Modern India
-
ఓటు ప్లాట్‌ఫామ్‌పై వందేభారత్
గౌరిభట్ల నరసింహమూర్తి: ఎన్నికల్లో తొలిసారి ‘రైలు’ ప్రచారాస్త్రంగా నిలవబోతోంది. గతంలో కొన్ని ప్రాంతాల్లో ‘ఇన్ని దశాబ్దాలు గడిచినా మా ప్రాంతానికి రైలు రాలేదు’ అన్న నెగెటివ్ అంశం ప్రచారంలో వినిపించినా.. ఇప్పుడు దానికి భిన్నంగా, ఓ రైలు ఘనతను తమకు అనుకూలంగా మలుచుకుంటూ నేతలు ప్రసంగ పాఠాన్ని సవరించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే జరిగిన కొన్ని ఉప ఎన్నికల్లో కనిపించిన ఈ పంథా, ఇప్పుడు తెలంగాణ ఎనిక్నల్లోనూ కనిపించబోతోంది. కేంద్రప్రభుత్వం ట్రెయిన్ 18 పేరుతో ప్రయోగాలు నిర్వహించిన తర్వాత ‘’వందేభారత్’గా పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. తొలి రైలే ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంది. బ్లూ చారలున్న తెలుపు రంగు కోచ్‌లు, ప్రత్యేకంగా పుష్ పుల్ పద్ధతిలో రెండు వైపులా ఇన్‌బిల్ట్ ఇంజిన్‌తో ఉండటం, 180 కి.మీ. వేగం అందుకునే సామర్ధ్యం, విలాసంగా కనిపించే కోచ్‌లు.. ఇలా ఒకటేమిటి, ఇంతకాలం విదేశాల్లోనే కనిపించిన రైలు మన పట్టాలపై పరుగు పెడుతుంటే ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఫలితంగా మా ప్రాంతానికి కావాలంటే మా ప్రాంతానికి కావాలంటూ రైల్వేపై అన్ని రాష్ట్రాల నుంచి ఒత్తిడి పెరిగింది. ఏకంగా మూడు రైళ్లతో.. దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉన్న ఈ వందేభారత్ రైళ్లు తెలంగాణకు ఏకంగా మూడు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలకు వాటిని కేటాయించనే లేదు. ఈ తరుణంలో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, సికింద్రాబాద్ నుంచి తిరుపతి, కాచిగూడ నుంచి బెంగళూరు మధ్య మూడు వందేభారత్ రైళ్లు పరుగుపెడుతున్నాయి. ఇప్పుడు ఇదే బీజేపీకి పెద్ద ప్రచారాస్త్రంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కొన్ని దశాబ్దాల కాలంలో తెలంగాణకు సాధారణ రైళ్లు మంజూరు కావటమే గొప్ప అనుకుంటున్న తరుణంలో, మోదీ ప్రభుత్వం సెమీ బుల్లెట్ రైళ్లుగా పేర్కొనే వందేభారత్ రైళ్లను మూడింటిని కేటాయించటాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో జరిగిన సభల్లో వందేభారత్ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. వాటి ప్రారంబోత్సవ కార్యక్రమాల్లో కేంద్రమంత్రి హోదాలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రముఖంగా పేర్కొంటూ తెలంగాణకు వరాలుగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు వందేభారత్‌ను కీర్తిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. జనవరి నాటికి స్లీపర్ క్లాస్ రైళ్లు కూడా.. ప్రస్తుతం పగటి పూట నడిచే చెయిర్‌కార్ కోచ్ రైళ్లు మాత్రమే తిరుగుతున్నాయి. జనవరి నాటికి స్లీపర్ క్లాస్ రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. వీటి చార్జీ ఎక్కువగా ఉన్నందున, సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా వందే సాధారణ్ రైళ్ల తయారీని కూడా ప్రారంభించారు. ప్రచారం చేయాలని.... ఆ రైళ్లపై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయం మొత్తంగా వందేభారత్ రైళ్లు సంబంధించిన పూర్తి సమాచారాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు రైల్వే శాఖ నుంచి సేకరించారు. వాటి వివరాలను పార్టీ కార్యకర్తలకు కూడా అందిస్తున్నారు. ప్రచారంలో వీటిని విస్తృతంగా ప్రజలకు తెలియజెప్పాలని సూచిస్తున్నారు. మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట వరకు ప్రారంభించిన రైలు సర్వి సు కూడా ప్రచారంలో భాగమవుతోంది. ఆ రైలు సర్వీసు ప్రారంభం రోజు ఆ ఘనత తమదంటే తమది అంటూ బీజేపీ–బీఆర్ఎస్ నేతలు పేర్కొంటూ దాడులు చేసుకున్న సంగతి విదితమే. దీంతో ఎన్నికల్లో కూడా స్థానికంగా అది ప్రచారాస్త్రంగా మారబోతోంది. రెండు దశాబ్దాలుగా పెండింగులో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేసి కాచిగూడ నుంచి దేవరకద్ర మీదుగా కర్ణాటక సరిహద్దులోని కృష్ణా స్టేషన్ వరకు రోజువారీ ప్యాసింజర్ రైలు సర్వి సును ఇటీవల ప్రారంభించారు. ఈ రెండు రైళ్లను ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కొద్ది రోజుల ముందు స్వయంగా ప్రధాని మోదీ వచ్చి ప్రారంభించిన విషయం తెలిసిందే. అమృత్ భారత్స్టేషన్ల పేరుతో రాష్ట్రంలో 21 స్టేషన్లకు పూర్తి ఆధునిక భవనాలు నిర్మించే పని ప్రారంభించారు. ఆధునిక రూపు తెస్తున్న ఘనత బీజేపీ ప్రభుత్వానిదే అని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. -
ఆధునిక దేశ నిర్మాత
ఆధునిక భారతదేశ నిర్మాణానికి పునాదులు వేసినవాడు జవహర్లాల్ నెహ్రూ. వలసవాద వ్యతి రేకిగా, లౌకికవాదిగా, మానవతావాదిగా, ప్రజా స్వామ్యవాదిగా, స్వాతంత్య్ర ఉద్యమ నేతగా ప్రసిద్ధి గాంచిన వ్యక్తి నెహ్రూ... భారతదేశ సమగ్రాభివృద్ధికి దాదాపు 17 ఏళ్లు ప్రధానమంత్రిగా కృషి చేశారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో 9 సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. ఆ రోజుల్లో 1936లో ఆటో బయోగ్రఫీ, 1946లో ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ రచించి, ఆనాటి రాజకీయ, సామా జిక, సాంస్కృతిక, ఆర్థిక విషయాలను ప్రజలకు తెలియజేసి ప్రముఖ రాజ నీతిజ్ఞునిగా ప్రసిద్ధి కెక్కారు. తండ్రి మోతీలాల్ నెహ్రూ కుమా రుని విద్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో సైన్స్‌లో డిగ్రీ చదివించారు. లండన్‌లోని ‘ఇన్నర్ టెంపుల్ ఇన్’లో న్యాయ శాస్త్రాన్ని అధ్యయనం చేసి లాయర్‌గా జీవితాన్ని ప్రారంభించారు నెహ్రూ. 1912 నుండి అఖిల భారత కాంగ్రెస్‌లో చురుకైన పాత్ర పోషించారు. 1920లో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమంలో, 1930లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో గాంధీ జీతో పాటు పాల్గొన్నారు. 1946లో ఏర్పడిన ప్రొవి జనల్ ప్రభుత్వంలో ప్రధానిగా ఎన్నికయ్యారు. నెహ్రూ భారతదేశం లౌకిక తత్వంతో సోష లిస్టు భావజాలంతో ముందుకు వెళ్లడానికి తోడ్ప డ్డారు. ప్రైవేటు రంగంలో పెట్టుబడులు సమీక రించడం కష్టమవుతున్న నాటి పరిస్థితులలో వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేసిన ధీశాలి నెహ్రూ. బహుళార్థ సాధక భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, రైల్వేల అభివృద్ధి, రోడ్డు మార్గాలు, విమానాశ్ర యాలు, ఇనుము, ఉక్కుకర్మాగారాలు, శాస్త్ర పరి శోధన సంస్థలను ప్రభుత్వ రంగంలోనే ప్రారం భించిన దార్శనికుడాయన. ప్రముఖ ఆర్థిక వేత్త మహలనోబిస్ నేతృత్వంలో పంచవర్ష ప్రణాళి కలకు రూపకల్పన చేసి ప్రణాళికాబద్ధ అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి నెహ్రూ. అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో తటస్థ వైఖరి అవలంబించి, అలీన ఉద్యమానికి నేతృత్వం వహించారు. ప్రతిరోజు భారత ప్రజలు వివిధ సమస్యలపై దాదాపు రెండు వేలకు పైగా ఉత్తరాలు రాసేవారు. ప్రతి రాత్రి అదనంగా నాలుగు లేదా ఐదు గంటలు పని చేసి, ఆ ఉత్తరాలను అధ్యయనం చేసి సమాధానాలను రాయడం ఆయన నిరంతర కృషికి నిదర్శనం. 12 శాతం అక్షరాస్యతతో ప్రపంచంలో అత్యధిక పేదలు ఉన్న దేశంగా ఉన్న భారత దేశాన్ని నెహ్రూ తన రాజకీయ పరిజ్ఞా నంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా స్వామ్య దేశంగా నిలబెట్టారు. ఇంతటి గొప్ప దార్శనికుడు నెహ్రూజీకి బాలల పట్ల అమితమైన ప్రేమ, వాత్సల్యం ఉండేవి. అందుకనే పిల్ల లందరూ చాచా నెహ్రూగా పిలిచేవారు. అందుకే ఆయన జన్మదినమైన నవంబర్ 14వ తేదీని బాలల దినోత్సవంగా జరుపుకొంటున్నారు. నిజా నికి 1956 నుంచి అంతర్జాతీయ బాలల దినో త్సవం జరిగే రోజునే ఇండియాలోనూ బాలల దినోత్సవాన్ని జరిపేవారు. అయితే 1964 మే 27న పిల్లల్ని ఎంతగానో ఇష్టపడే నెహ్రూజీ తుదిశ్వాస విడిచిన తర్వాత... ఆయన పుట్టిన రోజును భారత ప్రభు త్వం బాలల దినోత్సవంగా జరపాలని నిర్ణ యించింది. ఈ తరుణంలో ఆ మహనీయుని స్ఫూర్తిని ఆవాహన చేసుకోవడం అవసరం. వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి వ్యాసకర్త ఏపీ అధ్యక్షులు, జన చైతన్య వేదిక మొబైల్: 99499 30670 -
ఆధునిక భారత ముఖచిత్రం..‘కోహ్లీ’
చెన్నై: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆధునిక భారత్ ముఖ చిత్రమని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మాథ్యూ హెడెన్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ, ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను పోల్చమని అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానమిచ్చాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హెడెన్ కోహ్లీ, స్మిత్‌లను పోల్చడం కష్టమేనని, ఇద్దరూ సహజ సిద్దమైన ఆటగాళ్లేనని వ్యాఖ్యానించాడు. ఇరు జట్లకు బలమైన నాయకులన్న హెడెన్. కెప్టెన్సీలో మాత్రం తేడా ఉందన్నాడు. ఆసీస్ క్రికెటర్ల సమస్య గురించి ప్రస్తావించగా త్వరలోనే సమస్య పరిష్కారమవుతందని భావిస్తున్నాని తెలిపాడు. టెస్టులు క్రికెట్‌కు చాల ముఖ్యమైనవని, ఐసీసీ ఎలా బ్యాలెన్స్ చేస్తుందో తెలియదు కానీ క్రికెట్ మనుగడకు అవి ఎంతో అవసరమని అభిప్రాయపడ్డాడు. ఇక టెస్టులకు టీ20ల ముప్పు అన్న వాదనను హెడన్ కొట్టిపారేశాడు. ఏ ఫార్మాట్ అభిమానులు ఆ ఫార్మాట్‌ను ఆదరిస్తారని వారిని దృష్టిలో ఉంచుకోని ఐసీసీ ప్రణాళికలు చేయాలని పేర్కొన్నాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రాతినిథ్యం వహించిన ఈ ఆసీస్ క్రికెటర్, జట్టు తిరిగి రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు పెద్ద అభిమాని అని.. రెండు సంవత్సరాలుగా ఆజట్టు దూరమవ్వడం ఎంతగానో నిరాశపరిచిందని హెడన్ చెప్పుకొచ్చాడు. పాక్ చాంపియన్స్ ట్రోఫి గెలవడం అంతుపట్టని అంశమని భారత్‌పై పాక్ గెలుస్తుందని ఊహించలేదని హెడన్ వాపోయాడు. -
పీవీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
ఆయన ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పుడు దేశం పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దేశంలో ఎటుచూసినా నిరాశ, నిస్పృహలు నిండిన తరుణంలో ఆయన చూపిన దార్శనికత ఇప్పటికీ ఫలాలు అందిస్తూనే ఉంది. సరళీకృత ఆర్థిక విధానాలతో దేశ దిశను, దశను మార్చి.. భారతీయ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరొందిన ఆయనే పీవీ నరసింహారావు. ప్రధానమంత్రిగా దేశానికి కొత్త పునరుజ్జీవానాన్ని అందించిన పీవీ 95వ జయంతి సందర్భంగా ఆయనకు సంబంధించిన పది ఆసక్తికర విషయాలివి.. పీవీని ఆధునిక చాణుక్యుడిగా అభివర్ణిస్తారు. దేశం అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన సమయంలో ఆయన చూపిన చాణుక్యం, దార్శనికత ఆధునిక భారతానికి పునాదాలు వేశాయి. అత్యంత కఠినమైనవిగా భావించిన ఆర్థిక, రాజకీయ సంస్కరణలకు పీవీ ఆద్యుడిగా నిలిచారు. పీవీ బాహుముఖ ప్రజ్ఞాశాలి. బాహుభాషా కోవిదుడు. ఆయన తొమ్మిది భారతీయ భాషలు (తెలుగు, హిందీ, ఒరియా, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, సంస్కృతం, తమిళ్, ఉర్దూ), ఎనిమిది విదేశీ భాషలు (ఇంగ్లిష్, ఫ్రెంచ్, అరబిక్, స్పానిష్, జర్మన్, లాటిన్, పర్షియన్) మాట్లాడగలరు. ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన మొట్టమొదటి ప్రధానమంత్రి పీవీ. పీవీ ప్రభుత్వ హయాంలోనే రూపాయి విలువను తగ్గించి అంతర్జాతీయ వాణిజ్యానికి వీలుగా మార్చారు. దేశంలో అణ్వాయుధ పరీక్షలు నిర్వహించాలని మొదట భావించిన ప్రధాని పీవీనే. ఈ ఆలోచననే తదుపరి ప్రధాని వాజపేయి అమలుచేశారు. హైదరాబాద్ సంస్థానంలో 1940లో నిజాం రాజుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలోనూ పీవీ కీలక పాత్ర పోషించారు. 1948 నుంచి 1955 మధ్యకాలంలో ఆయన, ఆయన బంధువు కలిసి ‘కాకతీయ పత్రిక’ ను నడిపారు. పీవీకి ‘భారత రత్న’ ఇవ్వాలంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్యం సహా ఎన్నో పార్టీల నాయకులు, మంత్రులు గతంలో డిమాండ్ చేశారు. ‘లుక్ ఈస్ట్’ పాలసీని మొదటి చేపట్టిన ప్రధాని పీవీనే. వ్యూహాత్మకంగా కీలకమైన దక్షిణాసియా దేశాలతో సంబంధాలు నెరపాల్సిన ఆవశ్యకతను గుర్తించిన మొదటి ప్రధాని పీవీనే. లోక్‌సభలో మైనారిటీలో ఉన్నప్పటికీ పూర్తిగా ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడిపిన మొదటి ప్రధాని పీవీ నరసింహారావు. పీవీ సాహిత్య సేవ..! సహస్రఫణ్: విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన వేయిపడగలుకు పీవీ చేసిన హిందీ అనువాదం ఇది. ఈ పుస్తకానికి పీవీకి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది. ఇన్సైడర్: ఆయన రచించిన ఆత్మకథాత్మక నవల. తాను ముఖ్యమంత్రి పదవి అధిష్టించి.. దిగిపోయేంతవరకూ ఆయన జీవితఘట్టాలకు ఈ నవలలోని చిత్రణకు చాలా దగ్గర పోలిక వుంది. నవలలోని కథానాయకుడు ఆనంద్.. పీవీ నరసింహారావేనని విమర్శకులు భావించారు. ఇందులో జాతీయస్థాయి నాయకుల పాత్రలకు నిజమైన పేర్లు పెట్టి, రాష్ట్రనాయకుల పాత్రలకు మాత్రం పేర్లు మార్చారు. ఈ బృహన్నవల వివిధ భాషల్లోకి అనువాదమయింది. తెలంగాణా సాయుధ పోరాట నేపథ్యంలో పీవీ రాసిన "గొల్ల రామవ్వ" కథ కాకతీయ పత్రికలో 1949లో ప్రచురితమైంది. -
ఫస్ట్ లైవ్ బుక్
సన్‌బర్న్’... అంతర్జాతీయ స్థాయి సంగీతోత్సవం. మోడ్రన్ ఇండియా జోష్‌ను ప్రపంచానికి చూపిన సక్సెస్ఫుల్ ఈవెంట్. గోవాలో జరిగే ఈ ఇయర్లీ ఈవెంట్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ ఈవెంట్‌ని సిటీకి పరిచయం చేస్తున్న సందర్భంగా సన్‌బర్న్ కాన్సెప్ట్ సృష్టికర్త... బాలీవుడ్ నిర్మాత కూడా అయిన శైలేంద్రసింగ్ నగరానికి వచ్చారు. తన స్వీయానుభవాలతో రాసిన సన్‌బర్న్ పుస్తకాన్ని విడుదల చేసిన సందర్భంగా సిటీప్లస్‌తో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... భారత్‌లో చాలా మంది, చాలా ఘనత సాధించినప్పటికీ వాటిని పుస్తకాల్లోకి, రికార్డుల్లోకి తర్జుమా చేయటం గురించి ఆలోచించరు. విజయాలను, మార్పులను, గొప్ప విషయాలను రాబోయే తరాలకు అందించే ప్రయత్నం చేయరు. దీన్ని గమనించి... ప్రతి విజయానికీ అక్షర రూపం ఇవ్వడం అవసరమని గుర్తించాను. ది ట్రూ స్టోరీ ఆఫ్ సన్‌బర్న్ పుస్తకం అందులో భాగమే. నేడు సన్‌బర్న్ ఒక అంతర్జాతీయ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన విజయం. అయితే దీని వెనుక ఉన్న కథ గురించి నేను లేనప్పుడు ఎవరు మాట్లాడుకోరు. అందుకే నా కథ నేనే చెప్పాలని ఈ పుస్తకం రాశా. డ్రీమ్ నుంచే ఫేమ్... ఈ మధ్య యంగ్ జనరేషన్ కలలు కనడానికి కూడా సాహసించట్లేదు. నిజంగా ఒక కల కంటే దానిని సాకారం చేసుకోవటం అసాధ్యం కానే కాదు. పుస్తకాలు రాయడానికి నాకు ప్రత్యేక అర్హత లేదు కానీ రాయటం అవసర ం. నేను ఈ రోజు ఒక అంతర్జాతీయ గుర్తింపు పొందే రీతిలో ఒక పని చెయ్యగలుగుతున్నానంటే, అది మరెవరైనా చెయ్యగలరు. ఈ విషయాన్ని చదివి చాలా మంది స్ఫూర్తి పొందగలరు. వారి కలలకు వాస్తవ రూపం ఇవ్వగలరు. చీకటి పడితే నిద్రపోవాలా? సన్‌బర్న్ ఈవెంట్లు, బాలీవుడ్ సినిమాలు, చారిటీలు, అవేర్నెస్ క్యాంపైన్లు చేస్తూ కూడా మూడు పుస్తకాలు రాయడానికి సమయం ఎలా చిక్కిందంటే, చేయాల్సింది ఇంకా చాలా ఉందన్నదే నా సమాధానం. పొద్దున నిద్రలేవాలి. రాత్రి నిద్ర పోవాలి. కచ్చితంగా ఇలాగే ఉండాలనుకుంటే ఏదీ చేయలేం. అలసిపోయినప్పుడు నిద్ర పోతే చాలదా! ఇలా ఆలోచిస్తే మీరూ ఎన్ని పనులైనా చేయవచ్చు. హైదరాబాద్‌కు రావడమంటే చాలా ఇష్టం. ఎప్పుడు రావాలంటే అప్పుడు వచ్చేస్తుంటాను. నా మొదటి పుస్తకం ఫ్లాక్ నోస్ కూడా హైదరాబాద్‌లోనే లాంచ్ చేశా. మంచి గుర్తింపు వచ్చింది. అందుకే ఈ బుక్ ప్రీవ్యూ ఇక్కడే చెయ్యాలనిపించింది. నెక్ట్స్ సబ్జెక్ట్..! ఈ పుస్తకం తర్వాత మరో పుస్తకాన్ని కూడా లాంచ్ చేయబోతున్నా. అది సెక్స్ గురించిన పుస్తకం. 18 ఏళ్ల నా కొడుకుతో సెక్స్ గురించిన విషయాలు చెప్పాలనుకున్నా, చర్చించాల్సిన అవసరం ఉన్నా.. వాటిని మాటల్లో చెప్పలేను. కానీ చెప్పలేని ఎన్నో విషయాలను రాయవచ్చని ఇలా పుస్తక రూపంలో పెట్టా. ఈ పుస్తకం జనవరిలో లాంచ్ చేస్తున్నా.