బాలల దినోత్సవం: పిల్లలకు గవర్నర్‌ సందేశం | Biswa Bhusan Harichandan Message To Children On Nov 14th In Amaravati | Sakshi
Sakshi News home page

మనం జీవించే సమాజానికి పునాది వారే

Published Fri, Nov 13 2020 7:49 PM | Last Updated on Fri, Nov 13 2020 7:53 PM

Biswa Bhusan Harichandan Message To Children On Nov 14th In Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: రేపు బాలల దినోత్సవం సందర్భంగా ఏపీ గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ శుక్రవారం రాజ్‌ భవన్‌ నుంచి సందేశం ఇచ్చారు. శనివారం(నవంబర్‌ 14)న పండిట్‌ జవహర్‌లాల్‌ నేహ్రు జన్మదినం, ఈ రోజున ప్రతి ఎడాది బాలల దినోత్సవంగా జరుపుకుంటామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పిల్లలందరికి ఆయన హృదయపూర్వక శుభకాంక్షలు తెలిపారు. చిన్నారులపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని, వారే రేపటి భావి భారత పౌరులన్నారు. చిన్నారులు దేశం యొక్క నిజమైన బలమని, మనం జీవించే సమాజానికి పునాది అని పేర్కొన్నారు. మాతృభూమిని రక్షించడం, దేశానికి ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించడం భావి భారత పౌరులుగా వారి బాధ్యత అని గవర్నర్‌ వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement