నరేంద్ర మోదీ విద్యార్హతల విషయం పెద్ద దూమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేత అజిత్ పవార్ మంత్రుల పట్టాల గురించి ప్రశ్నించడం సరికాదన్నారు. ఒక నాయకుడు తన హయాంలో ఏం సాధించారనే దానిపై ప్రజలు దృష్టిసారించాలని గానీ ఇలాంటివి కావని మండిపడ్డారు. ఈ మేరకు పవార్ బహిరంగ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హత గురించి మాట్లాడుతూ..2014లో ప్రజలు ప్రధాని మోదీ డిగ్రీ చూసే ఓట్లు వేశారా అని నిలదీశారు.
అందుకు ఆయన సృష్టించిన చరిష్మానే దోహదపడింది. అదే ఆయన్ను ఎన్నకల్లో గెలిచేలే చేసింది. తొమ్మిదేళ్లుగా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అలాంటి వ్యక్తి డిగ్రీ గురించి అడగడం అంత సరైంది కాదు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలపై అతనని ప్రశ్నించాలి గానీ మంత్రి డిగ్రీ ముఖ్యమైన అంశం కాదు. ఒకవేళ ఆయన డిగ్రీపై క్లారిటీ వస్తే గనుక ద్రవ్యోల్బణం తగ్గుతుందా? లేక అతన డిగ్రీ పరిస్థితులను చూసి ఉద్యోగాలు వస్తాయా? అని ప్రశ్నించారు.
అయినా ఈ విషయం కోర్టు వరకు వెళ్లడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది అని పవార్ అన్నారు. కాగా, గత వారమే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన మోదీ డిగ్రీ గురించి ప్రజలకు తెలియాలంటూ కేంద్ర సమాచార కమిషన్‌ని ఆశ్రయించిన సంగతి తెలిసిందిదే. అయితే గుజరాత్ హైకోర్టు కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) ఇచ్చిన ఉత్తర్వును పక్కన పెట్టి మరీ ప్రధానమంత్రి కార్యాలయం ప్రధాని డిగ్రీ సర్టిఫికేట్లను అందించాల్సిన అవసరం లేదని తీర్పు ఇస్తూ..అరవింద్ కేజ్రీవాలాకు జరిమానా విధించింది.
(చదవండి: గుండెపోటులకు కరోనానే కారణమా! ఆరోగ్యమంత్రి ఏం చెప్పారంటే..)
Comments
Please login to add a commentAdd a comment