బహుజన రచయితల వేదిక ఆధ్వర్యంలో స్థానిక సీవీఎన్ రీడింగ్ రూంలో ఈనెల 24వ తేదీన ‘తెలుగు ముస్లిం అస్తిత్వ సాహిత్య’ రాష్ర్టస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు సదస్సు కన్వీనర్ నబి కె ఖాన్, సమన్వయకర్త డాక్టర్ నూకతోటి రవికుమార్ శుక్రవారం తెలిపారు.
ఒంగోలు కల్చరల్: బహుజన రచయితల వేదిక ఆధ్వర్యంలో స్థానిక సీవీఎన్ రీడింగ్ రూంలో ఈనెల 24వ తేదీన ‘తెలుగు ముస్లిం అస్తిత్వ సాహిత్య’ రాష్ర్టస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు సదస్సు కన్వీనర్ నబి కె ఖాన్, సమన్వయకర్త డాక్టర్ నూకతోటి రవికుమార్ శుక్రవారం తెలిపారు. పరిశోధకుల నుంచి పరిశోధన వ్యాసాలను కూడా ఆహ్వానిస్తున్నామన్నారు. సదస్సులో పలు పుస్తకాల ఆవిష్కరణతోపాటు సాహిత్య ఉపన్యాసాలుకూడా జరుగుతాయని సాహిత్యాభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వివరాలకు 98481 87416 నెంబరును సంప్రదించాలని తెలిపారు.