ఎన్నికల చిత్రాలు | Election Candidates Different Campaign Meny Ways | Sakshi
Sakshi News home page

ఎన్నికల చిత్రాలు

Published Tue, Dec 4 2018 10:09 AM | Last Updated on Tue, Dec 4 2018 10:34 AM

Election Candidates Different Campaign  Meny Ways - Sakshi

ప్రచార ర్యాలీలో ‘జై స్థానికం’ అన్న టీ షర్టులను ధరించిన కార్యకర్తలు


ఎంతమంది మదన్‌లో!

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): చిలప్‌చెడ్‌ మండలంలో సోమవారం టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు మదన్‌రెడ్డి చిత్రాలతో కూడిన మాస్కులను ధరించి సందడి చేశారు. 

కారంత  ప్రేమ


పెద్దశంకరంపేట(మెదక్‌): టీఆర్‌ఎస్‌పై అభిమానంతో ఆ పార్టీ గుర్తు కారు బొమ్మను గోరుపై పట్టే అంత పరిమాణంలో తయారు చేశాడు పేటకు చెందిన అవుసుల శ్రీనివాస్‌చారి. గతంలో కూడా ఎన్నో సూక్ష్మ కళాఖండాలను అతను తయారు చేశాడు. చిన్నపాటి అట్టముక్కలతో చిన్న కారును తయారు చేసినట్లు శ్రీనివాస్‌ తెలిపారు.

‘జై స్థానికం’


జోగిపేట(అందోల్‌)
: స్థానిక నినాదంతో అందోల్‌ టీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కించుకున్న క్రాంతి కిరణ్‌ అదే నినాదంతో ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. ప్రచార ర్యాలీలో ‘జై స్థానికం’ అన్న టీ షర్టులను కార్యకర్తలు ధరించి ఓటర్లను ఆకట్టుకుంట్నునారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement