
హైదరాబాద్: నవంబర్ 14న పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పుట్టిన రోజును మనం బాలల దినోత్సవం జరుపుకుంటాం. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఈ దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకున్నారు. పిల్లలు తమ ఫ్యాన్సీ డ్రస్సులతో అందరి చూపు వారిపై ఉండేలా చేశారు. ఓ చిన్నారి మంత్రి కేటీఆర్‌లా డ్రస్ వేసి ఆయన దృష్టిని ఆకర్షించింది. ఫ్యాన్సీ డ్రస్సు ఈవెంట్‌లో చిన్నారులు రకరకాల దుస్తులతో పాల్గొన్నారు. అందులో భాగంగా పిల్లలు మోడ్రన్‌గా రెడీ అయి ఈవెంట్‌కు హజరయ్యారు.
కానీ రెండేళ్ల పాప ఐరా కేటీఆర్‌లా దుస్తులు వేసుకుని బాలల దినోత్సవ వేడుకలకు వచ్చింది. అంతేకాక మెడలో గులాజీ రంగు టీఆర్‌ఎస్ పార్టీ కండువాను, కేటీఆర్ పేరు ఉన్న కార్డు కూడా వేసుకుంది. చూడముచ్చటగా ఉన్న బుజ్జాయి ఫొటోలను తల్లిదండ్రులు మంత్రికి పంపించారు. ఆ ఫొటోలను కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశారు. ‘ ఆ చిన్నారి ఫొటోలు నా మనసుకు ఎంతగానో హత్తుకున్నాయి. ఆ పాప తల్లిదండ్రులకు ధన్యవాదాలు’ అంటూ తన అకౌంట్ కేటీఆర్ ట్విట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment