category
-
అమెరికా: మిల్టన్... తగ్గేదేలే!
గాలులు వీచే వేగం ఆధారంగా అమెరికాలోని నేషనల్ హరికేన్ సెంటర్ పలు తీవ్రతలను సూచిస్తూ హరికేన్లను వివిధ కేటగిరీలుగా వర్గీకరిస్తుంది. ఈ కొలమానం రూపకర్త హెర్బర్ట్ సఫిర్ అనే ఇంజినీర్. హరికేన్ సెంటర్ మాజీ డైరెక్టర్ రాబర్ట్ సింప్సన్ ఈ కొలబద్దను 1970ల నుంచి అమలుచేయడం ఆరంభించడంతో ‘సఫిర్-సింప్సన్ హరికేన్ విండ్ స్కేలు’గా దీన్ని పిలుస్తున్నారు. ఇప్పుడు దీనికి కాలం చెల్లినట్టే అనిపిస్తోంది. ఎంతోకాలంగా మారని ఈ పాత స్కేల్ మీద 1 నుంచి 5 వరకు మాత్రమే కేటగిరీలు ఉన్నాయి. దూసుకొస్తున్న ‘మిల్టన్’ హరికేన్ పుణ్యమాని ఇప్పుడు ఆ పాత ప్రమాణాన్ని సవరించి ‘కొత్త విభాగాలు’ ఏర్పాటు చేయాల్సిన అవసరమొచ్చినట్టే కనిపిస్తోంది.‘మిల్టన్’ హరికేన్ అతి వేగంగా.. అతి శక్తిమంతమైన కేటగిరి-5లోకి మారింది. కొద్ది గంటల్లోనే తీవ్రత స్థాయిని పెంచుకుని ‘మిల్టన్’ ఒక్కసారిగా కేటగిరి-2 నుంచి కేటగిరి-5లోకి దూకేసి ఫ్లోరిడాపై గురిపెట్టి ముందుకు కదులుతోంది. నిన్న ‘హెలెన్’ హరికేన్ దెబ్బకు అమెరికాలోని ఐదు రాష్ట్రాలు కకావికలమయ్యాయి. అవి నేటికీ తెప్పరిల్లలేదు. ఆ విపత్తు నుంచి తేరుకోకుండానే, కోలుకోకుండానే ఇప్పుడు మరోసారి మిల్టన్ రూపంలో ప్రమాదం చుట్టుముడుతోంది.మెక్సికో సింధుశాఖలో ‘మిల్టన్’ ఏర్పడింది. గంటకు 96 మైళ్ల వేగంతో ఓ మాదిరి గాలులు వీచే కేటగిరి-2 ఉష్ణమండల తుపాను స్థాయి నుంచి కేవలం రోజున్నర వ్యవధిలోనే గంటకు 180 మైళ్ళ (288 కి.మీ.) వేగంతో పెనుగాలులు ఉద్ధృతంగా వీస్తూ కేటగిరి-5 హరికేన్‌గా మిల్టన్ పరివర్తనం చెందింది. చూస్తుంటే మిల్టన్ దూకుడు తగ్గేట్టు లేదు. దీని ‘శక్తి’ ఇంకా పెరిగి కేటగిరి-6లోకి మారుతుందా? అంటే చెప్పలేం. ఎందుకంటే హరికేన్ల శక్తిస్థాయుల్ని కొలిచే గరిష్ఠ స్కేల్ ప్రమాణం కేటగిరి-5. కేటగిరి-6 అనేది సాంకేతికంగా ఇప్పటివరకు లేనే లేదు. అదొక సైద్ధాంతిక పరికల్పన మాత్రమే. అంటే ఊహాజనిత (Hypothetical) భావన. భావనలు, ఊహలు ఉన్నా, లేకపోయినా.. మిల్టన్ మాత్రం అతి త్వరలో కేటగిరి-6 హరికేన్ రేంజికి చేరుతుందని నిపుణుల అంచనా.గాలుల వేగం గంటకు 157 మైళ్ళు (252 కిలోమీటర్ల) దాటితే అది కేటగిరీ-5 హరికేన్ అవుతుంది. గంటకు 192 మైళ్ల (307 కిలోమీటర్ల) ప్రచండ వేగంతో గాలులు వీస్తే అది కేటగిరి-5 ‘అంతిమ హద్దు’ను దాటవేసినట్టే. 1980 నుంచి చూస్తే కేవలం 5 హరికేన్లు, టైఫూన్లు మాత్రమే కేటగిరి-5 కంటే ఎక్కువ తీవ్రతతో సంభవించాయి. కడపటి సమాచారం అందేసరికి.. వెచ్చటి గల్ఫ్ ఆఫ్ మెక్సికో జలాల్లో గంటకు 9 మైళ్ళ వేగంతో కదులుతున్న ‘మిల్టన్’ హరికేన్ బుధవారం ‘తంపా అఖాతం’ వద్ద తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు.ఫ్లోరిడా పశ్చిమ తీరంపై ప్రభావం అధికంగా ఉండవచ్చు. ఫ్లోరిడాలోని పలు ప్రాంతాల్లో ప్రజల్ని ఇళ్ళు ఖాళీ చేయించి సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. మనం బోయింగ్ 747 జెట్ విమానం ఇంజిన్ లోపల ఉంటే ఆ ‘హోరు’ ఎలా ఉంటుందో.. కేటగిరీ-5 హరికేన్ గర్జన అలా ఉంటుందని బ్రిటన్ పత్రిక ‘ది ఇండిపెండెంట్’ వర్ణించింది.- జమ్ముల శ్రీకాంత్(Credit: USA TODAY, CBS News, ABC News, The Independent (UK), The Australian). -
ఉత్తమ వారసత్వ పర్యాటక గ్రామంగా ఆండ్రో, ఎక్కడుందో తెలుసా?
మణిపూర్‌లోని ఆండ్రో గ్రామం. ఈ యేడాది ఉత్తమ వారసత్వ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. అంతటి ప్రత్యేకత ఆ గ్రామానికి ఏముందో తప్పక తెలుసుకోవాల్సిందే! మణిపూర్ పర్యాటక మంత్రిత్వ శాఖ ఇటీవల ఉత్తమ పర్యాటక గ్రామాలపోటీని నిర్వహించింది. దీనిలో ఆండ్రో విలేజ్‌కు వారసత్వ విభాగంలో అత్యుత్తమ పర్యాటక గ్రామంగా ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం 2024 వేడుకల సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లోని ప్లీనరీ హాల్లో జరిగిన కార్యక్రమంలో మణిపూర్ టూరిజం అధికారులు ఆండ్రో విలేజ్ ప్రతినిధులకు మంత్రిత్వ శాఖ ఈ అవార్డును అందజేసింది. ఆండ్రో గ్రామం ప్రత్యేక సాంస్కృతిక వారసత్వం, సాంప్రదాయ పద్ధతులు ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక కావడానికి ప్రధాన కారకంగా నిలిచాయి. ఎన్నో వారసత్వ ప్రత్యేకతలు : అండ్రో గ్రామంలో గొప్ప సాంస్కృతిక, చారిత్రక వారసత్వానికి నిదర్శనంగా స్థానిక జానపద కథలను కళ్లకు కట్టే ఒక ఆలయం ఉంది. ఈ ఆలయంలో శతాబ్దాల నాటి నుంచి వారసత్వంగా అగ్ని ఆరాధనను కొనసాగిస్తూ వస్తున్నారు. వేల ఏళ్లుగా అఖండదీపం ఆరకుండా వెలుగుతూనే ఉండటం ఈ గ్రామం ప్రత్యేకత. ఇది ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులను ఆకర్షిస్తోందిది. ఇక్కడ ప్రకృతి అందాలతోపాటు మటువా బహదూర్ మ్యూజియం, వివిధ గిరిజన∙తెగలకు సంబంధించిన కుటీరాలు, కుండల తయారీ.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పర్యాటకుల ద్వారా స్థానిక ప్రజలకు ఆదాయం, ఉపాధి కల్పనకు దోహదం చేస్తుంది. ఆండ్రో గ్రామస్తులు తమ వారసత్వాన్ని కొనసాగించడంలోనూ, నిలబెట్టు కోవడంలో స్థానికులను నిమగ్నం చేయడానికి అనేక వ్యూహాలను అను సరిస్తున్నారు. అదే సమయంలో వారిని పర్యాటక కార్యకలాపాలో కూడా భాగస్వాములను చేస్తున్నారు. ఈ విశేషాలతోనే ఈ గ్రామం ఉత్తమ వారసత్వ పర్యాటక గ్రామంగా మొదటి ప్లేస్‌లో నిలిచింది. -
ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది
కవాడిగూడ (హైదరాబాద్): ఎస్సీవర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఎంఆర్పీఎస్ (టీఎస్) ఆధ్వర్యంలో ఆర్థిక, రాజకీయ రంగాలలో మాదిగలకు సమానవాటా కోసం డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్ వద్ద cను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధాని మోదీకి పంపినా కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీ, ఎస్సీ వర్గీకరణపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల తరువాత జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని, అప్పుడు ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుతామని అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం రాష్ట్రవ్యాప్తంగా 33 దళిత స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేశామని, 50 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశామని తెలిపారు. హైదరాబాద్‌లో సదాలక్ష్మి విగ్రహం ఏర్పాటు చేసి, మాదిగ భవన నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వైద్య, ఆరోగ్య శాఖలోని శానిటేషన్, డైట్ విభాగాలలో దళితులకే కాంట్రాక్ట్ కేటాయించే విధంగా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. వంగపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్(టీఎస్) జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సువర్ణరాజు, మాదిగ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరి వెంకట్, ఎంఆర్పీఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రుక్కమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఆటో అవార్డ్స్ 2023 విన్నర్స్ జాబితా - పూర్తి వివరాలు
ప్రముఖ జాతీయ మీడియా సంస్థ న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రతిష్టాత్మక 2023 ఆటో అవార్డ్స్ మూడో ఎడిషన్ విజేతల వివరాలు అధికారికంగా వెల్లడయ్యాయి. ఆటోమొబైల్ నిపుణులు, పరిశ్రమ నాయకులు, ఉన్నతాధికారులు, ఆటోమోటివ్ తయారీదారుల సమక్షంలో అవార్డుల ప్రధానం జరిగింది. ఫోర్ వీలర్, టూ వీలర్ విభాగాల్లో జరిగిన నామినేషన్స్‌లో అవార్డులు సొంతం చేసుకున్న వాహనాల జాబితా ఇక్కడ చూడవచ్చు 👉బడ్జెట్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ - హోండా షైన్ 100 👉ఎలక్ట్రిక్ టూ-వీలర్ ఆఫ్ ది ఇయర్ - అల్ట్రావయొలెట్ ఎఫ్ 77 👉స్కూటర్ ఆఫ్ ది ఇయర్ - హీరో జూమ్ 👉ప్రీమియం మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ - కేటీఎమ్ డ్యూక్ 390 👉మోస్ట్ ట్రస్టడ్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్ - టీవీఎస్ మోటార్ కంపెనీ ఇదీ చదవండి: 81.5 కోట్ల భారతీయుల ఆధార్ వివరాలు లీక్ - అమ్మడానికి సిద్దమైన హ్యాకర్! 👉ఫేస్‌లిఫ్ట్ ఆఫ్ ది ఇయర్ (మాస్ మార్కెట్) - టాటా నెక్సన్ 👉డిజైన్ ఆఫ్ ది ఇయర్ - హ్యుందాయ్ వెర్నా 👉ఎస్యూవీ ఆఫ్ ది ఇయర్ - మారుతి సుజుకి జిమ్నీ 👉ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్ - హ్యుందాయ్ ఐయోనిక్ 5 👉హై-టెక్ కార్ ఆఫ్ ది ఇయర్ - హ్యుందాయ్ ఐయోనిక్ 5 👉మోస్ట్ ట్రస్టడ్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్ - హ్యుందాయ్ మోటార్ ఇండియా 👉మోస్ట్ ప్రామిసింగ్ కార్ ఆఫ్ ది ఇయర్ - ఎంజీ కామెట్ -
ఈ–వాహనాలకు ‘ఇంటి’ చార్జీలే..
సాక్షి, హైదరాబాద్ : ఇళ్ల వద్ద ప్రజలు సొంత ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్కు గృహ కేటగిరీ విద్యుత్ చార్జీలనే వర్తింపజేయాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ స్పష్టంచేసింది. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లకు మాత్రం ప్రత్యేక మీటర్లు ఏర్పాటు చేసి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఖరారు చేసిన ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ టారిఫ్‌ను వర్తింపజేయాలని కోరింది. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల వద్ద చార్జింగ్ సదుపాయం పొందే వారు విద్యుత్ చార్జీలతో పాటు సర్వీసు చార్జీలు సైతం చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. సర్వీసు చార్జీలను ఈఆర్సీ/రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేస్తుందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని నిర్ణయించిన నేపథ్యంలో పబ్లిక్ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసింది. 40 లక్షలకు పైగా జనాభా గల హైద రాబాద్ వంటి మహానగరాలు, వాటికి అనుబంధంగా ఉన్న రహదారుల వద్ద ఏడాది నుం చి మూడేళ్లలోగా ప్రైవేటు చార్జింగ్ సదుపాయాలను అభివృద్ధి చేయాలని సూచించింది. ఈ–వాహనాల చార్జింగ్ మార్గదర్శకాల్లో ముఖ్యాంశాలు.. గృహాలు/కార్యాలయాల వద్ద ప్రైవేటు చార్జింగ్‌ను అనుమతించాలి. డిస్కంలు ఆ మేరకు సదుపాయాలు కల్పించాలి. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు (పీసీఎస్)ల ఏర్పాటుకు ఈఆర్సీ నుంచి లైసెన్సు పొందాల్సి న అవసరం లేదు. ఏ వ్యక్తి/సంస్థ అయి నా పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ), కేంద్ర విద్యుత్ మం త్రిత్వ శాఖ జారీ చేసిన/జారీ చేసే మార్గదర్శకాలు, సాంకేతిక, భద్రత, నిర్వహణ ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ నెలకొల్పాలనుకునే వ్యక్తులు విద్యుత్ కనెక్షన్ కోసం డిస్కంకు దరఖాస్తు చేసుకోవాలి. డిస్కంలు ప్రాధాన్యతనిచ్చి కనెక్షన్ జారీ చేయాలి. ఏదైనా చార్జింగ్ స్టేషన్/చైన్ ఆఫ్ చార్జింగ్ స్టేషన్లు నేరుగా ఓపెన్ యాక్సెస్ విధానంలో విద్యుదుత్పత్తి కంపెనీ నుంచి విద్యుత్‌ను పొందొచ్చు. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్‌కు ఉండాల్సిన కనీస సదుపాయాలు సబ్ స్టేషన్ ఉండాల్సిన అన్ని రకాల పరికరాలతో ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ సబ్ స్టేషన్ ఉండాల్సిన అన్ని రకాల పరికరాలతో ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ 33/11 కేవీ లైన్/కేబుల్స్, అనుబంధ పరికరాలు ఆన్లైన్లో చార్జింగ్ స్లాట్ల బుకింగ్ సదుపాయం కల్పించేందుకు కనీసం ఒక ఆన్లైన్ నెట్వర్క్ సర్వీసు ప్రొౖవైడర్తో ఒప్పందం కుదుర్చుకుని ఉండాలి. చార్జింగ్ స్టేషన్ల లొకేషన్, చార్జర్ల రకాలు, సంఖ్య, లభ్యత, చార్జీల వివరాలను వాహనదారులకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి. సరైన సివిల్స్ వర్క్స్, సరైన కేబులింగ్/ఎలక్ట్రికల్ వర్క్స్ వాహనాల రాకపోకలతో పాటు చార్జింగ్కు సరిపడా స్థలం హౌసింగ్ సొసైటీలు, మాల్స్, కార్యాలయ సముదాయాలు, రెస్టారెంట్లు, హోటళ్ల తదితర ప్రాంతాల వద్ద చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి సందర్శకుల వాహనాల చార్జింగ్కు అనుమతించొచ్చు. -
వివిధ కేటగిరీల్లో టాప్ 15ర్యాంకులు
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రామ సచివాలయ ఫలితాలలో వివిధ కేటగిరీల్లో (బీసీ, ఎస్సీ, ఎస్టీ) మొదటి 15 ర్యాంకులు పొందిన విద్యార్థుల సంఖ్యను విడుదల చేశారు. ఈ సందర్భంగా మొత్తం 18 విభాగాల్లో ఇవి ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. విభాగం బీసీలు ఎస్సీలు ఎస్టీలు 1 ఉమెన్ పోలీస్ 36 1 0 2 యానిమల్ హస్బండరీ అసిస్టెంట్ 20 7 0 3 వార్డ్ హెల్త్ సెక్రటరీ 32 10 1 4 ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 21 0 0 5 పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 23 2 0 6 పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 24 0 0 7 విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ 25 1 0 8 విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ 18 8 1 9 విలేజ్ హార్టీకల్చర్ అసిస్టెంట్ 22 3 2 10 విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్ 2 61 1 1 11 విలేజ్ సెరీకల్చర్ అసిస్టెంట్ 34 8 2 12 విలేజ్ సర్వెయర్ గ్రేడ్ 3 69 1 1 13 వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ 23 2 0 14 వార్డ్ ఎమినిటీస్ సెక్రటరీ గ్రేడ్ 2 22 0 0 15 వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డాటా ప్రాసెసింగ్ సెక్రటరీ 26 1 0 16 వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యూలేషన్ సెక్రటరీ 19 0 0 17 వార్డ్ సానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ 26 3 0 18 వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 3 24 3 0 -
కాంగ్రెస్‌లో సమన్వయం కుదిరేనా..!
సాక్షి, ఆదిలాబాద్: ముందస్తు ఎన్నికల సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు, నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాల మధ్య సమన్వయానికి పార్టీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీని నిలువరించాలంటే ముందుగా పార్టీలో ఐక్యత ముఖ్యమని భావిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు ప్రయత్నాలు ఆరంభించింది. ఈ దిశగా ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ సమావేశాలు నిర్వహిస్తోంది. ఇటీవల తెలంగాణకు ఇన్‌చార్జీలుగా నియమితులైన ముగ్గురిలో ఒకరైన ఏఐసీసీ కార్యదర్శి, ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాసన్ కృష్ణన్ బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రానున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యనిర్వాహకులతో సమావేశం కానున్నారు. దీంతో ఆ పార్టీ వ్యవహారాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఏకతాటిపైకి సాధ్యమేనా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా జిల్లాలో వర్గపోరు, గ్రూపు రాజకీయాలు మాత్రం కొనసాగుతున్నాయి. కొద్ది నెలలుగా రాష్ట్రంలో పరిణామాలు జిల్లా రాజకీయాల్లోనూ వర్గపోరును తేటతెల్లం చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాకు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నియోజకవర్గాల్లో తన పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. మరోపక్క మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు తన ప్రాబల్యాన్ని చాటేందుకు యత్నాలు చేస్తున్నారు. దీంతో అన్ని నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో పార్టీ మూడు ముక్కలైంది. మాజీ మంత్రి, సీనియర్ నాయకులు సి.రాంచంద్రారెడ్డి ఒక గ్రూపుగా, టీపీసీసీ కార్యదర్శి, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత మరో గ్రూపుగా, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి భార్గవ్‌దేశ్‌పాండే ఇంకో గ్రూపు కొనసాగిస్తుండడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. బోథ్‌లో సోయం బాపురావు, అనిల్‌జాదవ్‌లు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ కలిసి నడిచింది లేదు. మరోవైపు ఆదివాసీ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న సోయం బాపురావు వచ్చే ఎన్నికల్లో బోథ్ నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తారా.. లేనిపక్షంలో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగుతారా అనేదానిపై ఆసక్తి నెలకొంది. ఇదే నియోజకవర్గానికి చెందిన నరేష్‌జాదవ్ కిందటిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోసారి ఆయన ఎంపీ స్థానానికే పోటీ చేయాలని భావిస్తున్నారు. మాజీ మంత్రి, సీనియర్ నాయకులు రాంచంద్రారెడ్డి వర్గంలో కొనసాగుతున్న ఆయన సీనియర్ నాయకుల అండదండలు ఉంటాయన్న విశ్వాసంతో కదులుతున్నారు. నిర్మల్‌లో డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందాలనే ఉత్సాహంతో ముందుకు కదులుతున్నారు. ముథోల్ నియోజకవర్గంలో అన్నదమ్ముళ్లు నారాయణరావుపటేల్, రామారావు పటేల్‌ల మధ్య గ్రూపు రాజకీయాలు నెలకొన్నాయి. సీనియర్ నాయకులైన నారాయణరావు పటేల్ మరోసారి ఇక్కడినుంచి బరిలో దిగుతారా, లేనిపక్షంలో మహేశ్వర్‌రెడ్డి వర్గంతో కొనసాగుతున్న రామారావు పటేల్ పైచేయి సాధిస్తారా అనేది రానున్న రోజుల్లో తేటతెల్లం కానుంది. ఖానాపూర్ నియోజకవర్గంలో భరత్ చౌహాన్, హరినాయక్ల మధ్య వైరుధ్యం ఉంది. ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు మరోసారి పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. కాగజ్‌నగర్‌లో రావి శ్రీనివాస్, శ్రీనివాస్‌యాదవ్‌లు ఉండగా, మంచిర్యాలలో ప్రేమ్‌సాగర్‌రావు, అరవింద్‌రెడ్డిలు పార్టీలో సీనియర్లుగా ఉన్నారు. చెన్నూర్‌లో బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే సంజీవ్‌రావు, బెల్లంపల్లిలో చిలుమురి శంకర్, దుర్గాభవానిలు నియోజకవర్గంలో పట్టుకు యత్నాలు చేస్తున్నారు. పార్టీలో సందడి.. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న అంచనాల నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం కనిపిస్తోంది. ప్రధానంగా ఇన్చార్జీలు పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో పార్టీ ముఖ్య నేతల మధ్య సమన్వయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో ఉమ్మడి జిల్లాలో పార్టీ పరిస్థితి, కార్యకర్తల మనోగతం తెలుసుకునేందుకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో నెలకొన్న సమస్యలను గుర్తించి అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆగస్టు, సెప్టెంబర్‌లోనే నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం మన్ననల కోసం నియోజకవర్గ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క ఇటీవల టీపీసీసీలో కొత్త జిల్లాలకు