ఈ మధ్యకాలంలో పాములు ఒక్కడ పడితే అక్కడ ప్రత్యక్షమవుతున్నాయి. ఇళ్లు, షూలు, బైక్‌లు.. ఇలా కనిపించిన ప్రతిచోటా దూరిపోతున్నాయి. అనుకొని ప్రదేశాల్లో పాములు కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి హెల్మెట్‌లో పాము కలకలం రేపింది. నాగుపాము బుసలు కొట్టుకుంటూ ప్రత్యక్షమైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో దేవ్ శ్రేష్ట అనే వ్యక్తి నవంబర్1న షేర్ చేశారు. ఇందులో నేలపై ఉంచిన హెల్మెట్‌లో పాము కనిపిస్తుంది. దగ్గరగా ముడుచుకొని హెల్మెట్‌లో నుంచి బయటకు చూస్తూ ఉంది. దాని దగ్గరకు ఎవరైనా వచ్చేందుకు ప్రయత్నిస్తే దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే హెల్మెట్‌లో పాము ఉన్న విషయాన్ని అతడు ముందుగానే గమనించడంతో ప్రాణాలుదక్కించుకున్నాడు. తాజాగా ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. నాలుగు మిలియన్లకు పైగా వీక్షించారు. 43వేల మంది లైక్ కొట్టారు.
కాగా పాములు జనావాసాల్లోకి రావడం వస్తువుల్లోకి దూరడం ఇదేం తొలిసారి కాదు. ఇటీవల కేరళలోని త్రిస్సూర్‌లో పార్క్ చేసిన బైక్ హెల్మెట్‌లో పాము దాక్కుంది. సోజన్ అనే వ్యక్తి తాను పని చేసే ప్రాంతంలో ఓ చోట బైక్ పార్క్ చేసి ఉంచాడు. పని ముగించుకుని ఇంటికి వెళ్దామని సాయంత్రం బైక్ తీయబోయాడు. అందులో పాము పిల్ల కనిపించిడంతో నిర్ఘాంతపోయిన సోజన్.. పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చాడు. హెల్మెట్‌లో నుంచి దాన్ని బయటకు తీసి అటవీప్రాంతంలో విడిచిపెట్టారు.
‼️WATCH: A man in Kerala narrowly avoided a venomous snake bite when he discovered a small cobra inside his two-wheeler helmet. The incident unfolded at his workplace in Kerala’s Thrissur.
Sojan, who is a native of Thrissur, had placed his helmet on the platform beside his… pic.twitter.com/8OMTiqMGYE— truth. (@thetruthin) October 8, 2023
Comments
Please login to add a commentAdd a comment