హైదరాబాద్: హైదరాబాద్ ఉప్పల్ పారిశ్రామికవాడలోని హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది కరోనా బారిన పడే ప్రమాదం ఉందని, వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు మరింత మందికి సోకకుండా ప్లాంట్‌ను మూసి వేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న యువకుడి (19)కి తండ్రి నుంచి కరోనా పాజిటివ్ వచ్చినా, ఆ విషయం బయటకు పొక్కకుండా గోప్యత పాటించారని మండిపడ్డారు. అతనితో సమీపంగా వ్యవహరించిన 33 మందిని రహస్యంగా ఓ చిన్న ఇంట్లో ఉంచడం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
► హెరిటేజ్ ప్లాంట్‌లో పనిచేస్తున్న యువకుడి తండ్రి (53) రామంతాపూర్‌లోని శ్రీరమణపురంలో కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. ఈనెల 24న అతడికి పాజిటివ్ రావడంతో గాంధీ ఐసొలేషన్‌కు తరలించారు. 26వ తేదీన తల్లీ, కుమారుడి(సెక్యూరిటీ గార్డు)కి కూడా పాజిటివ్ అని తేలడంతో వారిని గాంధీ ఐసొలేషన్‌కు తరలించారు.
► సెక్యూరిటీ గార్డుతో సన్నిహితంగా మెలిగిన మరో ఆరుగురు సెక్యూరిటీ గార్డులతో పాటు, వీరితో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న మరో 27 మందిని కూడా సదరు ప్లాంట్ నిర్వాహకులు లక్ష్మీనారాయణకాలనీలోని ఓ చిన్న ఇంట్లో క్వారంటైన్‌లో ఉంచారు. తమ కంపెనీ పేరు బయటకు రాకుండా గోప్యంగా ఉంచారు. అంతేగాకుండా వీరిని విధులకు రావాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.
(ముంబై ఆసుపత్రిలో చేరిన నటుడు ఇర్ఫాన్)
► అయితే హోం క్వారంటైన్‌లో ఉన్న వారు ఇష్టానుసారంగా బయట తిరుగుతుండటంతో లక్ష్మీనారాయణ కాలనీ వాసులు గుర్తించి యాజమాన్యాన్ని నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. వెంటనే పాల ఉత్పత్తులను నిలిపివేసి కంపెనీ మూసివేయాలని డిమాండ్ చేశారు.
► కంపెనీ హెచ్‌ఆర్ బుకాయింపు సమాధానం చెప్పడంతో కాలనీవాసులు ఆందోళనకు దిగారు. తుదకు జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, సెక్యూరిటీ గార్డు ద్వారా ఎంత మందికి వైరస్ సోకిందోనని, ప్లాంట్‌లో అందరికీ టెస్ట్‌లు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
. (ఆమెతో విడిపోయాక సంతోషంగా ఉన్న: హీరో )
Comments
Please login to add a commentAdd a comment