ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఆస్తుల ప్రకటన అనేది జిమ్మిక్కేనని, అసలు ఆస్తుల విలువ చెప్పడం లేదన్న ‘సాక్షి’ కథనాలు లోకేశ్ ఎన్నికల అఫిడవిట్ ద్వారా నిజమని నిరూపితమయ్యాయి. ఏటా ఆస్తులను ప్రకటిస్తూ దేశంలోనే అందరికీ ఆదర్శంగా ఉంటున్నామన్న ‘నారా’ కుటుంబం తెలుగు ప్రజలను ఎలా తప్పుదోవ పట్టించిందో బట్టబయలైంది. ఐదు నెలల క్రితం లోకేశ్ ప్రకటించిన ఆస్తులకు ఇప్పుడు ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించిన విలువకు పొంతన లేనేలేదు. ఏకంగా ఈ ఐదునెలల్లో లోకేశ్ ఆస్తి విలువ 22 రెట్లు పెరిగిపోయింది.