఇతర ఉన్నతాధికారులను తొలగించింది. ఈ తొలగింపుపై వివరణ కోరేందుకు సంస్థ సీఈఓ మనోజ్ గుప్తాను సంప్రదించాలని చూడగా, ఆయన అందుబాటులో లేరు. కాగా, స్టార్టప్ సంస్థల్లో నిధుల లేమి, పెట్టుబడుల కొరత కూడా ఉద్యోగాల తొలగింపునకు కారణంగా తెలుస్తోంది. 2015లో సుమారు రూ. 13 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన స్టార్టప్ సంస్థలు, గత సంవత్సరం కేవలం రూ. 8,500 కోట్ల పెట్టుబడులకు పరిమితం అయ్యాయి. 2015తో పోలిస్తే, ఇది దాదాపు 28 శాతం తక్కవ. దీంతో మార్కెటింగ్, అడ్వర్టయిజింగ్ విభాగాల్లో ఖర్చులను తగ్గించుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందని నిపుణులు పేర్కొంటున్నారు. -
సైనిక సంపత్తిని మరింత పెంచుకుంటున్న రష్యా
-
జిల్లావ్యాప్తంగా వర్షం
సిరిసిల్లలో 5.6 సెంటీమీటర్లు నమోదు సాధారణానికి మించిన వర్షం 7 మండలాల్లో లోటు వర్షపాతం ముకరంపుర: జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో బుధవారం రాత్రి మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లాలో సగటున 2.4 సెంటీమీటర్లు నమోదు కాగా.. అత్యధికంగా సిరిసిల్ల మండలంలో 5.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముత్తారం(మంథని), పెగడపల్లి, ధర్మపురి, మేడిపల్లి, కథలాపూర్, రామడుగులో లోటు వర్షపాతం ఉంది. బుధవారం రాత్రి నుంచి ఉదయం వరకు కురిసిన వర్షపాతంలో మెట్పల్లి, రాయికల్, బోయినిపల్లిలో 4.6 సెంటీమీటర్లు, కథలాపూర్, ఇబ్రహీంపట్నం 4.5, మహాముత్తారం 3.3, మల్హర్రావు 2.9, మహదేవపూర్ 1.9, కమాన్‌పూర్ 3.5, కాటారం 3.1, వెల్గటూర్ 2, రామగుండం 2.4, సుల్తానాబాద్ 1.3, ధర్మారం 2.2, జూలపల్లి 3.3, పెద్దపల్లి 1, కోనరావుపేట 1.7, ఇల్లంతకుంట 3.2, చందుర్తిలో 2.8, వేములవాడ 4.4, ఎల్లారెడ్డిపేట 2.1, గంభీరావుపేట 3.1, ముస్తాబాద్ 1.8, పెగడపెల్లి 2.2, గొల్లపల్లి 2.4, ధర్మపురి 1.7, మేడిపల్లి 2.3, కొడిమ్యాల 4.2, మల్యాల 3.2, జగిత్యాల, మల్లాపూర్, సారంగాపూర్ 3, కోరుట్ల 2.2, రామడుగు 3.9, మానకొండూర్ 2, గంగాధర 3.4, చొప్పదండి 1.8, జమ్మికుంటలో 1.3, తిమ్మాపూర్ 2.2, హుస్నాబాద్ 1, బెజ్జంకిలో 1.4, కోహెడ 2, ఎల్కతుర్తి 1.3, కరీంనగర్ 3.6, భీమదేవరపల్లి 1.2, కమలాపూర్ 1.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జూన్నుంచి ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 76.7 సెంటీమీటర్లకుగాను 79 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటికీ సాధారణం మించిన వర్షం కురిసింది. 38 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా.. 12 మండలాల్లో అధిక వర్షం కురిసింది. -
పామాయిల్ సాగుతో అధిక లాభాలు
భద్రాచలం ఐటీడీఏ ప్రాంత ఉద్యాన అధికారి మరియన్న ప్రభుత్వం ప్రోత్సాహాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి పామాయిల్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు దమ్మపేట: పామాయిల్ తోటలను సాగు చేయడం ద్వారా రైతులకు అధిక లాభాలు రావడమే కాకుండా వారి బంగారు భవిష్యత్‌కు బాట వేస్తోందని భద్రాచలం ఐటీడీఏ ప్రాంత ఉద్యాన అధికారి జి. మరియన్న సూచించారు. శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఐటీడీఏ,ఈజీఎస్‌ల సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు సాగులో నీటి యాజమాన్యం,ఎరువుల వాడకం తదితర అంశాలపై ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. పామాయిల్ పంట సాగుకు ప్రభుత్వం అందిస్తోన్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని రైతులు అధిక లాభాలు పొందాలని సూచించారు. పామాయిల్ దిగుమతి చేసుకునే దేశాల్లో భారతదేశం ప్రథమస్థానంలో ఉందన్నారు.దేశంలో నీటి ఆధారంగా సాగుచేసే ఫామాయిల్ పంట 25 నుంచి 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందన్నారు. పామాయిల్ సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలమని తెలిపారు. అనంతరం ఈజీఎస్ ఏపీడీ అశోక్ మాట్లాడుతూ పామాయిల్ సాగు ఎకరాకు ఎరువులపై, ఐదెకరాల భూమిలో పామాయిల్ పంటకు అనుకూలంగా ఉన్న రైతులకు ఈజీఎస్ ద్వారా రాయితీ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆయిల్‌ఫెడ్ డిప్యూటీ మేనేజర్ రాజశేఖర్‌రెడ్డి, ఉద్యాన అధికారి ఉదయ్‌కుమార్, వ్యవసాయాధికారి ప్రసాదరాజు, ఈజీఎస్ ఏపీఓ వేముల సుధాకర్, పామాయిల్ రైతు సంఘం అధ్యక్షుడు దారా తాతారావు, మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. (ప్రత్యేక స్క్రీన్ వేయాలి) – ఫామాయిల్ పంట సాగుకు ప్రభుత్వం రాయితీలు.. –పంట సాగుచేసే రైతులకు ఉద్యానశాఖ ద్వారా ఎకరానికి మొక్కలు, ఎరువులపై రూ. 9,592 రాయితీని నాలుగేళ్లు కల్పిస్తోంది. – ఇదే కాకుండా ఫామాయిల్ మొక్కలు ఎదిగే వరకు సాగు చేసుకునే కూడా అంతర పంటలపై నాలుగేళ్ల వరకు ఏడాదికి రూ.1200 రాయితీ . ఫామాయిల్ సాగు చేయటం ద్వారా నాలుగేళ్ల తర్వాత ఏడాదికి ఖర్చులు పోను ఎకరాకు రూ. 50 వేలు ఆదాయం పొందవచ్చు. –సమీపంలో రవాణా, రవాణా, మార్కెట్, ప్రాసెసింగ్ సౌకర్యం,గిట్టుబాటు ధర కలిగిన పంట. –దీనిలో అంతర పంటలు సాగు ద్వారా ఏడాదికి ఎకరాకు అదనంగా రూ. 15 వేలు నికరం ఆదాయం నాలుగేళ్లు పొందవచ్చు. తర్వాత అంతర పంటగా కోకో సాగు చేస్తే ఏడాదికి ఎకరానికి రూ. 25 వేలు నికర ఆదాయం వస్తుంది. -
రెంటచింతలలో 13.71 సెం.మీ వర్షపాతం
కొరిటెపాడు (గుంటూరు) : జిల్లాలో బుధవారం ఉదయం వరకు అత్యధికంగా రెంటచింతల మండలంలో 13.71 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అత్యల్పంగా కర్లపాలెం మండలంలో 1.14 సెం.మీ వర్షపాతం నమోదైంది. సగటున 2.21 సెం.మీ వర్షం పడింది. జిల్లాలోని వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి... కారంపూడి మండలంలో 12.34 సెం.మీ, దాచేపల్లి 11.02, గురజాల 8.52, క్రోసూరు 7.70, రొంపిచర్ల 7.42, బొల్లాపల్లి 7.30, ఈపూరు 6.92, మాచవరం 5.58, మాచర్ల 4.42, అచ్చంపేట 4.40, రేపల్లె 3.76, వెల్దుర్తి 3.64, దుర్గి 3.34, బెల్లంకొండ 3.24, ముప్పాళ్ల 2.68, పిడుగురాళ్ళ 2.42, నకరికల్లు 2.24, నూజెండ్ల 2.20, వినుకొండ 1.90, తుళ్ళూరు 1.70, రాజుపాలెంలో 1.54 సెం.మీ చొప్పున వర్షం పడింది. -
కృష్ణ పట్టెలో సారాబట్టీ
మళ్లీ జోరందుకున్న సారా విక్రయాలు ఆయకట్టు ఏరియాలో పేట్రేగిపోతున్న నల్లబెల్లం మాఫియా ఐదు నెలల కాలంలో 381 సారా కేసులు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సారా విక్రయాలు మళ్లీ జోరందుకున్నాయి. ఎక్సైజ్ శాఖ, ఎన్ఫోర్స్ మెంట్ విభాగం వరుస దాడులతో కొంతకాలంగా స్తబ్దుగా ఉన్నట్టు కనిపించిన సారా మాఫియా జూలువిదుల్చుకుంది. ఎక్సైజ్ అధికారులు ఐదుమాసాల నుంచి వివిధ ప్రాంతాల్లో దాడులు చేస్తున్న క్రమంలో సారా ఆనవాళ్లు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోనే భారీ స్థాయిలో సారా డంపులు బయటపడ్డాయి. జిల్లాలో నల్లబెల్లం మాఫియా, సారా తయారీ నామరూపాలు లేకుండా పోయాయని నిర్ధారణకు వచ్చిన తరుణంలో సారా సంఘటనలు పునారావృతకావడం ఎక్సైజ్ శాఖకు పెద్ద సవాల్‌గా పరిణమించింది. ఈ నెల 12 నుంచి కృష్ణాపుష్కరాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సారా విక్రయాలు ఎక్సైజ్ శాఖను తీవ్రంగా కలిచివేస్తున్నాయి. మద్యం దుకాణాలపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవని అధికారులు స్పష్టం చేస్తున్నా...బెల్టు దుకాణాలను మాత్రం వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్తున్నారు. ఇందుకోసం నల్లగొండ జిల్లా పోలీసులతో పాటు, పొరుగు జిల్లాల నుంచి అదనపు ఎక్సైజ్ బలగాలను రంగంలోకి దింపుతున్నా రు. పుష్కర ఘాట్ల వద్ద పకడ్బందీ బందోబస్తుతో పాటు కీలక ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సారా విక్రయాలకు మళ్లీ జీవం... ఎక్సైజ్ అధికారులు నిద్రావస్థలోకి జారుకోవడంతోనే సారా విక్రయాలు ఊపందుకున్నాయన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల అండదండలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ నెలాఖరు వరకు జిల్లా వ్యాప్తంగా 381 సారా కేసులు నమోదయ్యాయి. దీంట్లో నల్లగొండ ఎక్సైజ్సూపరింటెంటెండ్ పరిధిలో 82...మిర్యాలగూడ ఈఎస్ పరిధిలోనే 299 కేసులు నమోదు కావడం గమనార్హం. అది కూడా ప్రస్తుతం పుష్కరాలు జరగబోయే ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 17,675 కేజీల నల్లబెల్లం స్వాధీనం చేసుకోగా...1318 లీటర్ల సారాను సీజ్ చేశారు. 13,125 లీటర్ల వాష్‌ను ధ్వంసం చేశారు. 14 వాహనాలు సీజ్ చేయగా, ఆరుగురుని అరెస్ట్ చేశారు. ఘాట్ల పరిధిలోకి వచ్చే స్టేషన్లలోనే... పుష్కరాలకు భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్న మట్టపల్లి, దామరచర్ల, నేరేడుచర్ల, పెద్దవూర, మేళ్లచెర్వు, చందంపేట, పీఏపల్లి మండలాల పరిధిలోకి వచ్చే ఎక్సైజ్ స్టేషన్లలోనే సారా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ నెలాఖరు వరకు నమోదైన సారా కేసులను స్టేషన్ల (ఎస్హెచ్ఓ) వారీగా పరిశీలిస్తే...మిర్యాలగూడ–15, హుజూర్నగర్–51, కోదాడ–45, హాలియా–16, దేవరకొండ–57, నాంపల్లి స్టేషన్లో ఐదు కేసులు నమోదుకాగా...ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్–69, ఎన్ఫోర్స్మెంట్–41 కేసులు కలిపి మొత్తం 299 కేసులు నమోదు చేశారు. అదే నల్లగొండ ఈఎస్ పరిధిలో 82 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా సూర్యాపేటలో 23, అత్యల్పంగా మోత్కూరులో రెండు కేసులు నమోదు చేశారు. పుష్కరాల వద్ద ఎక్సైజ్ నిఘా... పుష్కరాల ఘాట్ల సమీపంలో బెల్టు దుకాణాలు, సారా విక్రయాలు, పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తరలిరాకుండా ఉండేందుకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా పోలీసులు, పొరుగు జిల్లాల వారితో కలుపుకుని ఎస్ఐలు 92 మంది, కానిస్టేబుళ్లు 208 మందిని నియమించనున్నారు. వీరిలో పొరుగు జిల్లాల నుంచి వచ్చే ఎస్ఐలు 30 మంది, కానిస్టేబుళ్లు 118 మంది ఉన్నారు. నల్లగొండ ఈఎస్ పరిధిలో 3 ఘాట్ల వద్ద 24 మంది ఎస్ఐలు, 33 మంది కానిస్టేబుల్స్‌ను నియమించాలని నిర్ణయించారు. మిర్యాలగూడ ఈఎస్ పరిధిలో 25 ఘాట్లు ఉన్నాయి. ఇక్కడ ఎస్ఐలు 68, కానిస్టేబుల్స్ 175 మందిని ని యమించనున్నారు. ప్రత్యేక ఇంటెలిజెన్స్ విభాగానికి ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు, కంట్రోల్ రూం విభాగంలోఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉంటారు. ¿¶ క్తులు, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను కంట్రోల్ రూం అధికారులు నమోదు చేస్తారు. ఈ కార్యాలయం 24 గంటల పాటు పనిచేస్తుంది. చెక్‌పోస్టులు... పానగల్లు, దర్వేశిపురం వద్ద ఒకటి, పెద్దమునిగల్, వాడపల్లి, అడవి దేవుల పల్లి, మట్టపల్లి, నాగార్జునసాగర్ వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో చెక్‌పోస్టు వద్ద ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉంటారు. పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి పుష్కరాలకు వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేస్తారు. అక్రమంగా మద్యం తరలిరాకుండా, కల్తీ మద్యం ప్రవేశి ంచకుండా ఉ ండేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. -
ఇరాక్ కు సహాయంగా అమెరికా దళాలు..
అమెరికాః ఉగ్రవాదాన్ని మట్టుబెట్టడంలో ఇరాక్ కు సహకరించేందుకు అమెరికా మరింత ముందుకొచ్చింది. ఇరాక్ లో ఉగ్రవాదుల అధీనంలోకి వెళ్ళిన మసూల్ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడంలో ఇరాక్ దళాలకు సహాయం అందించేందుకు మరో అడుగు వేసింది. ఐసిస్ నిర్బంధంలో ఉన్న మసూల్ ని విడిపించేందుకు, ఐసిస్ కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఇరాకీ దళాలకు సహాయంగా 560 అమెరికా దళాలను పంపింస్తున్నట్లు అమెరికా ఢిఫెన్స్ సెక్రెటరీ ఆస్టన్ కార్టర్ వెల్లడించారు. మతం పేరుతో మారణహోమం సృష్టిస్తున్న ఐసిస్ ఉగ్రమూకలకు వ్యతిరేకంగా పోరాడేందకు అమెరికా తనవంతు కృషి చేస్తోంది. ఇరాక్ లో ఐసిస్ నిర్బంధంలో ఉన్న మసూల్ పట్టణాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఇరాకీ దళాలకు మద్దతుగా దాదాపు 560 అమెరికా సైనిక దళాలను పంపిస్తున్నట్లు వెల్లడించింది. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో అమెరికా ముందుంటుందని, ఇరాకీ సైనిక దళాలకు అమెరికా సైన్యం తగినంత సహకారం అందిస్తుందని అమెరికా ఢిఫెన్స్ సెక్రెటరీ ఆస్టన్ కార్టర్.. తన అప్రకటిత బాగ్దాద్ పర్యటనలో భాగంగా తెలిపారు. కార్టర్ తన పర్యటనలో అమెరికా కమాండర్లు, ఇరాక్ ప్రధానమంత్రి హైదర్ అల్ అబాదీ, రక్షణ మంత్రి ఖలీద్ అల్ ఒబైదీ లను కలుసుకున్నారు. మరోవైపు కొత్తగా పంపిస్తున్న వారిలో ఇంజనీర్లు, లాజిస్టిక్స్ మరియు ఇతర సిబ్బంది కూడ ఉన్నట్లు కార్టర్ తెలిపారు. వారంతా మాసూల్ కు 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న కయారా ఎయిర్ బేస్ అభివృద్ధికి సైతం సహాయం అందిస్తాయన్నారు. -
ప్రాణాలు కోల్పోతున్న కంగారూలు!
కాన్బెర్రా: ఆస్ట్రేలియా పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది కంగారూ. అటువంటిది ఇప్పుడా జంతువులకు అక్కడ రక్షణ లేకుండా పోతోంది. మిగిలిన జంతువులతో పోలిస్తే కంగారూలు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నట్లు స్థానిక ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ వెల్లడించిన తాజా వివరాలను బట్టి తెలుస్తోంది. ఆస్ట్రేలియాలోని ప్రసిద్ధ జంతువు కంగారూలు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఆస్ట్రేలియాలోని ఓ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ విడుదల చేసిన గణాంకాలను బట్టి, మిగిలిన జంతువులతో పోలిస్తే పదిలో తొమ్మిది కంగారూలు రోడ్డు ప్రమాదాలకు గురౌతున్నట్లు స్థానిక జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. ఆస్ట్రేలియా ప్రమాదాల్లో 2015 లో జరిగిన దాదాపు 20,000 రోడ్డు ప్రమాదాలను విశ్లేషించగా కంగారూలు 88 శాతం, వల్లబీస్ 6 శాతం, వోమ్బాట్స్ 3 శాతం, శునకాలు 2 శాతం చనిపోతున్నట్లు ఏఏఎమ్ ఐ నివేదికల్లో తెలిపింది. దేశంలో మొత్తం కంగారూల సంఖ్య 30 నుంచి 60 మిలియన్ల మధ్య ఉంటుంది. ఆస్ట్రేలియాలో మాత్రమే అత్యధికంగా కనిపించే జంతువైన కంగారూ... ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనూ, అడవుల్లోనూ నివసిస్తూ... తన పిల్లలను పొట్టకింది భాగంలో ఉండే సంచిలో పెట్టుకొని ఒక చోటునుంచీ మరోచోటుకు గెంతుకుంటూ వెడుతుంటుంది. అయితే జూన్, ఆగస్టు మధ్య, శీతాకాలంలో ఈ కంగారూలు 68 శాతం రోడ్లను దాటుతుంటాయని, అదే సమయంలో గరిష్టస్థాయిలో ప్రమాదాలకు గురౌతున్నాయని ఏఏఎమ్ఐ ప్రతినిధి మైఖేల్ మిల్స్ తెలిపారు. శీతాకాలంలో చలి ఎక్కువగా ఉండి, రోడ్లు చీకటిగా, సరిగా కనిపించకుండా ఉండటం కూడ ఈ సమయంలో రోడ్లపై వెళ్ళే జంతువులు ఎక్కువ ప్రమాదాలకు గురౌతున్నట్లు మైఖేల్ చెప్పారు. రోడ్లకు అడ్డుగా వచ్చే జంతువుల వల్ల ప్రమాదాలు జరగడంతో ఆయా జంతువులు చనిపోవడం, లేదా తీవ్రంగా గాయపడటంతోపాటు, డ్రైవర్లకు కూడా ప్రమాదంగానే మారిందని, ఒక్కోసారి డ్రైవర్లూ, జంతువులు సైతం చనిపోయిన సందర్భాలుంటాయని మైఖేల్ చెప్తున్నారు. ముఖ్యంగా న్యూ సౌత్ వేల్స్ క్వీన్ బెయాన్.. ఆస్ల్రేలియాలోనే రోడ్డు ప్రమాదాలకు రాజధానిగా, ప్రత్యేక గుర్తుగా మారుతోందని ఏఏఎమ్ ఐ విశ్లేషించింది. దీంతోపాటు విక్టోరియన్ నగరం బెండిగో, క్వీన్స్ ల్యాండ్ పట్టణం డింగో, న్యూ సౌత్ వేల్స్ పట్టణం సింగిల్టన్, గౌల్ బర్న్ నగరాలైన మొత్తం ఐదు ప్రముఖ ప్రాంతాలు దేశంలోనే జంతు ప్రమాదాలకు నెలవులుగా పరిణమించినట్లు ఏఏఎమ్ఐ నివేదికల్లో తెలిపింది. -
దుబాయ్ ఎయిర్ పోర్ట్ మూసేశారు!
దుబాయ్ః అనుక్షణం ప్రయాణీకులతో హడావిడిగా ఉండే దుబాయ్ ఎయిర్ పోర్ట్ శనివారం మధ్యాహ్నం సుమారు గంటపాటు నిర్మానుష్యంగా మారింది. ఎయిర్ స్పేస్ లో ఓ అనధికార డ్రోన్ సంచారాన్ని గుర్తించడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు అప్రమత్తమయ్యారు. గంటపాటు ఎయిర్ పోర్టును మూసివేశారు. అప్పటికే ఎన్నో విమానాలు గాల్లో ప్రయాణిస్తుండగా వాటిని దుబాయ్ వరల్డ్ సెంట్రల్ ఎయిర్ పోర్టుకు మరల్చినట్లు దుబాయ్ ఎయిర్ పోర్ట్ ప్రతినిధులు వెల్లడించారు. శనివారం ఓ అనధికారిక డ్రోన్ తిరుగుతున్నట్లు గుర్తించిన దుబాయ్ ఎయిర్ పోర్ట్ అధికారులు సుమారు గంటపాటు ఎయిర్ పోర్ట్ మూసివేశారు. ఉదయం 11.36 నిమిషాలనుంచి, మధ్యాహ్నం 12.45 వరకు దుబాయ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ ద్వారా ఎయిర్ ట్రాఫిక్ ను నిలిపివేశారు. ఇటీవల రెండేళ్ళకాలంలో దుబాయ్ లో ఇలా జరగడం రెండోసారి అని దుబాయ్ ఎయిర్ పోర్ట్ ఓ ప్రకటనలో నివేదించింది. మొత్తం 69 నిమిషాలపాటు ఎయిర్ పోర్టు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కారణంగా అనేక విమానాలు ఆలస్యం కావడంతోపాటు.. కొన్నింటిని దారి మరల్చాల్సిన అవసరం ఏర్పడిందని వెల్లడించింది. అనధికార డ్రోన్ కారణంగా అనేక విమానాలను దుబాయ్ వరల్డ్ సెంట్రల్ ఎయిర్ పోర్టుకు మరల్చాల్సి వచ్చిందని దుబాయ్ ఎయిర్ పోర్టు ప్రతినిధి ఒకరు తెలిపారు. తిరగి తమ కార్యకలాపాలు పునరుద్ధరించడానికి, వినియోగదారుల అసౌకర్యాన్ని తగ్గించడానికి తమ వాటాదారులతో కలసి పనిచేస్తున్నట్లు తెలిపారు. తమకు భద్రతే మొదటి ప్రాధాన్యత అని, రెగ్యులేటరీ అథారిటీ ప్రకారం విమానాశ్రయానికి, లేదా ల్యాండింగ్ ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల దూరంలోనూ, నిషేధిత పరిమిత ప్రాంతాల్లోనూ ప్రైవేటు కార్యకలాపాలకు, మానవ రహిత వాహనాలకు ఎట్టిపరిస్థితిలో అనుమతిలేదని ఎయిర్ పోర్ట్ ప్రకటనలో గుర్తుచేసింది. -
పాకెట్ మనీలోనూ వివక్షే..
లండన్ః ఏ దేశంలో అయినా తల్లిదండ్రులు చిన్న పిల్లల ఖర్చులకు పాకెట్ మనీ ఇవ్వడం మామూలే. అయితే ఆ దేశంలో పాకెట్ మనీ విషయంలోనూ అమ్మాయిల పట్ల వివక్ష కనిపిస్తోందట. బ్రిటిష్ పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీపై ఓ బ్యాంకు చేపట్టిన అధ్యయనాల్లో అక్కడ పాకెట్ మనీ విషయంలో ఆడపిల్లలు వెనుకబడ్డట్టు తెలుసుకున్నారు. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల పాకెట్ మనీ 12 శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. బ్రిటిష్ పిల్లలు తల్లిదండ్రులనుంచీ సగటున వారానికి 6.55 పౌండ్లు అంటే సుమారు 640 రూపాయలు పాకెట్ మనీగా పొందుతున్నారట. అయితే అందులో ఆడ పిల్లలు 12 శాతం తక్కువ డబ్బును పొందుతున్నట్లు హాలిఫాక్స్ బ్యాంకు ప్రచురించిన అధ్యయనాల్లో తేలింది. ఈ వ్యత్యాసం బ్రిటన్ లో గత సంవత్సర కాలంగా కొనసాగుతోన్నట్లు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. 8 నుంచి 15 ఏళ్ళ వయస్సు లోపల అబ్బాయిలు వారానికి సుమారు 640 రూపాయల వరకూ పాకెట్ మనీ పొందుతుండగా... అదే వయసులోని బాలికలు మాత్రం 597 రూపాయలు మాత్రమే పొందుతున్నారట. అయితే అమ్మాయిలు కూడ తమకు మరింత అధికంగా పాకెట్ మనీ కావాలని కోరుకుంటున్నట్లు తెలుసుకున్నారు. కాగా 1,202 మంది పిల్లలు, 575 మంది తల్లిదండ్రులపై చేపట్టిన సర్వే ప్రకారం లింగ వివక్ష గతేడాది 1.2 శాతం పెరిగినట్లు అధ్యయనాల్లో తెలుసుకున్నారు. తొమ్మిదేళ్ళకాలంతో పోలిస్తే గతేడాది బ్రిటిష్ పిల్లలు తల్లిదండ్రులనుంచి పొందే పాకెట్ మనీ ఆరు శాతం పెరిగి 640 రూపాయలకు చేరిందట. అలాగే బ్రిటన్ మహిళలు కూడ అక్కడి మగవారితో పోలిస్తే 19.2 శాతం తక్కువ వేతనాలను అందుకుంటున్నట్లు అధికారిక లెక్కలను బట్టి తెలుస్తోంది. అయితే 22 నుంచి 29 ఏళ్ళ మధ్య వయసున్న మహిళలు మగవారికంటే సగటున 1.111 పౌండ్లు ఎక్కువ వేతనాన్నే పొందుతున్నారని, 30 ఏళ్ళ వయసు దాటిన తర్వాత మాత్రం వేతనాల విషయంలో వెనుకబడిపోతున్నారని ఇటీవలి అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. ఏది ఏమైనా అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఆడపిల్లల పట్ల వివక్ష కనిపిపిస్తోందనేందుకు ఈ తాజా అధ్యయనాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. -
మహిళలకు ప్రత్యేక అవకాశం!
న్యూఢిల్లీ: మహిళలకు ఎంఫిల్, పీహెచ్ డీ చేసేందుకు ఎక్కువ సమయం ఇవ్వాలంటూ గతవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేసిన సిఫార్సులపై యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజిసి) స్పందించింది. మహిళలకు, వికలాంగ అభ్యర్థులకు కొంత అధిక సమయాన్ని ఇచ్చేందుకు అంగీకరించింది. మహిళలతోపాటు... 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు ఎంఫిల్ పేపర్లు పూర్తి చేసేందుకు ఓ సంవత్సరం అదనంగానూ, అలాగే పీహెచ్ డీ థీసిస్ సమర్పించేందుకు రెండేళ్ళు ఎక్కువ సమయం వినియోగించుకునేందుకు యూజీసీ ప్రత్యేక అవకాశం కల్పించింది. అంతేకాక ఈ రెండు డిగ్రీలు పూర్తి చేసే సమయంలో మహిళలందరూ మెటర్నిటీ, ఛైల్డ్ కేర్ సెలవును 240 రోజులపాటు వినియోగించుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. అలాగే వికలాంగులు, మహిళలు వారి అధ్యయనం సమయంలో వివాహం లేదా కుటుంబ సంబంధిత కారణాలతో తమ పరిశోధనా డేటాను నిబంధనల ప్రకారం బదిలీ చేసుకొనే అవకాశాన్ని కూడా కల్పించింది. మరో ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా యూజీసీ తీసుకుంది. జూలై 11, 2009 ఎంఫిల్, పీహెచ్ డీ ప్రోగ్రామ్ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులకు డిగ్రీలను అందించే విషయంలోనూ, విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా తత్సమానమైన పోస్టుల నియామకాల విషయంలోనూ.. ప్రత్యేక అవకాశాలను కల్పించింది. షరతులకు లోబడి నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (NET) విషయంలోనూ మినహాయింపును ఇచ్చింది. అలాగే రెగ్యులర్ రీతిలో పీహెచ్ డీ చేసే స్కాలర్ల థీసిస్ ను కనీసం ఇద్దరు ఎక్స్ టర్నల్ ఎగ్జామినర్స్ పరిశీలించి వుండాలి. ఓపెన్ పీహెచ్డీ లో అభ్యర్థులు తమ పరిశోధనా పత్రాలను కనీసం రెండు గుర్తింపు పొందిన జర్నల్స్ లో ప్రచురించి ఉండాలని, దీనికితోడు పీహెచ్డీ పనికి ఆధారంగా కనీసం రెండు సమావేశాలు, సెమినార్ల లో తమ అధ్యయనాలను సమర్పించి ఉండాలని చెప్పారు. -
భారతీయులకు ఇష్టమైనది ఫేస్బుక్కే!
భారతీయులు ట్విట్టర్ కన్నా ఫేస్‌బుక్‌నే ఎక్కువగా ఇష్టపడతారంటున్నాయి తాజా అధ్యయనాలు. ట్విట్టర్ కన్నా దీన్ని 2.4 రెట్లు ఎక్కువగా, యూట్యూబ్ కన్నా రెండు రెట్లు ఎక్కువగా దీన్ని భారతీయులు వినియోగిస్తారని ఇటీవల జరిపిన సర్వేల్లో వెల్లడైంది. ఇండియాలోని మెట్రో నగరాలకంటే 8 ప్రధాన నగరాల్లోనే ఫేస్బుక్ ఫాలోయర్లు ఎక్కువగా ఉన్నారని మార్కెట్ పరిశోధన, బిజినెస్ కన్సల్టెన్సీ సంస్థ ఐఎంఆర్బీ నిర్వహించిన అధ్యయనాల్లో వెల్లడైంది. ఫేస్‌బుక్‌ను వినియోగించే వారిలో 70 శాతం మంది స్మార్ట్ ఫోన్లలోనే వినియోగిస్తున్నారని, అందులోనూ 88 శాతం ప్రీ పెయిడ్ కనెక్షన్లే ఉంటున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. భారతీయుల్లో ఎక్కువ మంది ఫేస్‌బుక్‌నే వాడుతున్నారని, ఆ తర్వాత వాట్సప్‌ను కూడా అదే స్థాయిలో ఎక్కువగా వినియోగిస్తున్నారని చెబుతున్నారు. ఫేస్‌బుక్‌ను వాడేందుకు దేశంలోని సుమారు 63 శాతం మంది యూజర్లు 3జీ కనెక్షన్లను, 38 శాతం మంది 2జీ కనెక్షన్లను వాడుతున్నట్లు ఐఎంఆర్బీ లెక్కల్లో తేలింది. -
ఎలక్ట్రిక్ బస్సులతో ఆదాయం కూడ ఎక్కువే!
బెంగళూరుః ఎలక్ట్రిక్ బస్సులు కాలుష్యాన్ని నివారించడానికే కాక, డీజిల్ బస్సుల కన్నా అత్యధిక లాభాన్ని చేకూరుస్తాయంటున్నారు పరిశోధకులు. ఎలక్ట్రిక్ బస్సులతో రోజుకు 27 శాతం రెవెన్యూ పెరగడమే కాక, డీజిల్ బస్సులకంటే 82 శాతం లాభాలను కూడ చేకూర్చి పెడతాయని తమ అధ్యయాల్లో కనుగొన్నారు. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడంలో భాగంగా ఇటీవల మెట్రోపాలిటన్ నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సుల వాడకాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యంగా మొదటిగా బెంగళూర్ మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) తమ రవాణా అవసరాలను తగ్గించడంతోపాటు... డీజిల్ బస్సులతో ఏర్పడే వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ప్రత్యేక ప్రయత్నంగా విద్యుత్ బస్సులను ఆవిష్కరించింది. దేశంలోనే మొదటిసారి జీరో ఎమిషన్ తో కూడిన పూర్తి ఎయిర్ కండిషన్డ్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. అర్బన్ ట్రాన్స్ పోర్ట్ కోసం ఎలక్ట్రానిక్ బస్సులపై జరిపిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్) అధ్యయనాల్లో ఎలక్ట్రిక్ బస్సులు అత్యధిక ఆదాయాన్నితెచ్చి పెట్టడమే కాక, లాభాలను కూడ చేకూర్చి పెట్టేందుకు సహకరిస్తాయని తాజా అధ్యయనాలద్వారా తెలుసుకున్నారు. భారత నగరాల్లో రవాణాకు ఉపయోగించే సుమారు 150,000 డీజిల్ బస్సులనుంచి వచ్చే పొగ, కార్బన్ ఉద్గారాలు వాయుకాలుష్యాన్ని తీవ్రంగా పెంచుతున్నాయని, అవి భూగోళానికి తీరని నష్టాన్ని చేకూరుస్తుండటంతో ఐఐఎస్ అధ్యయనకారులు ఈ విషయంపై ప్రత్యేక అధ్యయనాలు చేపట్టారు. ఒక్కో డీజిల్ బస్సును ఎలక్ట్రిక్ బస్సుగా మారిస్తే... సంవత్సరానికి సుమారు 25 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ను తగ్గించవచ్చని బెంగళూరు దివేచా క్లైమేట్ ఛేంజ్ లోని షీలా రామ శేష సహా అధ్యయనకారుల బృందం తెలుసుకున్నారు. ఎలక్ట్రానిక్ బస్సులు CO2 ను విడుదల చేయవని, అయితే వాటిని ఛార్జింగ్ చేసేందుకు కావలసిన ఛార్జింగ్ స్టేషన్లకోసం ఇండియాలో విద్యుత్ శక్తికి ప్రధానమైన బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు అవసరమని అన్నారు. అయితే అదే స్థానంలో బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్లలో సోలార్ ప్యానెల్స్ ను స్థాపిస్తే సంవత్సరానికి ఒక్కోబస్సుతో మరో 25 టన్నుల CO2 ను నివారించవచ్చని కూడ వారు తెలిపారు. దేశంలో ఇప్పుడున్న 150,000 డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేస్తే మొత్తం 3.7 మిలియన్ల కార్బన్ డై ఆక్సైడ్ ను నివారించవచ్చని తెలిపారు. కార్బన్ కాలుష్యం కారణంగా దేశంలో సంవత్సరానికి 670,000 లక్షల మంది చనిపోతున్నట్లు లెక్కల ప్రకారం తెలుస్తోందని, భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే మేజర్ పొల్యూటర్ గా మారుతోందని అధ్యయనకాలు తెలిపారు. -
మమ్మల్ని ప్రజలు అంగీకరిస్తున్నారు!
భారతదేశంలో లింగ వివక్ష మెండుగానే కనిపిస్తుంది. ఇక ట్రాన్స్ జెండర్ల విషయంలో చెప్పనే అక్కర్లేదు. ఈ నేపథ్యంలో సమ సమాజ నిర్మాణానికి, స్వేచ్ఛా సమానత్వాలకు... ఊపిరిలూదుతూ యష్ రాజ్ సారధ్యంలో రూపొందిన సిక్స్ ప్యాక్ బ్యాండ్ ఆల్బమ్ ఎంతో ఆదరణ పొందింది. అయితే నిజంగానే జనంలో అంతటి మార్పు వచ్చిందా? హిజ్రాలను సాటి మనుషులుగా గుర్తించి, గౌరవిస్తున్నారా అంటే మాత్రం మిశ్రమ స్పందనే లభిస్తోంది. ఒకప్పటి కంటే ఇప్పుడు కొంత మేలని, భవిష్యత్తులో మరింత మార్పు వచ్చే అవకాశం ఉందన్న ఆశాభావమే వ్యక్తమౌతోంది. భారతదేశంలో లింగ సమానత్వానికి మద్దతుగా ఇటీవల బ్రూక్ బాండ్ రెడ్ లేబుల్‌తో కలసి, యష్ రాజ్ ఫిల్మ్స్ థర్డ్ జెండర్‌తో ఓ పాటను రూపొందించి విడుదల చేసిన విషయం తెలిసిందే. తదనంతరం జనంలో కొంత మార్పు వచ్చిందంటున్నారు సిక్స్ ప్యాక్ బ్యాండ్ గ్రూప్. సాటి మనుషులుగా తమను ప్రజలు అంగీకరించడం మొదలు పెట్టారంటున్నారు. ఫర్రెల్ విలియమ్స్ హిట్ సాంగ్ హమ్ హై హ్యాపీ.. సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఇంగ్లీష్, హిందీ సాహిత్యాల మేలు కలయికతో రూపొందిన ఆ గీతం కేవలం 20 రోజుల్లోనే సుమారు 15 లక్షల హిట్స్ కొట్టింది. అంతటి ప్రజాభిమానాన్నిపొందిన ఆ పాటను... మొట్టమొదటిసారి 'సిక్స్ ప్యాక్ బ్యాండ్' (ట్రాన్స్ జెండర్ బ్యాండ్) ఆల్బమ్ గా యష్ రాజ్ ఫ్మిల్మ్స్ యువ విభాగం రూపొందించి సక్సెస్ అయ్యింది. అనుష్కాశర్మ బ్యాగ్రౌండ్, సోనూ నిగమ్ సహకారంతో రూపొందిన సిక్స్ ప్యాక్ బ్యాండ్ సోషల్ మీడియాలోనూ సక్సెస్ సాధించి యూజర్లను ఆకట్టుకుంది. దీంతో లైకులు, కామెంట్లతో ట్రాన్స్ జెండర్లకు ఎంతో సపోర్ట్ లభించింది. ఇదే నేపథ్యంలో ఇటీవల సోనూనిగమ్ కలసి నటించిన (సిక్స్ ప్యాక్ బ్యాండ్ తో) 'సబ్ రబ్ దే బందే' మరో ఆల్బమ్ కూడా విడుదలైంది. అయితే ఈ ప్రయత్నం ట్రాన్స్జెండర్ల మనోభావాలను ప్రదర్శించగలిగిందా అన్నది మాత్రం ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌జెండర్ బ్యాండ్ సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. దేశంలోనే మొదటిసారి లింగమార్పిడి సమాజాన్ని జనం ఆదరించడం తమకు ఎంతో ఆనందంగా ఉందంటున్నారు. తమ సమాజం జనాన్ని ఆనందంగా ఉంచేందుకు, వారి ఆనందంలో భాగం పంచుకునేందుకు ప్రయత్నిస్తుందని, ఇప్పుడు ఈ ఆల్బమ్ ద్వారా తమలోని ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఇవ్వడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్తున్నారు... సిక్స్ ప్యాక్ బ్యాండ్ సభ్యురాలు భవికా. ట్రాన్స్ జెండర్ తో వీడియో రూపొందించాలన్న ఆలోచన రావడం తమకు ప్రత్యేక గుర్తింపునివ్వడమేనని, సమాజంలో వచ్చిన మార్పునకు అది తార్కాణమని చెబుతున్నారు. సిక్స్ ప్యాక్ బ్యాండ్ వీడియో తమకు కల్పించిన అవకాశంతో సమాజంలో వచ్చిన మార్పును ప్రత్యక్షంగా చూడగల్గుతున్నామంటున్న సభ్యులు.. ప్రదర్శన ఇవ్వడం తమకెంతో భయం వేసిందని, కానీ యష్ రాజ్ ఫిల్మ్స్ తమకు ఎంతో సపోర్ట్ ఇచ్చిందని చెప్తున్నారు. ట్రాన్స్ జెండర్ ను మూడో జెండర్ గా సుప్రీం కోర్టు గుర్తించిన తర్వాత... దేశంలోని సగం మంది జనం తమను మనుషులుగా గుర్తిస్తున్నారనీ, కానీ మిగిలిన వారు ఇంకా అనుమానించడం, భయపడటం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో బహిష్కరణకు గురౌతున్న తమకు సోషల్ మీడియాలో వస్తున్న ప్రోత్సాహం ముందు ముందు కూడా లభించాలని కోరుకుంటున్నారు. -
సెక్స్ కు ఆకర్షితులౌతున్న ఐరిష్ టీనేజర్లు..
ఐర్లాండ్ టీనేజర్లు ఇప్పుడు కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. ఎనిమిది నుంచి 18 ఏళ్ళ వయసులోని పిల్లలపై చేసిన సర్వేలు ఆశ్చర్యకర విషయాలను వెల్లడిస్తున్నాయి. అక్కడ ధూమపానంతోపాటు తాగుడుకు అలవాటు పడిన పిల్లలకంటే చిన్న వయసులోనే సెక్స్ పట్ల ఆకర్షితులవుతున్న వారు ఎక్కువగా ఉన్నట్లు తాజా సర్వేలు తేల్చి చెప్తున్నాయి. ఐర్లాండ్ లో తాజాగా 230 స్కూళ్ళలో 13,500 మంది విద్యార్థులపై హెల్గ్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో బయటపడ్డ విషయాలను చూసి అంతా ఆశ్చర్యపోయారు. సర్వేలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థుల్లో చాలామంది ఇప్పటికే తమకు సెక్స్ అనుభవాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అందులోనూ పేద, మధ్య తరగతి పిల్లలే సెక్స్ పట్ల అధిక ఆసక్తి చూపుతున్నట్లు సర్వే ద్వారా వెల్లడైంది. అంతేకాదు సెక్స్ లో పాల్గొనేప్పుడు దాదాపు అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పడం గమనార్హం. వీరంతా సెక్స్ సమయంలో కండోమ్ లు, గర్భ నిరోధక మాత్రలు వాడుతున్నట్లుగా సర్వేలో తేలింది. సర్వేలో భాగంగా 15 నుంచి 17 ఏళ్ళ మధ్య వయసు పిల్లలను సెక్స్ గురించి ప్రశ్నించినపుడు మాత్రం 27 శాతంమంది శృంగార అనుభవం పొందుతున్నట్లు తెలిసిందని, అంతకు ముందున్నకంటే రెండు మూడు శాతం ఈ సంఖ్య పెరిగిందని తెలుస్తోంది. అయితే 2010 లో స్కూలు పిల్లలపై చేసిన సర్వేల్లోని నిష్పత్తికంటే... తాజా లెక్కల్లో స్మోకింగ్, డ్రింకింగ్ బానిసల సంఖ్య తగ్గిందని హెల్త్ ప్రమోషన్ రీసెర్స్ సెంటర్ పరిశోధకులు అంటున్నారు. అయితే సెక్స్ అనుభవాలను పొందుతున్న వారి సంఖ్య మాత్రం క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తున్నట్లు వారు చెప్తున్నారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు 12 నుంచి 8 శాతానికి సిగరెట్లు, మద్యం సేవించే వారి సంఖ్య తగ్గిందని చెప్తున్నారు. ఆరోగ్యంపై అవగాహన వల్లే ఈ సంఖ్య క్రమంగా తగ్గుతోందని పరిశోధకులు అంటున్నారు. అంతేకాక 2011 తో పోలిస్తే వారంతా డైటింగ్ పై కూడ శ్రద్ధ పెడుతున్నట్లు తెలుస్తోంది. అదే నేపథ్యంలో ఫ్రూట్స్, వెజిటబుల్స్ పై ఎక్కువగా దృష్టి పెడుతున్నారని... స్వీట్లు, కూల్ డ్రిక్ ల వాడకం తగ్గిస్తున్నారని తాజా సర్వేల్లో వెల్లడైంది. -
కాల్‌మనీ వ్యవహారంలో కొత్త కోణాలు
-
తాజ్ వివాంతలో ఘనంగా గ్రోమోర్ రైతు సంబరాలు
-
సూపర్ బ్యాటరీ తయారు చేసిన సోనీ
స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో వినియోగదారుల అవసరాల మేరకు శక్తిమంతమైన బ్యాటరీల తయారీ మొబైల్‌ఫోన్ కంపెనీలకు కష్టంగా మారింది. ఫోన్లలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిన కారణంగా ఒక రోజుకు సరిపడ బ్యాటరీ చార్జింగ్ ఉంచడం కష్ట సాధ్యమే అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ సోనీ కొత్త సూపర్ బ్యాటరీని తయారుచేసినట్లు వెల్లడించింది. సాంప్రదాయ లిథియం అయాన్ బ్యాటరీల కంటే 40 శాతం ఎక్కువ శక్తిని ఈ బ్యాటరీలో నిల్వచేసే అవకాశం ఉన్నట్లు సోనీ ప్రకటించింది. ఈ బ్యాటరీల తయారీలో లిథియం- సల్ఫర్, మెగ్నీషియం-సల్ఫర్ మూలకాలను వాడినట్లు తెలిపింది. కొత్త విధానం ద్వారా బ్యాటరీలో తక్కువ స్థలంలో ఎక్కువ శక్తిని నిల్వచేసే అవకాశం ఉందని తెలిపిన సోనీ... ఇవి పూర్తి స్థాయిలో వినియోగదారులకు అందుబాటులోకి రావాలంటే మాత్రం 2020 వరకు ఆగాల్సిందే అని చెబుతోంది. గతంలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో కూడా సోనీ సంస్థ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. -
పరీక్ష రాసింది 12,000.. పాసైంది 20,000
ఆగ్రా: బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ బీఈడీ పరీక్షల ఫలితాలను ప్రకటించడానికి ఉపక్రమించిన అధికారులు తమ చేతిలో ఉన్న గణాంకాలను చూసి షాక్‌కు గురయ్యారు. ఆగ్రాలోని ఈ యూనివర్సిటీ తరపున మొత్తం పరీక్ష రాసిన విద్యార్థులు 12,800 మంది ఉన్నట్లు తొలుత తెలిపిన అధికారులు తీరా ఫలితాలను ప్రకటించే సమయానికి 20,089 మంది పాసైనట్లు గుర్తించారు. దీనిపై యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ మహమ్మద్ ముజమ్ముల్ విచారణకు ఆదేశించి, చివరి నిమిషంలో ఫలితాలను వాయిదా వేశారు. యూనివర్సిటీ బీఈడీ పరీక్షల ఫలితాల లిస్టును తయారు చేయడానికి ఓ ప్రైవేట్ ఏజెన్సీని నియమించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ కళాశాలలు నిబంధనలను ఉల్లంఘించి విద్యార్థులకు పరీక్షలు రాయడానికి అనుమతించడం వలనే ఈ గందరగోళం ఏర్పడిందని భావిస్తున్నారు. పరీక్షలు మొదలయ్యే రోజున కూడా కొన్ని కాలేజీలు విద్యార్థులను చేర్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు కళాశాలలు తమకు కేటాయించిన సీట్లకు మించి విద్యార్థులను చేర్చుకున్నట్లు గుర్తించిన అధికారులు.. కళాశాలల యాజమాన్యాన్ని విద్యార్థుల లిస్టును తీసుకురావాల్సిందిగా ఆదేశించారు.