మన దేశంలో ఇప్పటికీ ఇల్లు లేని పేదవారు చాలా మంది ఉన్నారు. వారి కలల గృహం త్వరగా కట్టుకోవడానికి ఎంతో ఆరాట పడుతుంటారు. ఇలాంటి కలల గృహం చాలా కష్ట పడుతారు. అయితే, వారి దగ్గర ఉన్న సొమ్ముతో మరికొంత సొమ్మును వడ్డీకి తీసుకొని వచ్చి కట్టుకుంటారు. అయితే, అలాంటి వారి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) దేశంలోని అతిపెద్ద రుణదాత 6.70 శాతం వడ్డీ రేటుతో గృహ రుణాలను అందిస్తోంది. ఎస్‌బీఐ ఇటీవలి ప్రకటనలో, ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ఖాతాదారులు గృహ రుణం పొందడానికి అవసరమైన పత్రాల జాబితాను విడుదల చేసింది. ఎస్‌బీఐ గృహ రుణాన్ని పొందడానికి అవసరమైన ముఖ్యమైన పత్రాలు క్రింది విధంగా ఉన్నాయి.(చదవండి: దేశంలో 'ఈ' కార్ల అమ్మకాలు బంద్!)
- ఉద్యోగి గుర్తింపు కార్డు
- లోన్-అప్లికేషన్: పూర్తిగా నింపిన రుణ దరఖాస్తు ఫారం మీద మూడు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు అతికించాలి.
- గుర్తింపు రుజువు (ఏదైనా ఒకటి): పాన్ /డ్రైవర్ లైసెన్స్/ పాస్ పోర్ట్/ఓటర్ ఐడి కార్డు
- నివాస రుజువు లేదా చిరునామా(ఏదైనా ఒకటి): ఇటీవల విద్యుత్ బిల్లు/టెలిఫోన్ బిల్లు/ వాటర్ బిల్లు/ పైప్డ్ గ్యాస్ బిల్లు లేదా పాస్ పోర్ట్/ఆధార్ కార్డు/డ్రైవింగ్ లైసెన్స్ కాపీ
ప్రాపర్టీ పేపర్లు:
- నిర్మాణానికి అనుమతి (వర్తించే చోట)
- అమ్మకానికి నమోదు చేసుకున్న ఒప్పందం (మహారాష్ట్రకు మాత్రమే)/అమ్మకానికి స్టాంప్డ్ ఒప్పందం/కేటాయింపు లేఖ
- ఆక్యుపెన్సీ సర్టిఫికేట్(ఆస్తిని బదిలీ చేయడానికి సిద్ధంగా ఉంటే)
- మెయింటెనెన్స్ బిల్లు, విద్యుత్ బిల్లు, ప్రాపర్టీ ట్యాక్స్ రసీదు
- ఆమోదించబడ్డ ప్లాన్ కాపీ(జిరాక్స్ బ్లూప్రింట్), బిల్డర్ రిజిస్టర్డ్ డెవలప్ మెంట్ అగ్రిమెంట్, కన్వేయన్స్ డీడ్(కొత్త ఆస్తి కోసం)
- చెల్లింపు రసీదులు లేదా బిల్డర్ లేదా విక్రేతకు చేసిన అన్ని చెల్లింపులను చూపించే బ్యాంకు ఖాతా స్టేట్ మెంట్
బ్యాంక్ ఖాతా వివరాలు
- దరఖాస్తుదారుడు కలిగి ఉన్న అన్ని బ్యాంకు ఖాతాలకు సంబంధించి గత ఆరు నెలల బ్యాంకు ఖాతా స్టేట్ మెంట్లు
- ఒకవేళ ఇతర బ్యాంకులు నుంచి రుణం తీసుకుంటే, గత సంవత్సరం రుణ ఖాతా స్టేట్ మెంట్
వేతన దరఖాస్తుదారుడు
- శాలరీ స్లిప్ లేదా గత మూడు నెలల వేతన సర్టిఫికేట్
- గత రెండు సంవత్సరాలుగా ఫారం 16 కాపీ లేదా గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఐటి రిటర్న్ల కాపీ
వేతనేతర దరఖాస్తుదారుడు
- బిజినెస్ చిరునామా రుజువు
- గత మూడు సంవత్సరాల ఐటి రిటర్న్స్
- గత మూడు సంవత్సరాలుగా బ్యాలెన్స్ షీట్, లాభం మరియు నష్టం ఖాతా
- బిజినెస్ లైసెన్స్ వివరాలు(లేదా సమానమైనవి)
- టీడీఎస్ సర్టిఫికేట్ (ఫారం 16ఏ - ఒకవేళ వర్తిస్తే)
- అర్హత సర్టిఫికేట్(సి.ఏ/డాక్టర్ లేదా ఇతర ప్రొఫెషనల్స్ కోసం)
Comments
Please login to add a commentAdd a comment