యుద్ధ సైరన్‌ల మధ్య ప్రియురాలికి ప్రపోజ్‌: వీడియో వైరల్‌ | Viral Video: Ukrainian Rescuer Proposing Girlfriend Amid Siren Wails | Sakshi
Sakshi News home page

Viral Video: ఉద్వేగ భరితమైన క్షణం: యుద్ధానికి వెళ్తూ... గర్లఫ్రెండ్‌కి ప్రపోజ్‌

Published Tue, Aug 2 2022 9:31 PM | Last Updated on Tue, Aug 2 2022 9:31 PM

Viral Video: Ukrainian Rescuer Proposing Girlfriend Amid Siren Wails - Sakshi

Heartbreaking visuals from war-battered Ukraine: ఉక్రెయిన్‌ రష్యా యుద్ధంతో అట్టుడికి పోతుంది. ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో వేలాది మంది సైనికులు నెలకొరిగారు. లక్షలాది మంది  నిరాశ్రయులయ్యారు. ఈ భయానక యుద్ధం ఉక్రెయిన్‌ని శిథిలా నగరంగా మార్చింది. ఎటూ చూసిన శవాల దిబ్బ మరోవైపు సైన్యం కొరత ఏర్పడిన ఏ మాత్రం వెరకవక రష్యాతో పోరాడుతోంది. ఈ తరుణంలో ఒక వ్యక్తి యుద్ధానికి సిద్ధమవుతూ ప్రియురాలికి ప్రపోజ్‌ చేశాడు. ఈ మేరకు సదరు వ్యక్తి మోకాళ్లపై నిలబడి తన ప్రియురాలికి ఐ లవ్‌ యూ అని ప్రపోజ్‌ చేశాడు.

ఆ వ్యక్తి యుద్ధా సైరన్‌లు నడుమ ప్రియురాలికి ప్రపోజ్‌ చేశాడు. యుద్ధం కారణంగా ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని తరుణంలో ఇలా ప్రపోజ్‌ చేశాడు ఉక్రెయిన్‌ ఎమర్జెన్సీ సంరక్షకుడు. గెరాష్చెంకో అనే వ్యక్తి ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ...అతను ఉక్రెయిన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి సలహాదారుడని చెబుతాడు.

అంతేకాదు ఈ వీడియోకి ఇప్పుడూ "మా జీవితం యుద్ధ జీవిత సమతుల్యత" అని ఒక క్యాప్షన్‌ని జోడించి మరీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. హృదయ విదారకరమైన విషయం ఏమిటంటే ఒక పక్కా ఆనందకరమైన క్షణం మరోవైపు సైరన్‌ల మోత ఏడుపు తెప్పించేలా ఆవేదనగా ఉంటుంది. అయినప్పటికీ మిగతా సంరక్షక్షులు ఆ జంటను సంతోషంగా ఉండండి అంటూ.. ఉత్సహపరుస్తారు.

(చదవండి: పనసకాయ కోసం ఎన్ని తిప్పలు పడిందో ఈ ఏనుగు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement