Discount on petrol
-
భారత్‌కు రష్యా ఓపెన్ ఆఫర్, డిస్కౌంట్లో ఆయిల్ కొంటే తప్పేంటట!
రష్యా నుంచి భారత్ ముడి చమురును కొనుగోలు చేస్తుంది. ఆ కొనుగోళ్లు అమెరికాతో పాటు పలు మిత్ర దేశాలకు మింగుడు పడడం లేదు. అందుకే తమని కాదని రష్యా నుంచి ఆయా ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తే భారత్‌పై ఆంక్షలు విధిస్తామనే హెచ్చరికలు పంపుతుంది. ఈ నేపథ్యంలో రష్యా- భారత్‌ల మైత్రిపై ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్ ఇస్తున్న అమెరికాకు భారత్ గట్టిగానే బదులిస్తున్నట్లు తెలుస్తోంది. 'డిస్కౌంట్‌కే ముడి చమురు ఇస్తామని రష్యా అంటుంది. దేశం కోసం రష్యా నుంచి చమరును కొనుగోలు చేస్తే తప్పేంటని' ప్రశ్నించారు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి. ఏప్రిల్ 1న జరిగిన 'ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్' కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..'రష్యా నుంచి భారత్ ముడి చమురును కొనుగోలు చేసింది. ఆ కార్యకలాపాలు కొనసాగుతాయి. పెట్రోలియం సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అధ్యక్షతన మరింత చమురు ఉత్పత్తుల్ని సేకరించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నారని' అన్నారు. చమురు ఉత్పత్తుల కొనుగోళ్లపై రష్యా డిస్కౌంట్లు అందిస్తుంది. ఈ ప్రోత్సహాకాలతో రష్యా నుంచి ఉత్పత్తులను పెద్ద ఎత్తున కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం రష్యా ఒక్కో బ్యారల్‌పై భారత్‌కు 35 డాలర్ల డిస్కౌంట్ ఇస్తుందని, యుద్ధానికి ముందే చమరు బ్యారెల్ కొనుగోళ్ల గురించి ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయినా “నేను నా జాతీయ ప్రయోజనాలకే మొదటి స్థానం ఇస్తాను. నా ఇంధన భద్రతకు మొదటి స్థానం ఇస్తాను. డిస్కౌంట్లో ముడి చమురు అందుబాటులో ఉంటే ఎందుకు కొనుగోలు చేయకూడదు. అలా చేస్తే తప్పేంటని అర్ధం వచ్చేలా కేంద్రం ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు. చదవండి: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, భారత్‌కు భారీ షాక్! -
ఓటు వేస్తే.. పెట్రోలుపై డిస్కౌంట్
సాక్షి, న్యూఢిల్లీ : 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటర్లకు గుడ్ న్యూస్. పోలింగ్‌లో ఓటింగ్ శాతానికి పెంచేందుకు పెట్రోలు డీలర్లు బంపర్ ఆఫర్ ప్రకటించారు. లోక్‌సభ మొదటి విడదల ఎన్నికల్లో మీరు ఓటు వేసిన తర్వాత పెట్రోల్‌గానీ, డీజిల్ గానీ కొనుగోలు చేస్తే దానిపై డిస్కౌంట్ ఆఫర్ ఉంది. పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసిన వారికి లీటరుపై 50 పైసలు డిస్కౌంట్ లభిస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ ఆఫర్ అందుబాటులోఉంటుంది. అయితే ఓటు వేసిన గుర్తును (వేలిపై ఇంకు గుర్తు) పెట్రోల్ బంకుల్లో చూపించి ఈ ఆఫర్‌ను పొందవచ్చు. పోలింగ్ రోజున దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ ఆఫర్ వర్తిస్తుందని ఆల్ ఇండియా పెట్రోలియమ్ డీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఓటు వేసేలా ప్రజలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ బన్సల్ తెలిపారు. అటు ఉత్తరాఖండ్‌లో పోలింగ్ సందర్భంగా ఏప్రిల్ 11న ఓటు హక్కును వినియోగించుకున్న వారికి పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై 50పైసలు డిస్కౌంట్ అందిస్తున్నట్టు ఉత్తరాఖండ్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. పోలింగ్ రోజున ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఒకరికి గరిష్టంగా 20 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్‌పై మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. కాగా స్వార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా తొలి దశ పోలింగ్ నేడు ( ఏప్రిల్ 11న) ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
ఈ అర్ధరాత్రి నుంచే పెట్రోల్, డీజిల్ పై డిస్కౌంట్
-
ఈ అర్ధరాత్రి నుంచే పెట్రోల్, డీజిల్ పై డిస్కౌంట్
న్యూఢిల్లీ: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఊరట ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. డిజిటల్ చెల్లింపుల ద్వారా పెట్రోల్, డీజిల్ పోయించుకునే వారికి 0.75 శాతం రాయితీ ఇవ్వనున్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ రాయితీ ప్రకటించింది. డెబిట్, క్రెడిట్ కార్డుల, ఈ-వాలెట్లు లేదా మొబైల్ వాలెట్లు ద్వారా నగదు చెల్లించే వారికి ఈ రాయితీ వర్తిస్తుంది. లీటరు పెట్రోల్ పై 49 పైసలు, లీటరు డీజిల్ పై 41 పైసలు రాయితీగా ఇస్తారు. కార్డు ద్వారా చెల్లించిన మూడు రోజుల తర్వాత రాయితీ డబ్బులు వినియోగదారుడి ఖాతాలో పడతాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 66.10, డీజిల్ ధర రూ.54.57గా ఉంది. పాత పెద్ద నోట్లను రద్దు చేసి నెల రోజులు పూర్తైన సందర్భంగా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ నెల 8న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పలు రాయితీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరిన్ని రాయితీల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి