
విదేశాల నుంచి వచ్చి ఓటు
రాయచూరు రూరల్: జిల్లాలో మంగళవారం జరిగిన రెండో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో పాల్గొనేందుకు విదేశాల నుంచి కూడా భారతీయులు స్వదేశానికి తరలివచ్చి ఓటేయడం గమనార్హం. అమెరికా నుంచి శక్తినగర్‌కు తరలివచ్చిన డీవీఏ సయ్యద్ అబ్దుల్ ఖాద్రి తాలూకాలోని శక్తినగర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం–18లో ఓటు వేసి తన కర్తవ్యాన్ని నెరవేర్చారు. కాగా జిల్లాలోని మస్కి తాలూకా వటగల్‌కు చెందిన అమరేష్ కుటుంబ సభ్యులు రూ.3 లక్షలు ఖర్చు చేసుకొని ఓటు వేయడానికి స్వదేశానికి తరలిరావడం విశేషం. ఆయన ఒమన్ దేశం నుంచి మస్కికి వచ్చి ఓటేశారు.

విదేశాల నుంచి వచ్చి ఓటు