డాక్యుమెంట్ల దొంగలకు నెలవారీ వేతనం | they paid monthly salery to documents thiefs | Sakshi
Sakshi News home page

డాక్యుమెంట్ల దొంగలకు నెలవారీ వేతనం

Published Tue, Apr 21 2015 4:44 AM | Last Updated on Sun, Sep 3 2017 12:35 AM

they paid monthly salery to documents thiefs

న్యూఢిల్లీ: కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖలో పత్రాలను లీక్ చేసిన వారికి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్ భారీ మొత్తాన్ని నెలవారీ వేతనం కింద చెల్లించేవారని పోలీసులు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. డాక్యుమెంట్ల లీకు కేసుకు సంబంధించిన చార్జిషీట్‌ను సోమవారం ఇక్కడి ఒక కోర్టుకు సమర్పించారు. లల్తా ప్రసాద్, రాకేష్ కుమార్ అనే నిందితులు నెలవారీ మొత్తం రూ. 2.5 లక్షలు తీసుకునేవారి చార్జిషీట్‌లో పేర్కొన్నారు.

ఆ మొత్తాన్ని ఆర్‌ఐఎల్‌కు చెందిన శైలేష్ సక్సేనా, ఎస్సార్‌కు చెందిన వినయ్ కుమార్, కెయిర్న్స్ ఇండియా నుంచి కేకే నాయక్, జుబిలంట్ ఎనర్జీ నుంచి సుభాష్ చంద్ర, అడాగ్‌కు చెందిన రిషి ఆనంద్‌తో పాటు ఎనర్జీ కన్సల్టెంట్ ప్రయాస్ జైన్, జర్నలిస్ట్ శంతను సైకియా చెల్లించేవారని పోలీసులు పేర్కొన్నారు. తమ వ్యాపార లావాదేవీల కోసం ఆ నిందితులకు నెలవారీగా చెల్లింపులు చేసేవారమని ఆయా కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు పోలీసుల విచారణలో అంగీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement