వైఎస్‌ జగన్‌ పేరు మీద ఫారం-7 దరఖాస్తు | Form 7 For YS Jagan Mohan Reddy To Remove His Vote | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ పేరు మీద ఫారం-7 దరఖాస్తు

Published Wed, Mar 13 2019 7:01 AM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

పులివెందులలో మరో అక్రమం బయటపడింది. టీడీపీ ప్రభుత్వం ఏకంగా ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఓటుకే ఎసరు పెట్టింది. అక్రమార్కులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేరు మీద ఫారం-7 దరఖాస్తు చేశారు. సాధారణంగా తమకు ఉన్న ఓటును తొలగించాలని ఓటరు ఎన్నికల అధికారికి ఫారం-7 ద్వారా దరఖాస్తు చేస్తారు. వైఎస్ జగన్‌ విషయంలో కూడా ఆయనకే తెలియకుండా టీడీపీ నాయకులే ఈ పని చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ విషయం తెలిసి వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆశ్చర్యపోయారు.
 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement