
బాలల దినోత్సవం సందర్భంగా సినీ ప్రముఖులు తమ చిన్ననాటి ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా ఈ జనరేషన్ యంగ్ హీరో ఆసక్తికరమైన ఫొటోలతో తన ఫ్యాన్స్‌ను అలరించారు. అదే బాటలో యంగ్ హీరో మంచు మనోజ్ ఓ ఆసక్తికరమైన ఫొటోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశాడు. చిన్నతనంలో అక్క లక్ష్మీ ప్రసన్న, అన్న విష్ణులతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన మనోజ్, ‘మీలోని ప్రేమ, ఆనందాన్ని వ్యక్తీకరించండి, మీలోని బాల్యాన్ని సజీవంగా, ఆనందంగా ఉంచండి. అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశాడు. ఇటీవల ఒక్కడు మిగిలాడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మనోజ్, నటుడిగా మంచి మార్కులు సాధించాడు. మరో హీరో విష్ణు ప్రస్తుతం ఆచారి అమెరికా యాత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
Express your joy, love and laughter. Keep that inner child in you alive and happy! Happy #ChildrensDay everyone! ❤️ pic.twitter.com/HlmDzKMXel
— Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) 14 November 2017
Comments
Please login to add a commentAdd a comment