కొయ్య బారుతున్న శిల్పం
తరతరాల వారసత్వం కళ సృజనకు.. సునిశిత దృష్టికి వారధి కళ సహనానికి.. దృఢ సంకల్పానికి సాక్ష్యం కళశిల్పం.. శిల్పుల పనితనానికి దర్పణం కొయ్య శిల్పం ఆధ్యాత్మిక తిమిరాల రాగం కురిచేడుకు చెందిన మాచరౌతు వంశీయులకు కళాత్మక దృష్టి ఉన్నా భవిష్యత్ తరాలకు ఈ విద్య అందించడం కష్టంగా మారుతోంది మారుతున్న కాలం చెక్క బొమ్మలను సుదూరంగా నెట్టేస్తోంది...!
- కురిచేడు
గుడిలో ఏ వేడుక జరిగినా.. ఆలయూలకు ఎలాంటి బొమ్మలు కావాలన్నా రాష్ర్టం నలుమూలల నుంచి స్థానికంగా నివాసం ఉండే మాచరౌతు శ్రీనివాసులు గడప తొక్కాల్సిందే. కొయ్యతో కావాల్సిన రూపాల్లో శిల్పాలను చెక్కడం ఈ వంశీయుల ప్రత్యేకత. ఉత్సవ విగ్రహాలు, స్వామివార్ల వాహనాలైన అశ్వం, పులి, సింహం, హంస, హనుమంత, గరుడ, గజ, బొల్లావుల వంటి వాటిని తయూరు చేస్తే ఎవరైనా కళ్లప్పగించి చూడాల్సిందే. వంశపారంపర్యంగా వస్తున్న ఈ కళను నేటికీ జాగ్రత్తగా పట్టుకొస్తున్నారు. మాచరౌతు సుబ్బరాయుడు తన తండ్రి, తాతల వద్ద నేర్చుకున్న విద్యను తన కుమారులు శ్రీనివాసులు, రాముడుకు నేర్పించారు. వీరు తయూరు చేసే కళారూపాలకు ఎంతో విశిష్టత ఉంది. చక్కనైన డిజైన్లు.. రంగులతో ముగ్ధమనోహరంగా రూపొందిస్తారు.
ఇత్తడి రాకతో..
కాలంతో పాటు సంప్రదాయూల్లో కూడా కొన్ని మార్పులు వస్తున్నారుు. ప్రస్తుతం ఇత్తడి వాహనాలపై ప్రజలకు మోజు పెరగటంతో కొయ్యవాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపేవారి సంఖ్య క్రమేణా తగ్గుతోంది. ఎంతో ఉత్కృష్టమైన ఈ విద్య భావి తరాలకు ఎక్కడ అందకుండా పోతుందో అని కళాభిమానులు ఆవేదన చెందుతున్నారు. శ్రీనివాసులు కూడా తమ బిడ్డలు ఇదే పని చేయమని సూచించడంలేదు. జీవితంలో స్థిరపడే వృత్తిని కూడా ఎంచుకోవచ్చంటున్నారు.
కాలం.. శ్రమ!
ఒక్క వాహనాన్ని తయారు చేయటానికి సుమారు రెండు నెలలు పడుతుంది. దీనికి ఇద్దరు మనుషులు కావాలి. ‘ఏడాదిలో మూడు నెలలు మాత్రమే పండగల సీజన్ ఉంటుంది. విగ్రహాలను ద్రోణాచలం, తెనాలి, గుంటూరు, తదితర ప్రాంతాలనుంచి వచ్చినవారు కొంటారు. పూర్వకాలంలో ఈ బొమ్మలకు ఎక్కువ డిమాండ్ ఉండేది. ఇప్పుడు చాలా తగ్గిపోరుుంది. అందుకే వేరే పనులు కూడా చూసుకుంటున్నాం. మా తండ్రి నుంచి నేర్చుకున్న ఈ విద్యను నా సంతానానికి నేర్పాలా వద్దా అని ఆలోచిస్తున్నా. అరుుతే ఈ కళనునేర్చుకునేందుకు ఎవరు ముందుకు వచ్చినా నేర్పిస్తా’ అని శ్రీనివాసులు తెలిపారు.