ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేషన్‌లో పేర్కొన్న ఆస్తుల వ్యవహారంపై వచ్చిన ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వివరణ ఇచ్చారు. గత ఆరేళ్లుగా తమ కుటుంబం అంతా స‍్వచ్ఛందంగా ఆస్తుల వివరాలు వెల్లడిస్తున్నామన్నారు. ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ, నాయకుడు కానీ తమలా ఆస్తులు ప్రకటించలేదన్నారు. ఎవరూ అడగకుండానే తాము ఆస్తులు ప్రకటిస్తున్నామన్నారు. ఆస్తుల విషయంలో తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. తనపై కావాలనే బురద జల్లుతున్నారని ఆయన అన్నారు.
Published Thu, Mar 9 2017 4:41 PM | Last Updated on Wed, Mar 20 2024 3:21 PM
Advertisement
Advertisement
Advertisement