![Health Department Inquiry in Uppal Heritage - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/30/heritage.jpg.webp?itok=8rRO9brv)
తనిఖీలు నిర్వహిస్తున్న వైద్యాధికారులు
ఉప్పల్: ఉప్పల్ ఐడీఏలోని హెరిటేజ్ కంపెనీలో బుధవారం వైద్యాధికారుల బృందం విస్తృత తనిఖీలు చేపట్టారు. బుధవారం ‘సాక్షి’దినపత్రికలో ‘హెరిటేజ్‌లో కరోనా కల్లోలం’పేరిట ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఉదయం హుటాహుటిన వైద్యాధికారి డాక్టర్ పల్లవి ఆధ్వర్యంలో హెరిటేజ్ ప్లాంట్‌లోని కార్మికులు పనిచేసే పలు డిపార్టుమెంట్లను, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను కార్మికులను కలిసి విచారణ చేపట్టారు. దీంతోపాటు లక్ష్మీనారాయణకాలనీలో హోం క్వారంటైన్‌లో ఉన్న సెక్యూరిటీ గార్డుల గదులను పరిశీలించారు. అంతకుముందు కథనానికి స్పందించిన హెరిటేజ్ యాజమాన్యం కూడా ముందుగానే హోం క్వారంటైన్‌లో ఉన్న సెక్యూరిటీగార్డులను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment