
ఓటేసి వస్తే టిఫిన్ ఫ్రీ
శివమొగ్గ: ఓటు హక్కు చాలా విలువైనది, ఓటేసి వస్తే టిఫిన్లు ఫ్రీ అని శివమొగ్గలోని శుభం హోటల్ యజమాని ప్రకటించాడు. దీంతో ఓటేసినవారు పోలోమంటూ హోటల్‌కు రావడంతో రద్దీ ఏర్పడింది. ఓటు వేసిన సిరా గుర్తు చూపిస్తే టిఫిన్, టీ, కాఫీలు ఉచితంగా ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఓటర్ల కోసం ప్రత్యేక కౌంటర్‌లను పెట్టారు. ఉచితంగా మసాల దోసె, పలావ్ ఇచ్చి అభినందించారు.
ముఖ్యంగా ఓటర్లు మసాల దోసె కోసం ఎగబడ్డారు. యజమాని ఉదయ్ కదంబ మాట్లాడుతూ ఉచితమని చెప్పడం వల్ల వెయ్యి నుంచి 1500 వరకు మంది రావొచ్చని అనుకున్నా. కానీ సుమారు 5 వేల మందికి పైగా వచ్చారు. అయినా కూడా అందరికీ ఉపాహారం ఇచ్చామని, తమ వల్ల 5 వేల మంది ఓటు వేశారన్న సంతోషంగా ఉందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment