న్యూఢిల్లీ: బంగారు వర్ణంలో కనిపించే చితాకోకచిలుక ప్యూపాల వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అచ్చం బంగారు నాణేళ్లలా మెరిసిపోతున్న ఈ లార్వాల వీడియోను ఆటవీ శాఖ అధికారి ప్రవీణ్ కశ్వన్ సోమవారం ట్విటర్‌లో షేర్ చేశాడు. ఇవి లార్వా-ఇమాగో మధ్య చితాకోకచిలుకగా పరివర్తనం చెందె జీవ కీటక దశ అని తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఇవి బంగారం కాదు. టిథోరియా టారిసినా, సితాకోకచిలుకల ప్యూపాలు.. అద్బుతమైన ప్రకృతి’ అంటూ ట్వీట్ చేశాడు. 8 సెకన్ల నిడివి గల ఈ వీడియోను షేర్ చేసిన 8 గంటల్లోపే 43 వేల వ్యూస్, వందల్లో కామెంట్స్ వచ్చాయి. (వైరల్ : సందర్శకులపై నీటి జల్లులు)
ఈ వీడియోకు ‘‘ఇప్పటీ వరకు ఇలాంటి ప్యూపాలనే చూడలేదు’’, ‘‘ప్రకృతి ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది.. నీజంగా ప్రకృతి అద్భుతం’’, ‘‘బంగారం లాంటి ప్యూపా.. పరిణతి చెందిన వజ్రం’’ అంటూ నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా బంగారం మాదిరిగా కనిపించించే ఈ సితాకోకచిలుక ప్యుపాలను "టిథోరియా టారిసినా ప్యూపా" కశ్యన్ తన పోస్టులో వెల్లడించాడు. వీటిని ‘మచ్చల టైగర్వింగ్’ అని కూడా పిలుస్తారు. ఇవి దక్షిణ అమెరికాలోని మెక్సికోలో కనిపించే అరుదైన సీతాకోకచిలుక జాతి అని కశ్వన్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment