వారసత్వంగా అగ్ని ఆరాధన
మణిపూర్‌లోని ఆండ్రో గ్రామం. ఈ యేడాది ఉత్తమ వారసత్వ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. అంతటి ప్రత్యేకత ఆ గ్రామానికి ఏముందో తప్పక తెలుసుకోవాల్సిందే!
మణిపూర్ పర్యాటక మంత్రిత్వ శాఖ ఇటీవల ఉత్తమ పర్యాటక గ్రామాలపోటీని నిర్వహించింది. దీనిలో ఆండ్రో విలేజ్‌కు వారసత్వ విభాగంలో అత్యుత్తమ పర్యాటక గ్రామంగా ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం 2024 వేడుకల సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లోని ప్లీనరీ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో మణిపూర్ టూరిజం అధికారులు ఆండ్రో విలేజ్ ప్రతినిధులకు మంత్రిత్వ శాఖ ఈ అవార్డును అందజేసింది.
ఆండ్రో గ్రామం ప్రత్యేక సాంస్కృతిక వారసత్వం, సాంప్రదాయ పద్ధతులు ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక కావడానికి ప్రధాన కారకంగా నిలిచాయి.
ఎన్నో వారసత్వ ప్రత్యేకతలు : అండ్రో గ్రామంలో గొప్ప సాంస్కృతిక, చారిత్రక వారసత్వానికి నిదర్శనంగా స్థానిక జానపద కథలను కళ్లకు కట్టే ఒక ఆలయం ఉంది. ఈ ఆలయంలో శతాబ్దాల నాటి నుంచి వారసత్వంగా అగ్ని ఆరాధనను కొనసాగిస్తూ వస్తున్నారు. వేల ఏళ్లుగా అఖండదీపం ఆరకుండా వెలుగుతూనే ఉండటం ఈ గ్రామం ప్రత్యేకత. ఇది ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులను ఆకర్షిస్తోందిది.
ఇక్కడ ప్రకృతి అందాలతోపాటు మటువా బహదూర్ మ్యూజియం, వివిధ గిరిజన∙తెగలకు సంబంధించిన కుటీరాలు, కుండల తయారీ.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పర్యాటకుల ద్వారా స్థానిక ప్రజలకు ఆదాయం, ఉపాధి కల్పనకు దోహదం చేస్తుంది.
ఆండ్రో గ్రామస్తులు తమ వారసత్వాన్ని కొనసాగించడంలోనూ, నిలబెట్టు కోవడంలో స్థానికులను నిమగ్నం చేయడానికి అనేక వ్యూహాలను అను సరిస్తున్నారు. అదే సమయంలో వారిని పర్యాటక కార్యకలాపాలో కూడా భాగస్వాములను చేస్తున్నారు. ఈ విశేషాలతోనే ఈ గ్రామం ఉత్తమ వారసత్వ పర్యాటక గ్రామంగా మొదటి ప్లేస్‌లో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment