ఆధునిక భారతదేశ నిర్మాణానికి పునాదులు వేసినవాడు జవహర్‌లాల్ నెహ్రూ. వలసవాద వ్యతి రేకిగా, లౌకికవాదిగా, మానవతావాదిగా, ప్రజా స్వామ్యవాదిగా, స్వాతంత్య్ర ఉద్యమ నేతగా ప్రసిద్ధి గాంచిన వ్యక్తి నెహ్రూ... భారతదేశ సమగ్రాభివృద్ధికి దాదాపు 17 ఏళ్లు ప్రధానమంత్రిగా కృషి చేశారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో 9 సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. ఆ రోజుల్లో 1936లో ఆటో బయోగ్రఫీ, 1946లో ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ రచించి, ఆనాటి రాజకీయ, సామా జిక, సాంస్కృతిక, ఆర్థిక విషయాలను ప్రజలకు తెలియజేసి ప్రముఖ రాజ నీతిజ్ఞునిగా ప్రసిద్ధి కెక్కారు.
తండ్రి మోతీలాల్ నెహ్రూ కుమా రుని విద్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో సైన్స్‌లో డిగ్రీ చదివించారు. లండన్‌లోని ‘ఇన్నర్ టెంపుల్ ఇన్’లో న్యాయ శాస్త్రాన్ని అధ్యయనం చేసి లాయర్‌గా జీవితాన్ని ప్రారంభించారు నెహ్రూ. 1912 నుండి అఖిల భారత కాంగ్రెస్‌లో చురుకైన పాత్ర పోషించారు. 1920లో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమంలో, 1930లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో గాంధీ జీతో పాటు పాల్గొన్నారు. 1946లో ఏర్పడిన ప్రొవి జనల్ ప్రభుత్వంలో ప్రధానిగా ఎన్నికయ్యారు.
నెహ్రూ భారతదేశం లౌకిక తత్వంతో సోష లిస్టు భావజాలంతో ముందుకు వెళ్లడానికి తోడ్ప డ్డారు. ప్రైవేటు రంగంలో పెట్టుబడులు సమీక రించడం కష్టమవుతున్న నాటి పరిస్థితులలో వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేసిన ధీశాలి నెహ్రూ. బహుళార్థ సాధక భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, రైల్వేల అభివృద్ధి, రోడ్డు మార్గాలు, విమానాశ్ర యాలు, ఇనుము, ఉక్కుకర్మాగారాలు, శాస్త్ర పరి శోధన సంస్థలను ప్రభుత్వ రంగంలోనే ప్రారం భించిన దార్శనికుడాయన. ప్రముఖ ఆర్థిక వేత్త మహలనోబిస్ నేతృత్వంలో పంచవర్ష ప్రణాళి కలకు రూపకల్పన చేసి ప్రణాళికాబద్ధ అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి నెహ్రూ. అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో తటస్థ వైఖరి అవలంబించి, అలీన ఉద్యమానికి నేతృత్వం వహించారు.
ప్రతిరోజు భారత ప్రజలు వివిధ సమస్యలపై దాదాపు రెండు వేలకు పైగా ఉత్తరాలు రాసేవారు. ప్రతి రాత్రి అదనంగా నాలుగు లేదా ఐదు గంటలు పని చేసి, ఆ ఉత్తరాలను అధ్యయనం చేసి సమాధానాలను రాయడం ఆయన నిరంతర కృషికి నిదర్శనం. 12 శాతం అక్షరాస్యతతో ప్రపంచంలో అత్యధిక పేదలు ఉన్న దేశంగా ఉన్న భారత దేశాన్ని నెహ్రూ తన రాజకీయ పరిజ్ఞా నంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా స్వామ్య దేశంగా నిలబెట్టారు.
ఇంతటి గొప్ప దార్శనికుడు నెహ్రూజీకి బాలల పట్ల అమితమైన ప్రేమ, వాత్సల్యం ఉండేవి. అందుకనే పిల్ల లందరూ చాచా నెహ్రూగా పిలిచేవారు. అందుకే ఆయన జన్మదినమైన నవంబర్ 14వ తేదీని బాలల దినోత్సవంగా జరుపుకొంటున్నారు. నిజా నికి 1956 నుంచి అంతర్జాతీయ బాలల దినో త్సవం జరిగే రోజునే ఇండియాలోనూ బాలల దినోత్సవాన్ని జరిపేవారు. అయితే 1964 మే 27న పిల్లల్ని ఎంతగానో ఇష్టపడే నెహ్రూజీ తుదిశ్వాస విడిచిన తర్వాత... ఆయన పుట్టిన రోజును భారత ప్రభు త్వం బాలల దినోత్సవంగా జరపాలని నిర్ణ యించింది. ఈ తరుణంలో ఆ మహనీయుని స్ఫూర్తిని ఆవాహన చేసుకోవడం అవసరం.
వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి
వ్యాసకర్త ఏపీ అధ్యక్షులు, జన చైతన్య వేదిక
మొబైల్: 99499 30670
Comments
Please login to add a commentAdd a comment