ఓటింగ్ డే అంటే చాలామంది ఓటర్లు అది సెలవు రోజుగా భావిస్తుంటారు. మరికొందరు తమ ఒక్క ఓటుతో ఏముందిలే మారిపోయేది అనుకుంటారు. కానీ అర్హులు అందరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని ప్రముఖులు కోరుతున్నారు. కోట్లు సంపాదిస్తున్నవారు, వ్యాపార దిగ్గజాలు సైతం రేపటి ప్రజాస్వామ్యంలో తమవంతు పాత్ర ఉండాలనే ఉద్దేశంతో ఓటు వేస్తూ అందరూ ఓటు వేయాలని కోరుతున్నారు. మన చేతిలోని బ్రహ్మాస్త్రంతో నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారం రాజ్యాంగం ఎన్నికల ద్వారా అందిరికీ కల్పించింది. దాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని ప్రముఖులు వేడుకుంటున్నారు.
సార్వత్రిక ఎన్నికలు ఫేజ్ 4
మొత్తం లోక్‌సభ సీట్లు: 96
రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు: 10
పోటీలోని మొత్తం: 1,717
మొత్తం పోలింగ్ స్టేషన్లు: 1,81,196
పోటీలో ఉన్న మహిళలు: 170
గ్రాడ్యుయేట్లు: 1,010
కోటీశ్వరులు: 476
అభ్యర్థులపై ఉన్న కేసుల సంఖ్య: 360
Comments
Please login to add a commentAdd a comment