జిల్లావ్యాప్తంగా వర్షం
-
సిరిసిల్లలో 5.6 సెంటీమీటర్లు నమోదు
-
సాధారణానికి మించిన వర్షం
-
7 మండలాల్లో లోటు వర్షపాతం
ముకరంపుర: జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో బుధవారం రాత్రి మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లాలో సగటున 2.4 సెంటీమీటర్లు నమోదు కాగా.. అత్యధికంగా సిరిసిల్ల మండలంలో 5.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముత్తారం(మంథని), పెగడపల్లి, ధర్మపురి, మేడిపల్లి, కథలాపూర్, రామడుగులో లోటు వర్షపాతం ఉంది. బుధవారం రాత్రి నుంచి ఉదయం వరకు కురిసిన వర్షపాతంలో మెట్‌పల్లి, రాయికల్, బోయినిపల్లిలో 4.6 సెంటీమీటర్లు, కథలాపూర్, ఇబ్రహీంపట్నం 4.5, మహాముత్తారం 3.3, మల్హర్‌రావు 2.9, మహదేవపూర్ 1.9, కమాన్‌పూర్ 3.5, కాటారం 3.1, వెల్గటూర్ 2, రామగుండం 2.4, సుల్తానాబాద్ 1.3, ధర్మారం 2.2, జూలపల్లి 3.3, పెద్దపల్లి 1, కోనరావుపేట 1.7, ఇల్లంతకుంట 3.2, చందుర్తిలో 2.8, వేములవాడ 4.4, ఎల్లారెడ్డిపేట 2.1, గంభీరావుపేట 3.1, ముస్తాబాద్ 1.8, పెగడపెల్లి 2.2, గొల్లపల్లి 2.4, ధర్మపురి 1.7, మేడిపల్లి 2.3, కొడిమ్యాల 4.2, మల్యాల 3.2, జగిత్యాల, మల్లాపూర్, సారంగాపూర్ 3, కోరుట్ల 2.2, రామడుగు 3.9, మానకొండూర్ 2, గంగాధర 3.4, చొప్పదండి 1.8, జమ్మికుంటలో 1.3, తిమ్మాపూర్ 2.2, హుస్నాబాద్ 1, బెజ్జంకిలో 1.4, కోహెడ 2, ఎల్కతుర్తి 1.3, కరీంనగర్ 3.6, భీమదేవరపల్లి 1.2, కమలాపూర్ 1.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జూన్‌నుంచి ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 76.7 సెంటీమీటర్లకుగాను 79 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటికీ సాధారణం మించిన వర్షం కురిసింది. 38 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా.. 12 మండలాల్లో అధిక వర్షం కురిసింది.