
అనకాపల్లి: భారత ఎన్నికల కమిషన్ జారీ చేస్తున్న కొన్ని ఓటరు గుర్తింపు కార్డులు తప్పుల తడకలుగా దర్శనమిస్తున్నాయి. అగనంపూడి నిర్వాసితకాలనీ కొండయ్యవలసకు చెందిన పట్టా రమణ పేరుతో జారీ అయిన కార్డులో ఆయన పుట్టిన తేదీ 01.01.1800 గా కార్డులో నమోదైంది.
అంటే ఆయన వయసు ప్రస్తుతం 223 ఏళ్లు. ఇలాంటి తప్పులు నివ్వెరపోయేలా చేస్తున్నాయి. కార్డు జారీ చేసే సమయంలో కనీస పర్యవేక్షణ లోపించడంతో ఇలాంటి తప్పులు దర్శనమిస్తున్నాయని ఓటర్లు వాపోతున్నారు.
ఈ పాపం బాబు హయాంలో జరిగిందేనని అంటున్నారు. 2014 నుంచి 2019 మధ్య ఓటర్ల జాబితాను తప్పుల తడక చేయడంలో చంద్రబాబు, తెలుగుదేశం నేతల పాత్ర ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై ఇటీవల ఎన్నికల సంఘానికి కలిసి వైఎస్సార్‌సిపి బృందం ఫిర్యాదు చేసింది. విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న ముఖ్య అంశాలు ఇవి.
- దొంగ ఓట్ల నమోదు బాబు హయాంలో విచ్చలవిడిగా జరిగింది
- నాడు సేవా మిత్ర నేడు మై టీడీపీ యాప్‌లతో చంద్రబాబు మాల్‌ప్రాక్టీస్ చేస్తున్నారు
- ఓటరు కులమేంటని అడుగుతున్నారు
- ఓటరు ప్రొఫైల్ సర్వే పేరిట అభ్యంతరకర ప్రశ్నలు అడుగుతున్నారు
- ఆధారాలు, పట్టికల రూపంలో ఫిర్యాదు చేస్తున్నారం
- ఒక్కరికి ఒక్క ఓటు ఉండాలన్నదే మా సిద్ధాంతం
- అదే విధానంతో పారదర్శక ఓటర్ల జాబితా కోరుతున్నాం
- ఆధార్‌తో ఓటరు కార్డు అనుసంధానం చేయాలి
ఈ తప్పులపై ఇప్పటికే ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. ఆధార్‌తో అనుసంధానం చేయగలిగితే.. 99% తప్పులు పరిహరిస్తాయని భావిస్తోంది. ఇదే జరిగితే.. ఓటర్ల జాబితా పక్కాగా ఉండడంతో పాటు.. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పారదర్శకంగా ఉంటుంది
Comments
Please login to add a commentAdd a comment