న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ఈసీ మొదలు సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరు ఓటు ఆవశ్యకత గురించి చెప్పడమే కాక ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు వేయాలంటూ తెగ ప్రచారం చేశారు. అయితే వీరి ప్రచారం ఏ మేరకు ప్రభావం చూపిందో తెలీదు కానీ ఓ ఢిల్లీ యువకుడు చేసిన ప్రయత్నం మాత్రం నెటిజన్లను ఆలోచనలో పడేయడమే కాక ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరలవుతోంది. డాక్టర్ అంగద్ సింగ్ చౌదరీ అనే వ్యక్తి తన ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసేవిధంగా ఉంది.
వీడియోలో ఓ యువకుడు.. తాను ఇష్టపడిన అమ్మాయికి.. తన ప్రేమ గురించి చెప్పాలనుకుంటాడు. కానీ ఆమె తిరస్కరిస్తుందేమో అనే ఆలోచనతో వెనకడుగు వేస్తుంటాడు. ఇదే విషయాన్ని తన స్నేహితులకు చెప్తాడు. అందుకు వారు ‘ఎక్కువగా ఆలోచించకు. వెళ్లి నీ ప్రేమ విషయాన్ని ఆ అమ్మాయికి చెప్పమ’ని సలహా ఇస్తారు. ధైర్యం కూడగట్టుకున్న ఆ యువకుడు.. యువతి దగ్గరకు వెళ్లి.. మోకాళ్ల మీద కూర్చుని.. తన ప్రేమను తెలియజేస్తాడు. అందుకు ఆమె కూడా అంగీకరిస్తుంది. దాంతో ప్రేమించిన యువతి చేతికి ఉంగరం తొడగడానికి ఆమె చేతిని అందుకుంటాడు. కానీ వెంటనే ఆ ఆలోచనని విరమించుకుంటాడు.
తాను ఆమెకి సరి జోడు కాదు.. మన్నించమని కోరతాడు. రెండు సెకన్ల ముందే తనను పెళ్లి చేసుకోమని కోరిన వ్యక్తి ఇంత సడెన్‌గా ఇలా మాట్లాడటంతో సదరు యువతి ఆశ్చర్యపోతుంది. కారణం అడుగుతుంది. అందుకు ఆ యువకుడు ఆమె చూపుడు వేలును చూపించి.. ఓటు వేయలేదని చెప్తాడు. అంతేకాక ‘దేశాన్ని ప్రేమించలేని వ్యక్తి.. తనను ఎలా ప్రేమిస్తుంద’ని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతాడు. సింపుల్‌గా చాలా మంచి సందేశం ఇచ్చిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
Che Guevara:
— Dr. Angad Singh Chowdhry (@angadc) May 5, 2019
“At the risk of seeming ridiculous, let me say that the true revolutionary is guided by a great feeling of love. It is impossible to think of a genuine revolutionary lacking this quality.”
Indian Tik Tok: pic.twitter.com/dlF5MWzIbd
Comments
Please login to add a commentAdd a comment