
కర్నూలు (టౌన్): హిజ్రాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 1500 పింఛన్ మంజూరు చేస్తుందని, ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ సి.బి. హరినాథరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 సవంత్సరాలు అంతకన్నా ఎక్కువ ఉన్న హిజ్రాలు రేషన్‌కార్డు, ట్రాన్స్ జెండర్‌గా గుర్తింపు పత్రం, హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్పేర్ డిపార్టుమెంటు గుర్తించిన మెడికల్ అథారిటీ సర్టిఫికెట్ ప్రతులతో మున్సిపాల్టీ పింఛన్ విభాగంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆధార్ కార్డు నకలు కలిగి యాచకవృత్తి, వ్యభిచారం, బెదిరింపు తదితర చర్యలకు పాల్పడటం లేదని ధ్రువీకరణ పత్రం ఇవ్వాలన్నారు.