అధ్యక్షులను నియమించాలనే తీర్మానం కూడా చేసినట్లు జిల్లా నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం ద్వారా కొత్త జిల్లాలకు అధ్యక్షులను గుర్తించే విషయంలోనూ ఇన్చార్జీ దృష్టి పెట్టే అవకాశం ఉంది. బైక్ ర్యాలీ.. ఆదిలాబాద్‌లో బుధవారం ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న ఇన్చార్జీ శ్రీనివాసన్ కృష్ణన్, సబితా ఇంద్రారెడ్డిలకు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదిలాబాద్ శివారు నుంచి వారిని సాదరంగా ఆహ్వానించి బైక్ ర్యాలీ ద్వారా జిల్లా కేంద్రానికి రానున్నారు. ఉదయం 10గంటలకు ఆదిలాబాద్‌లోని పంచవటి హోటల్లో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. -
మార్కెట్ లీడర్స్ గా ఓల, ఫ్లిప్‌కార్ట్
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దేశీ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మరోసారి రారాజుగా నిలిచింది. తన ప్రధాన ప్రత్యర్థులకు చెక్ పెట్టి దేశంలో నెం.1 గా నిలిచింది. అటు ఆన్లైన్ క్యాబ్ అగ్రిగేషన్ స్పేస్ లో ఓల ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. రెడ్ సీర్ కన్సల్టింగ్ విడుదల చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనాయి. 50 శాతం మార్కెట్ షేర్ తో ఫ్లిప్ కార్ట్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా స్నాప్ డీల్ రెండవస్థానం దక్కించుకుంది. అమెజాన్ మూడవ స్థానానికి పరిమితమైంది. ఈ కామర్స్ విభాగంలో ఫ్లిప్ కార్ట్ 35-37, స్నాప్‌డీల్ 21-23శాతం, అమెజాన్ 17-19 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. అయితే, పరిస్థితి స్నాప్‌డీల్ కు ప్రకాశవంతంగా లేదని అభిప్రాయపడింది. 2016 మొదటి త్రైమాసికంలో అమెజాన్ అమ్మకాలు బావున్నాయని, స్నాప్ డీల్ ను అధిగమించిందనీ రెడ్ సీర్ సీఈఓ అనిల్ కుమార్ చెప్పారు. ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ కేటగిరీలో అమెజాన్ దూకుడుగా ఉందని, రాయితీలు, ప్రకటనల మీద ఖర్చు కొనసాగిస్తోందని ఈ స్టడీ తెలిపింది. గత ఏడాది దేశ ఈ కామర్స్ బిజినెస్ 13 బిలియన్ల డాలర్లుగా నమోదైంది. 2012 లో కేవలం మూడు బిలియన్ డాలర్లు ఉన్న ఈ మార్కెట్ గణనీయమైన గ్రోత్ సాధించిందని స్టడీ తెలిపింది. 2016 మొదటి క్వార్టరలో అమ్మకాలు కొద్దిగా క్షీణించాయని వివరించింది. ప్రధాన ప్రత్యర్థి ఉబెర్ తో పోలిస్తే వ్యాపారంలో రెట్టింపు వేగంతో దూసుకుపోయిన ఓల మార్కెట్ లీడర్ గా నిలిచింది. 2015 లో 61 శాతం మొత్తం మార్కెట్ వాటాతో ఓల టాప్ లో నిలవగా, ఉబెర్ 26 శాతం వాటా తో సరిపెట్టుకుంది. ఆన్ లైన్ ట్యాక్సీ సెగ్మెంట్ లో ప్రతి క్వార్టర్ కి 25 శాతం పెరుగుదల కనిపిస్తోందని ఈ నేపథ్యంలో4 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నామన్నారు. ఇటీవల లాంచ్ చేసిన ఓల మైక్రో ఈ విజయంలో ప్రధాన పాత్ర పోషించిందని తెలిపింది. కాగా ఫ్లిప్ కార్ట్ ను తోసి రాజనే ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో అమెజాన్ పెట్టుబడుల వరదను పారిస్తోంది. అటు ఓల, ఉబర్ రవాణా నియమాలు ఉల్లంఘించారనే ఆరోపణలతో, అధిక చార్జీలు వస్తూలు చేస్తున్నారనే ఆరోపణలతో దేశ రాజధాని ఢిల్లీలోనూ, కర్ణాటకలో కేసులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. -
ప్రత్యేక హోదా తీర్మానానికి సభ ఏకగ్రీవ ఆమోదం