ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : 2019 సార్వత్రిక ఎన్నికల సందర‍్భంగా ఓటర్లకు గుడ్ న్యూస్. పోలింగ్‌లో ఓటింగ్ శాతానికి పెంచేందుకు పెట్రోలు డీలర్లు బంపర్ ఆఫర్ ప్రకటించారు. లోక్‌సభ మొదటి విడదల ఎన్నికల్లో మీరు ఓటు వేసిన తర్వాత పెట్రోల్‌గానీ, డీజిల్ గానీ కొనుగోలు చేస్తే దానిపై డిస్కౌంట్ ఆఫర్ ఉంది. పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసిన వారికి లీటరుపై 50 పైసలు డిస్కౌంట్ లభిస్తుంది.
దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ ఆఫర్ అందుబాటులోఉంటుంది. అయితే ఓటు వేసిన గుర్తును (వేలిపై ఇంకు గుర్తు) పెట్రోల్ బంకుల్లో చూపించి ఈ ఆఫర్‌ను పొందవచ్చు. పోలింగ్ రోజున దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ ఆఫర్ వర్తిస్తుందని ఆల్ ఇండియా పెట్రోలియమ్ డీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఓటు వేసేలా ప్రజలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ బన్సల్ తెలిపారు. అటు ఉత్తరాఖండ్‌లో పోలింగ్ సందర్భంగా ఏప్రిల్ 11న ఓటు హక్కును వినియోగించుకున్న వారికి పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై 50పైసలు డిస్కౌంట్ అందిస్తున్నట్టు ఉత్తరాఖండ్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది.
పోలింగ్ రోజున ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఒకరికి గరిష్టంగా 20 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్‌పై మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. కాగా స్వార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా తొలి దశ పోలింగ్ నేడు ( ఏప్రిల్ 11న) ప్రారంభమైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment