పాతాళ ప్రశ్నకు జవాబు ఏది?
‘‘నన్నొదలరా బాబూ... పాతాళప్రశ్నలు అడగకు’’ అంటాడు గురువు శిష్యుడితో.
ఏదైనా సులువైన ప్రశ్నకు జవాబు చెప్పలేనప్పుడు-
‘‘అదేంట్రా... అదేమైనా పాతాళప్రశ్నా? ఆ మాత్రం జవాబు చెప్పలేవా?’’ అనే మాట కూడా వినిపిస్తుంటుంది.
అసలింతకీ పాతాళప్రశ్న అంటే ఏమిటి?
అసలా మాటను ఎందుకు ఉపయోగిస్తారు?
కఠినమైన, సంక్లిష్టమైన ప్రశ్నను, జవాబు చెప్పడానికి అవకాశం లేని ప్రశ్నను పాతాళప్రశ్న అంటారు.
భూమి అడుగున ఉండే చిట్టచివరి లోకం పాతాళం. అక్కడికి చేరుకోవడం ఎంత కష్టతరం? అసలు సాధ్యపడే విషయమేనా? కానే కాదు. అలాగే కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పడమూ వీలుకాదు. జవాబు చెప్పడానికి ఏమాత్రం వీలుకాని అలాంటి కఠినమైన ప్రశ్నల విషయంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.