మార్కెట్ లీడర్స్ గా ఓల, ఫ్లిప్కార్ట్ | Flipkart No. 1 in India, Snapdeal, Amazon follow; Ola tops its categor | Sakshi
Sakshi News home page

మార్కెట్ లీడర్స్ గా ఓల, ఫ్లిప్కార్ట్

Published Sat, Jul 2 2016 1:54 PM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

మార్కెట్ లీడర్స్ గా ఓల, ఫ్లిప్కార్ట్ - Sakshi

మార్కెట్ లీడర్స్ గా ఓల, ఫ్లిప్కార్ట్

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దేశీ దిగ్గజం ఫ్లిప్ కార్ట్  మరోసారి రారాజుగా  నిలిచింది. తన ప్రధాన ప్రత్యర్థులకు చెక్ పెట్టి   దేశంలో నెం.1 గా నిలిచింది. అటు ఆన్లైన్ క్యాబ్ అగ్రిగేషన్ స్పేస్ లో ఓల ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. రెడ్ సీర్ కన్సల్టింగ్  విడుదల  చేసిన అధ్యయనంలో ఈ  విషయాలు వెల్లడైనాయి.  50 శాతం  మార్కెట్ షేర్ తో  ఫ్లిప్ కార్ట్  తన స్థానాన్ని నిలబెట్టుకోగా స్నాప్ డీల్ రెండవస్థానం దక్కించుకుంది.  అమెజాన్ మూడవ  స్థానానికి పరిమితమైంది. ఈ కామర్స్ విభాగంలో ఫ్లిప్ కార్ట్ 35-37,  స్నాప్డీల్ 21-23శాతం,    అమెజాన్ 17-19 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. అయితే, పరిస్థితి స్నాప్డీల్ కు  ప్రకాశవంతంగా లేదని అభిప్రాయపడింది. 2016 మొదటి త్రైమాసికంలో  అమెజాన్ అమ్మకాలు బావున్నాయని, స్నాప్ డీల్ ను అధిగమించిందనీ రెడ్ సీర్ సీఈఓ అనిల్ కుమార్ చెప్పారు. ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ కేటగిరీలో అమెజాన్ దూకుడుగా ఉందని, రాయితీలు,  ప్రకటనల మీద ఖర్చు కొనసాగిస్తోందని ఈ స్టడీ తెలిపింది.

గత ఏడాది దేశ ఈ కామర్స్ బిజినెస్ 13 బిలియన్ల డాలర్లుగా నమోదైంది. 2012 లో కేవలం మూడు బిలియన్ డాలర్లు ఉన్న ఈ మార్కెట్ గణనీయమైన  గ్రోత్ సాధించిందని స్టడీ తెలిపింది.  2016 మొదటి క్వార్టరలో అమ్మకాలు కొద్దిగా క్షీణించాయని వివరించింది.

ప్రధాన ప్రత్యర్థి ఉబెర్ తో పోలిస్తే వ్యాపారంలో  రెట్టింపు వేగంతో  దూసుకుపోయిన  ఓల మార్కెట్ లీడర్ గా నిలిచింది. 2015 లో 61 శాతం  మొత్తం మార్కెట్ వాటాతో  ఓల  టాప్ లో నిలవగా,   ఉబెర్  26 శాతం  వాటా తో సరిపెట్టుకుంది. ఆన్ లైన్ ట్యాక్సీ సెగ్మెంట్ లో ప్రతి క్వార్టర్ కి 25 శాతం పెరుగుదల కనిపిస్తోందని ఈ నేపథ్యంలో4 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నామన్నారు.  ఇటీవల లాంచ్   చేసిన  ఓల  మైక్రో  ఈ విజయంలో  ప్రధాన పాత్ర పోషించిందని తెలిపింది.
కాగా   ఫ్లిప్ కార్ట్  ను తోసి రాజనే ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో అమెజాన్ పెట్టుబడుల వరదను పారిస్తోంది.  అటు ఓల, ఉబర్  రవాణా నియమాలు ఉల్లంఘించారనే ఆరోపణలతో, అధిక చార్జీలు వస్తూలు చేస్తున్నారనే ఆరోపణలతో  దేశ రాజధాని ఢిల్లీలోనూ, కర్ణాటకలో కేసులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement