ఏపీలో పాలధర పెంపు ఏదీ? | one of Andhra milk price hike? | Sakshi
Sakshi News home page

ఏపీలో పాలధర పెంపు ఏదీ?

Published Mon, Nov 24 2014 1:21 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM

ఏపీలో పాలధర పెంపు ఏదీ? - Sakshi

ఏపీలో పాలధర పెంపు ఏదీ?

హెరిటేజ్ కోసం పాడి రైతుల ప్రయోజనాలు బలి: మంత్రి హరీశ్

సిద్దిపేట: టీడీపీ అధినేత చంద్రబాబు జేబు సంస్థ హెరిటేజ్‌ను రక్షించుకోవడానికి పాడి రైతుల ప్రయోజనాలను బలిపెట్టారని భారీ నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో ఆదివారం మిల్క్‌గ్రిడ్ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో విజయ డెయిరీ ఎదగకుండా చేశారని ఆరోపించారు. పాడిపరిశ్రమ రైతులు బతకకుండా వ్యూహాలు పన్నారని ఆరోపించారు.

సీఎం కేసీఆర్ స్వయంగా రైతు కావడంతో రైతుల సమస్యల మూలాలు తెలిసి లీటర్ పాలధరను రూ. 4 పెంచారని, తద్వారా ఇక్కడి రైతులకు పరిశ్రమ లాభదాయకంగా మారుతోందన్నారు. ఇదే సమయంలో ఏపీలో పాల ధరను అక్కడి ప్రభుత్వం పెంచలేదన్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement