సినీ ప్రపంచంలో ఉన్నతమైన అవార్డుగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం నేడు అట్టహాసంగా జరిగింది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ప్రధానం చేసే ఈ అవార్డుల కార్యక్రమాన్ని ప్రపంచం మొత్తం వీక్షిస్తూ ఉంటుంది. అయితే నేటి కార్యక్రమంలో ఓ భారతీయ సినిమా కూడా ఆస్కార్ అవార్డును అందుకుంది. స్త్రీ జీవితంలో ప్రధాన పరిణామమైన రుతుచక్రం ఇతివృత్తంతో రూపొందిన ‘పీరియడ్ : ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ డాక్యూమెంటరీని ఆస్కార్ వరించింది. ఈ వేడుకలో రెండు హాలీవుడ్ చిత్రాలు అవార్డుల పంటను పండించాయి. ‘రోమా’, ‘బ్లాక్ పాంథర్’ చిత్రాలకు అనేక విభాగాల్లో అవార్డులు వచ్చాయి. మొత్తంగా ఏ చిత్రానికి ఏ కేటగిరీల్లో అవార్డులు వచ్చాయంటే..
ఉత్తమ చిత్రం: గ్రీన్ బుక్
ఉత్తమ నటుడు: రామి మలేక్ (బొహేమియన్ రాప్సోడీ)
ఉత్తమ నటి: ఒలీవియా కోల్మన్ (ది ఫేవరేట్)
ఉత్తమ దర్శకుడు: ఆల్ఫోన్సో క్వారోన్ (రోమా)
ఉత్తమ సహాయ నటుడు: మహర్షెలా అలీ (గ్రీన్‌బుక్)
ఉత్తమ సహాయ నటి: రెజీనా కింగ్(ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్)
ఉత్తమ ఛాయాగ్రాహకుడు: అల్ఫాన్సో కరోన్(రోమా)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: ‘బ్లాక్ పాంథర్‘
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: రూత్‌కార్టర్(బ్లాక్ పాంథర్)
ఉత్తమ సౌండ్ ఎడిటింగ్: బొహెమియన్ రాప్సోడి
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: ‘స్పైడర్ మ్యాన్:ఇన్ టూ ది స్పైడర్ వర్స్
ఉత్తమ విదేశీ చిత్రం: ‘రోమా’
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ చిత్రం: ‘ఫ్రీ సోలో’
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం: పీరియడ్: ది ఎండ్ ఆఫ్ సెంటెన్స్ (భారతీయ చిత్రం)
Comments
Please login to add a commentAdd a comment