* పింఛన్లు రావేమోనని దరఖాస్తుదారుల ఆందోళన
* దస్తావేజులు తగలబెట్టి అధికారుల నిర్భందం
* బండ్లగూడ పంచాయితీ పరిధిలో ఘటన
హైదరాబాద్: తవుకు పింఛన్లు రావేమోనని ఆందోళన చెందిన దరఖాస్తుదారులు అధికారులను నిర్భందించారు.. దస్తావేజులు తగలబెట్టారు..ప్రభుత్వకార్యాలయూనికి తాళం వేసి రచ్చ చేశారు. నగర పరిధిలోని బండ్లగూడ గ్రావు పంచాయుతీ పరిధిలో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రావుపరిధిలో వద్ధాప్య, వితంతు, వికలాంగులకు సంబంధించి 276 మంది పింఛన్‌దారులున్నారు. గతంలోనే సర్వే చేసి వీరికి పింఛన్లు అందిస్తున్నారు. అరుుతే తెలంగాణ ప్రభుత్వంలో అందరూ తిరిగి పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించడంతో గ్రావూనికి చెందిన 622 మంది దరఖాస్తు చేసుకున్నారు.
శనివారం వీరి దరఖాస్తులను ఇంటింటికి వెళ్లి అధికారులు పరిశీలించారు. ఈ సవుయుంలో అర్హులైన తమకు పింఛన్లు రద్దు చేస్తున్నారంటూ గ్రావుస్తులకు తెలియుడంతో ఒక్కసారిగా వారంతా పంచాయతీ కార్యాలయూన్ని చుట్టువుుట్టారు. దరఖాస్తు పత్రాలను తగలబెట్టి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిశీ లనఅధికారి భిక్షపతితో సహా వురో ఇద్దరు సిబ్బందిని కార్యాలయంలో ఉంచి తాళం వేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అధికారులను అక్కడి నుంచి తరలించారు.
కొద్దిసేపటికి రాజేంద్రనగర్ ఆర్డీవో సురే శ్, ఎమ్మార్వో చంద్రశేఖర్, ఎంపీడీవో సుభాషిణి పంచాయతీ కార్యాలయానికి వచ్చి సిబ్బందిని నిర్భందించిన ఘటనను అడిగి తెలుసుకున్నారు. పరిశీలన అధికారి భిక్షపతి ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా దస్తావేజులను కాల్చివేయుడం సరైందికాదని రాజేంద్రనగర్ తహసీల్దార్ చంద్రశేఖర్ అన్నారు. తవు వద్ద 622 దరఖాస్తుదారుల పూర్తి సమాచారం ఉందని, వాటి ఆధారంగా రెండురోజుల్లో ఇంటింటికీ తిరిగి అర్హులకు పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటావుని తెలిపారు.
పింఛన్ల పంచాయితీ!
Published Sat, Nov 1 2014 11:22 PM | Last Updated on Mon, Aug 20 2018 3:09 PM
Advertisement