బంజారాహిల్స్: పార్లమెంట్ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో చాలామంది ప్రముఖులు ఓటు వేయనుండగా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో కూడా మరికొంతమంది తారలు ఓటు వేయనున్నారు. గతేడాది నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఓటు వేసి తమ బాధ్యతను చాటిచెప్పారు. ప్రతిఒక్కరూ ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు. ఓటు ప్రాముఖ్యతను తెలియజేశారు. ప్రజలపై సినీతారల ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఆ ఎన్నికల్లో ఓటర్లు కూడా భారీగా తరలివచ్చి తాము సైతం అంటూ ఓటు వేశారు. సోమవారం జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో సైతం అటు సినీ ప్రముఖులు, ఇటు ఓటర్లు అదే స్ఫూర్తిని కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు.
👉 బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబ సమేతంగా బంజారాహిల్స్‌లోని నందినగర్ కమ్యూనిటీ హాలులో ఓటు హక్కు వినియోగించుకుంటారు.
👉 జూనియర్ ఎన్టీఆర్ బంజారాహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో, కల్యాణ్‌రామ్ ఎమ్మార్వో ఆఫీసు పోలింగ్ బూత్‌లలో ఓటు వేస్తారు.
👉 సినీ ప్రముఖుల్లో చిరంజీవి, సురేఖ, రామ్‌చరణ్, ఉపాసన, నితిన్‌లు జూబ్లీహిల్స్ క్లబ్ బూత్ నెంబర్–149లో ఓటు హక్కు వినియోగించుకుంటారు.
👉 హీరో రవితేజ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ, సెంట్రల్ నర్సరీ బూత్ నెంబర్ 157లో, అక్కినేని నాగార్జున, అమల జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45, ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో, మహేష్ బాబు, నమ్రత శిరోడ్కర్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఓటు వేస్తారు.
👉 విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, బ్రహ్మజీ, జీవిత, రాజశేఖర్‌లు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో మోహన్‌బాబు, మంచు విష్ణు, రాఘవేంద్రరావు, కోట శ్రీనివాసరావు, పరుచూరి గోపాలకృష్ణ, విశ్వక్‌సేన్, రాణా, సురేష్‌బాబు ఓటు వేస్తారు.
👉 అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు అరవింద్, అల్లు శిరీష్‌లు జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–69 బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్‌లో ఓటేస్తారు.
👉 హీరో వెంకటే‹Ù, బ్రహా్మనందం మణికొండ హైస్కూల్‌లో, రాజమౌళి, రమ షేక్‌పేట ఇంటర్నేషనల్ హైస్కూల్‌లో, సుధీర్ బాబు దర్గా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో, అల్లరి నరేష్ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45లోని మహిళా ఆర్థిక సహకార సంస్థలో, తనికెళ్ల భరణి యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు హైసూ్కల్ పోలింగ్ కేంద్రంలో, సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల పద్మారావు నగర్ వాకర్స్ టౌన్ హాలులో ఓటు వేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment