
ఓటు హక్కు వినియోగించుకునేందుకు సీఎం జగన్ స్వస్థలం పులివెందులోని భాకరాపురం..
వైఎస్సార్, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ వైఎస్సార్ జిల్లాకు వెళ్లనున్నారు. సాయంత్రం తాడేపల్లి నుంచి బయల్దేరి స్వస్థలం పులివెందులకు చేరుకుంటారు. రేపు.. సోమవారం ఉదయం పులివెందుల భాకరాపురంలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నుంచి సీఎం వైఎస్ జగన్ 90,543ఓట్ల మెజారిటీతో అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
క్లిక్ చేయండి: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024