‘‘ఎవరో ఒకరు... ఎపుడో అప్పుడు...నడవరా ముందుగా.. అటో.. ఇటో.. ఎటో వైపు’’
అప్పుడెప్పుడో వచ్చిన సినిమా ‘అంకురం’ కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన గీతం!
ఈ వీడియో చూస్తే ఆ పాట గుర్తుకు రాక మానదు. బెంగళూరు ట్రాఫిక్ కూడళ్లలో పండు ముదుసలి ఒకరు.. ‘‘నా ఓటు మార్పు కోసం... ద్వేషం కోసం’ కాదు అన్న ప్లకార్డ్ పట్టుకుని ఒంటరిగా ప్రచారం చేశారు. ఆ అనుభవజ్ఞుడి ప్రచారానికి జనాలూ ఫిదా అయ్యారు. ‘‘మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు’’ అంటూ కొందరు ప్రశంసించడమూ ఈ వీడియోలో చూడొచ్చు.
ನನ್ನ ಮತ ದ್ವೇಷಕ್ಕಾಗಿ ಅಲ್ಲ❌
ನನ್ನ ಮತ ಬದಲಾವಣೆಗಾಗಿ✅
ಒಂದು ವಿನೂತನ ಕ್ಯಾಂಪೇನ್👇 pic.twitter.com/MwkXcYe3JR— Mamatha R (@mamathcr) April 25, 2024
ఇక.. రేపు (శుక్రవారం) దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ జరగనుంది. లోక్‌సభ ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment