
సాక్షి,హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం రేపటి(ఆదివారం)తో ముగియనున్న సందర్భంగా రాజకీయ పార్టీల ప్రచార హోరు సాగుతోంది.అటు సోషల్ మీడియాలో సెలబ్రిటీల సందేశాల జోరు కూడా పెరిగింది. ఓటు హక్కు వినియోగంపై ఉత్సాహాన్ని రేకెత్తించేలా విడియోలను పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఉరుకుపరుగుల జీవితంలో బిజీ బిజీగా గడిపే నగరవాసుల్లో ఓటు హక్కు వినియోగం శాతం పెంచేలా చైతన్యాన్ని కలిలిస్తున్నారు. ఈ విషయంలో ప్రముఖ యాంకర్ ఉదయ భాను ముందు వరుసగా నిలిచారు. తాజాగా మంచి కాఫీ లాంటి ‘ఆనంద్’ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించిన శేఖర్ కమ్ముల ఎన్నికలకు సంబంధించి మంచి సందేశంతో ముందుకొచ్చారు. మన నగరాన్ని నిజంగా ప్రేమిస్తే.. మనం తప్పకుండా డిసెంబరు 1 వతేదీన తప్పకుండా ఓటు వేయాలని ఆయన కోరారు. (లక్షలకు లక్షలు దోచేస్తారు : ఉదయభాను వీడియో)
Comments
Please login to add a commentAdd a comment